దేశభక్తి ఉన్నవారు ఎవరు ఇలా చెయ్యరు… విశాఖ పట్నం మ్యాచ్ పై మండిపడుతున్న నెటిజన్లు…. అసలేం జరిగింది.?

భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం జరిగిన టీ-20 మ్యాచ్ ప్రారంభంలో కెప్టెన్ విరాట్ కోహ్లి కాస్త అసహనానికి లోనయ్యాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అభిమానులు ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. భారత్‌- ఆస్ట్రేలియాల మధ్య విశాఖపట్నంలో తొలి టీ20 మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభంలో ఇరు జట్లు జాతీయ గీతాలాపన చేసి పుల్వామాలో అమరులైన వీరులకు సంతాపంగా మోనం పాటించారు. అయితే ఆ సమయంలో కొంత మంది అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ఆ సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లి కాస్త అసహనం వ్యక్తం చేసాడు. కాసేపు మౌనంగా ఉండాలంటూ అభిమానులకు సైగలతో సూచించాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రేక్షకులపై మండిపడుతున్నారు. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల కోసం మౌనం వహిస్తుంటే కొంత మందికి ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. బుద్ధి లేకుండా అరస్తూ, ఛీర్ చేస్తారా అంటూ మండిపడ్డారు. కొంత మంది ఫోన్లు చూసుకుంటూ, మరికొంత మంది ఫోన్లలో ఫొటోలు తీయడంతో దేశ భక్తిని మర్చిపోయారని కామెంట్లు చేసారు. నిజమైన దేశ భక్తి ఉన్నవాళ్లు ఎవరు కూడా ఇలా ప్రవర్తించరు. . దురభిమానానికి, ఉన్మాదానికి ఇది మరొక ఉదాహరణ. మళ్లీ వాళ్లే దేశభక్తి గురించి లెక్చర్లు దంచుతారు’ అంటూ ఘాటుగా విమర్శించారు
కాగా విశాఖపట్నం వేదికగా జరిగిన తొలి టీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల నష్టంతో ఓటమిపాలైంది.

Tweet:

Comments

comments

Share this post

scroll to top