పెట్రోల్ బంక్ లో వాచ్ మెన్ గా ప‌నిచేస్తూ …కొడుకును CA చ‌దివించిన తండ్రి.

ముందు బాగా క‌ష్ట‌ప‌డితే చాలు… ఆ త‌రువాత వ‌చ్చే ఫ‌లితాలు ఎంతో మ‌ధురంగా ఉంటాయి… క‌ష్టేఫ‌లి అని పెద్ద‌లు అన్నారు క‌దా..! అందుకే… తొలుత చాలా క‌ఠోర శ్ర‌మ చేయాలి, క‌ష్ట ప‌డాలి. దాంతో ఆటోమేటిక్‌గా ఫ‌లితం వ‌స్తుంది. అప్పుడు క‌లిగే ఆనందం అంతా ఇంతా కాదు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని వంట బ‌ట్టించుకున్నాడు ఆ యువకుడు. కాబ‌ట్టే పేద కుటుంబంలో పుట్టినా మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సీఏ ప‌రీక్ష‌లు క్లియ‌ర్ చేశాడు. ఎట్ట‌కేల‌కు తాను అనుకున్న చార్ట‌ర్డ్ అకౌంటెంట్ కోర్సును అభ్య‌సించాడు. తన త‌ల్లిదండ్రులు ప‌డిన క‌ష్టానికి త‌గ్గ ఫ‌లితం అందించాడు. అత‌నే… సందీప్ అక్డే.

Sandip-Akde

సందీప్ అక్డేది పేద కుటుంబం. తండ్రి పెట్రోల్ పంపుల‌లో వాచ్‌మెన్‌గా ప‌నిచేసేవాడు. అందుకు గాను అత‌నికి నెల‌కు రూ.7వేలు ల‌భించేవి. దాంతో కుటుంబం గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉండేది. ఈ క్ర‌మంలో పెద్ద కొడుకుల‌ను చ‌దువు మాన్పించాడు. అయితే సందీప్ మాత్రం చ‌దువు మాన‌లేదు స‌రిక‌దా, ఎలాగైనా సీఏ (చార్ట‌ర్డ్ అకౌంటెంట్‌) కోర్సు చ‌ద‌వాల‌నుకున్నాడు. అందుకు అనుగుణంగా మొద‌ట్నుంచీ చ‌దువుల్లో అద్భుతంగా రాణిస్తూ వ‌చ్చాడు.

అయితే సీఏ అంటే మాట‌లు కాదు క‌దా. చాలా మంది 3, 4 సార్లు ఎగ్జామ్ రాస్తేనే… అదీ అతి క‌ష్టం మీద ప‌రీక్ష‌లు క్లియ‌ర్ చేయ‌గ‌లుగుతారు. ఇక మొద‌టి ప్ర‌య‌త్నంలోనే సీఏ ఎగ్జామ్ క్లియ‌ర్ కావాలంటే ఎలా చ‌ద‌వాలో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు కోచింగ్ కూడా తీసుకోవాల్సి వ‌స్తుంది. అనేక బుక్స్ చ‌ద‌వాల్సి వ‌స్తుంది. వాట‌న్నింటికీ డ‌బ్బులు కావాలి. అవి సందీప్ వ‌ద్ద లేవు. అయినా అత‌ను దిగులు చెంద‌లేదు. ఓ వైపు రోజూ అక్క‌డా ఇక్క‌డా చిన్న చిన్న ప‌నులు చేస్తూ డ‌బ్బులు సంపాదిస్తూనే మ‌రో వైపు త‌న‌కు అందుబాటులో ఉన్న లైబ్ర‌రీకి వెళ్లి త‌క్కువ రెంట్‌కే పుస్త‌కాల‌ను తెచ్చుకుని చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు. అలా అత‌ను రోజూ క‌ష్ట‌ప‌డి చ‌దివాడు. చివ‌ర‌కు సీఏ ఎగ్జామ్స్ మొద‌టి ప్ర‌య‌త్నంలోనే క్లియ‌ర్ చేసి అంద‌రి చేతా శ‌భాష్ అనిపించుకున్నాడు. పేద కుటుంబంలో జ‌న్మించినా క‌ష్ట‌ప‌డి సీఏ చ‌దివిన అత‌ని సంక‌ల్పానికి, ప‌ట్టుద‌ల‌కు, ఆత్మ‌విశ్వాసానికి నిజంగా మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top