ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల వెనుక భాగాల్లో పైన‌, కింద ఉండే ప్లాస్టిక్ లైన్ల‌ను గ‌మ‌నించారా..? అవేమిటో తెలుసా..?

సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ గ‌తంలో ఐఫోన్ 7, 7ప్ల‌స్‌ల‌ను విడుద‌ల చేయ‌గా, మొన్నామ‌ధ్యే ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, 10 ల‌ను విడుద‌ల చేసింది. అయితే ఇప్పటి వ‌ర‌కు యాపిల్ విడుద‌ల చేసిన ఐఫోన్లు అన్నింటిలోనూ ఐఫోన్ 6 వ‌చ్చిన‌ప్పుడు జ‌నాలు దానికి సంబంధించిన ఓ విష‌యం ప‌ట్ల చాలా క‌న్‌ఫ్యూజ‌న్‌కు గుర‌య్యారు. అప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణ డిజైన్‌తో వ‌చ్చిన ఐఫోన్ ఒక్క‌సారిగా మెట‌ల్ బాడీతో చాలా స్లిమ్ లుక్‌తో ఐఫోన్ 6 రూపంలో లాంచ్ అయిన‌ప్పుడు ఆ డిజైన్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. కానీ దాని బాడీ వెనుక భాగంలో ఉన్న గీత‌ల‌పై కొంద‌రు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల‌కు వెనుక భాగంలో పైన కింద ఉండే ప్లాస్టిక్‌ లైన్ల‌ను చాలా మంది గేలి చేశారు. అయితే నిజానికి వాటిని అలా ఎందుకు పెట్టారో తెలుసా..?

యాపిల్ సంస్థ ఐఫోన్ 6 ఫోన్‌ను పూర్తిగా మెట‌ల్‌తో త‌యారు చేసింది. ఈ క్ర‌మంలో వెనుక భాగాన్ని మెట‌ల్‌తో పూర్తిగా క‌ప్పేస్తే సిగ్న‌ల్స్ లోప‌లికి వెళ్ల‌డం క‌ష్ట‌మ‌ని ఆ సంస్థ భావించింది. దీంతో ఫోన్ వెనుక భాగంలో పైన‌, కింద ప్లాస్టిక్ లైన్ల‌ను ఏర్పాటు చేసింది. దీంతో వాటి గుండా సిగ్న‌ల్స్ లోప‌లికి సుల‌భంగా వెళ్తాయి. అందుకే ఆ లైన్ల‌ను ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల వెనుక భాగంలో ఇచ్చారు. ఈ లైన్ల‌ను యాంటెన్నా బ్యాండ్స్ అని పిలుస్తారు. అయితే కొంద‌రికి అవి న‌చ్చ‌లేదు.

దీంతో చాలా మంది ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల డిజైన్ ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే కొంద‌రైతే ఆ లైన్ల‌ను త‌ప్పుగా అర్థం చేసుకున్నారు. అవి ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల సిగ్న‌ల్ స‌రిగ్గా రావ‌డం లేద‌ని కంప్లెయింట్ చేయ‌డం మొద‌లు పెట్టారు. నిజానికి ఆ లైన్ల‌ను ఏర్పాటు చేసిందే ఫోన్ లోప‌లికి సిగ్న‌ల్ వెళ్తుంద‌ని, కానీ ఇది త‌ప్పుగా ప్ర‌చార‌మైంది. దీంతో యాపిల్ త‌ల ప‌ట్టుకుంది. అయితే ఆ త‌రువాత వ‌చ్చిన ఐఫోన్ 7, 7 ప్ల‌స్‌, తాజాగా విడుద‌లైన ఐఫోన్ 8, 8 ప్ల‌స్‌, 10 ఫోన్ల‌లో మాత్రం ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల‌లా వెనుక భాగంలో యాంటెన్నా లైన్ల‌ను ఏర్పాటు చేయ‌లేదు. కానీ సిగ్న‌ల్ మెట‌ల్ లోప‌లికి చొచ్చుకుని పోయేలా ఈ ఫోన్ల‌ను తీర్చిదిద్దారు. దీంతో యాంటెన్నా లైన్ల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం యాపిల్ కు రాలేదు. కాబ‌ట్టి తెలిసిందిగా… ఐఫోన్ 6 సిరీస్ ఫోన్ల వెనుక భాగాల్లో ప్లాస్టిక్ లైన్లు ఎందుకు ఉంటాయో..!

Comments

comments

Share this post

scroll to top