ఆ గ్రామ వాసులు అందరు రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అయ్యారు..! ఎలాగో తెలుసా..?

రాత్రికి రాత్రి మీరు కోటీశ్వ‌రుల‌య్యారు అనుకోండి.. అప్పుడు మీ స్పంద‌న ఎలా ఉంటుంది ? ఇంకేముందీ.. ప‌ట్ట‌రానంత సంతోషం క‌లుగుతుంది. ఇక లైఫ్‌లో సెటిల్ అయిన‌ట్టే అవుతుంది. ఆ సంతోషాన్ని ఎలా సెల‌బ్రేట్ చేసుకోవాలో మీకు అర్థం కాదు. అయితే ఇది స‌రే. అయినా ఇలా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కావ‌డం అనేది ఎక్క‌డైనా జ‌రుగుతుందా ? కేవ‌లం లాట‌రీ టిక్కెట్ కొంటే త‌ప్ప.. ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌వు. జ‌రిగేందుకు అవ‌కాశం లేదు.. అంటారా.. అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే… మ‌న దేశంలో ఆ రాష్ట్రంలోని ఓ గ్రామానికి చెందిన వారు నిజంగానే రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుల‌య్యారు. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. కొంప‌దీసి వారు గానీ లాట‌రీ టిక్కెట్లు కొన్నారా ? ఏంటీ.. అని అడ‌గ‌బోతున్నారా.. అయితే అది కానే కాదు.. వారు లాట‌రీ టిక్కెట్లు కొన‌లేదు. కానీ అదృష్టం వారి త‌లుపు త‌ట్టింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే…

అది అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని బొంజా అనే గ్రామం. ఆ గ్రామం పూర్తిగా ప‌ర్వ‌తాల్లో ఉంటుంది. ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి నెలవుగా ఆ గ్రామం ఉంటుంది. అయితే ఆ గ్రామంలో ఉంటున్న ప్ర‌జ‌ల‌కు చెందిన 200.056 ఎక‌రాల భూమిని భార‌త ర‌క్ష‌ణ శాఖ గ‌తంలో స్వాధీనం చేసుకుంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ గ్రామ‌స్తుల‌కు త‌మ భూముల‌కు త‌గిన న‌ష్ట ప‌రిహారం ఇవ్వ‌లేదు. అయితే తాజాగా ఆ న‌ష్ట ప‌రిహారాన్ని ర‌క్ష‌ణ శాఖ ఆ గ్రామ‌స్తుల‌కు ఇచ్చింది. దీంతో మొత్తం 200 ఎక‌రాల‌కు గాను అంద‌రికీ క‌లిపి రూ.40.80 కోట్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఒక్కో గ్రామ‌స్తునికి క‌నిష్టంగా రూ.1 కోటి దక్క‌గా అందులో ఒక వ్య‌క్తికి ఏకంగా త‌న భూమికి గాను రూ.6.73 కోట్లు వ‌చ్చాయి. మ‌రో వ్య‌క్తికి రూ.2.44 కోట్లు వ‌చ్చాయి. దీంతో ఆ గ్రామ‌వాసులంతా రాత్రికి రాత్రే కోటీశ్వ‌రుల‌య్యారు.

అలా బొంజా గ్రామ ప్ర‌జ‌లు రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు అవ‌డం ఏమోగానీ ఆ వార్త కాస్తా వైర‌ల్ అయింది. ఈ మ‌ధ్యే తాజాగా ఆ రాష్ట్ర సీఎం పేమ ఖండు స‌ద‌రు మొత్తానికి సంబంధించిన చెక్కుల‌ను గ్రామ‌స్తుల‌కు అంద‌జేశారు. దీంతో ఇప్పుడా గ్రామ‌స్తులు ప‌ట్ట‌రానంత సంతోషానికి గుర‌వుతున్నారు. ఇక ఆ గ్రామ‌స్తుల భూముల‌ను కొన్న ర‌క్ష‌ణ శాఖ అక్క‌డ ఇండియ‌న్ ఆర్మీ కోసం ప‌లు ప్ర‌త్యేక నివాస స‌ముదాయాల‌ను నిర్మించ‌నుంది. ఏది ఏమైనా ఆ గ్రామ‌స్తుల ల‌క్ నిజంగా 100 శాతం ఉంది క‌దా..!

https://www.scoopwhoop.com/residents-of-arunachal-pradesh-became-millionaires/?ref=latest&utm_source=home_latest&utm_medium=desktop#.lqm2kntbu

Comments

comments

Share this post

scroll to top