ఎయిడ్స్ వ్యాధికి మందు దొరికిన‌ట్టేనా..? అవున‌నే అంటున్నారు ఆ శాస్త్రవేత్త‌లు..!

ఎయిడ్స్‌…ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఏటా అధిక శాతం మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఎంతో మంది మ‌ర‌ణిస్తున్నారు కూడా. దాదాపు అన్ని దేశాల ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తున్న చికిత్స లేని వ్యాధి ఇది. అయితే అమెరికాకు చెందిన ప‌లువురు శాస్త్రవేత్త‌లు ఈ వ్యాధిని న‌యం చేయ‌డంలో దాదాపు చాలా వ‌ర‌కు ముందుకు దూసుకువ‌చ్చారు. ఎయిడ్స్ వ్యాధి ఉన్న ఎలుక‌ల‌పై వారు చేసిన ప్ర‌యోగాలు విజ‌య‌వంత‌మ‌వ‌డ‌మే ఇందుకు కార‌ణం.

laboratory-testing

అమెరికాలోని టెంపుల్ యూనివ‌ర్సిటీకి చెందిన లూయీస్ కాట్జ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్త‌లు ఎయిడ్స్ వ్యాధి ఉన్న కొన్ని ఎలుక‌ల‌పై ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌యోగాలు చేశారు. జీన్స్ ఎడిటింగ్ విధానంలో rAAV CRISPR/Cas-9 అనే పేరు గ‌ల కొన్ని క‌ణాల‌ను స‌ద‌రు ఎలుక‌ల‌లోకి ఇంజెక్ట్ చేశారు. దీంతో ఆ క‌ణాలు ఆ ఎలుక‌ల్లో ఎయిడ్స్ వ్యాధికి కార‌ణ‌మ‌వుతున్న డీఎన్ఏ జీన్స్‌ను పూర్తిగా నాశ‌నం చేయ‌గ‌లిగాయి. మెద‌డు, గుండె, కిడ్నీలు, లివ‌ర్‌, ర‌క్త క‌ణాలు త‌దిత‌ర అవ‌య‌వాల్లో ఉన్న HIV-1 DNA జీన్స్‌ను rAAV CRISPR/Cas-9 క‌ణాలు పూర్తిగా నిర్మూలించాయి. దీంతో ఆ శాస్త్రవేత్త‌ల ప్ర‌యోగం విజ‌య‌వంత‌మైంది.

hiv-aids

ప్ర‌స్తుతం మార్కెట్‌లో హెచ్ఐవీ వైర‌స్‌ను పూర్తిగా నిర్మూలించే మందులు లేవ‌ని, కాక‌పోతే ఆ వ్యాధి వ‌ల్ల వ‌చ్చే అనారోగ్య ల‌క్ష‌ణాల‌ను త‌గ్గించేందుకు మందులు ఉన్నాయ‌ని పైన చెప్పిన ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన ప్రొఫెస‌ర్ ఖ‌లిలి తెలిపారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు మందుల‌ను వాడ‌డం ఆపేస్తే హెచ్ఐవీ మరింత ముదిరి ఇంకా తీవ్ర‌మైన ప‌రిణామాలు సంభ‌వించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అన్నారు. కాగా తాము క‌నిపెట్టిన rAAV CRISPR/Cas-9 క‌ణాల‌ను హెచ్ఐవీ బాధిత వ్య‌క్తిలోకి ఎక్కిస్తే అవి HIV-1 DNA జీన్స్‌ను నాశ‌నం చేస్తాయ‌ని తెలిపారు. కానీ దీనిపై ఇంకా ప్ర‌యోగాలు జ‌ర‌గాల్సి ఉంద‌ని అన్నారు. ఎలుక‌లు, మ‌న‌షులు వేర్వేరు కాబ‌ట్టి ఆయా జీవుల శ‌రీరాల్లో ఉండే వైర‌స్ కూడా కొంత విభిన్నంగా ఉంటుంద‌ని, ఈ క్ర‌మంలో హెచ్ఐవీ ఎయిడ్స్‌తో బాధ‌ప‌డుతున్న రోగుల్లో ఉండే వైర‌స్ ఎలుక‌ల్లో ఉండే వైర‌స్ కన్నా మ‌రింత నిరోధ‌కంగా ఉంటుంద‌ని అన్నారు. దీని వ‌ల్ల తాము క‌నిపెట్టిన క‌ణాలు మ‌నుషుల‌పై అంత‌గా ప్ర‌భావం చూపిస్తాయో, లేదో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని, త్వ‌ర‌లోనే మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు చేసి పూర్తి స్థాయిలో మందును అందుబాటులోకి తెస్తామ‌ని ప్రొఫెస‌ర్ ఖ‌లిలి తెలిపారు. అదే జ‌రిగితే ఎయిడ్స్ అనే మ‌హ‌మ్మారి ఇక మ‌నుషుల్ని బాధించ‌దు క‌దా!

 

Comments

comments

Share this post

scroll to top