జైలులో ఉండి క‌ష్ట‌ప‌డి చ‌దివి ఐఐటీలో 453వ ర్యాంక్‌ను సాధించిన పీయూష్‌… అత‌ని అంకిత భావానికి హ్యాట్సాఫ్‌…

ప‌ట్టుద‌ల‌తో చ‌దివి ఉన్న‌త ల‌క్ష్యాల‌ను సాధించాల‌నే త‌ప‌న మ‌న‌సులో ఉంటే చాలు, ఎంత‌టి క‌ష్ట‌త‌ర‌మైన స్థితిలో ఉన్నా అనుకున్న ల‌క్ష్యాల‌ను సాధించ‌గ‌లుగుతారు. ఇలా చ‌దివి ఉన్న‌త స్థానాల‌ను సాధించిన ఎంతో మందిని మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చూశాం. ఈ క్ర‌మంలో రాజ‌స్థాన్‌కు చెందిన ఆ యువ‌కుడు కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతాడు. చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌ష్టాల‌ను అనుభ‌విస్తూ పేద‌రికంలో ఉన్నా ల‌క్ష్య సాధ‌న దిశ‌గా ముందుకు సాగాడు. చివ‌ర‌కు అనుకున్న దాన్ని సాధించాడు. అయితే ఇక్క‌డే ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం ఒక‌టి దాగి ఉంది. అదేమిటంటే, అత‌ను చ‌దివిన ప్ర‌దేశం. అవును, అదే. ఇంత‌కీ అత‌ను చ‌దివింది ఎక్క‌డి నుంచో తెలుసా?  జైలు నుంచి, అవును అక్క‌డి నుంచే.

piyush

రాజ‌స్థాన్‌లోని కోట అనే ప్రాంతంలో ఉండే ఫూల్ చంద్ చాలా ఏళ్ల కిందట ఓ హ‌త్య చేశాడు. అందుకు గాను అత‌నికి 14 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. అయితే అత‌నికి పీయూష్ అనే కొడుకు ఉండేవాడు. ఈ క్ర‌మంలో ఫూల్ చంద్‌కు జైలు శిక్ష ప‌డ‌డంతో పీయూష్ ఒంట‌రి వాడ‌య్యాడు. ఇత‌ర కుటుంబ స‌భ్యులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పీయూష్‌కు ఎక్క‌డ ఉండాలో, ఎలా జీవించాలో అర్థం కాలేదు. కాగా ఫూల్ చంద్ అభ్య‌ర్థ‌న మేర‌కు పీయూష్‌ను పోలీసు అధికారులు జైలులో ఉండేందుకు అనుమ‌తిచ్చారు. ఈ క్ర‌మంలో పీయూష్‌కు చ‌దువు ప‌ట్ల ఆస‌క్తి కూడా పెరిగింది. కానీ తండ్రి జైలులో ఉండ‌డంతో అత‌ని చ‌దువుకు అయ్యే ఖ‌ర్చును ఏవిధంగా స‌మ‌కూర్చుకోవాలో అత‌నికి అర్థం కాలేదు. దీంతో జైలు అధికారులకు ఫూల్ చంద్ మళ్లీ విజ్ఞ‌ప్తి చేశాడు. ఈ క్ర‌మంలో అత‌న్ని రోజూ బ‌య‌టికెళ్లి ప‌నిచేసుకునేందుకు వారు అనుమ‌తిచ్చారు. కాక‌పోతే ఉద‌యం బ‌య‌టికి వెళ్తే సాయంత్రం మ‌ళ్లీ జైలుకి రావాల్సి ఉంటుంది. అయినా ఫూల్ చంద్ త‌న‌కు వ‌చ్చిన అవ‌కాశాన్ని ఏ మాత్రం పోనీయ‌లేదు. త‌న కుమారుడి చ‌దువుకోసం ఎంత‌గానో శ్ర‌మించాడు. అలా అత‌ను నెల‌కు రూ.12వేల దాకా సంపాదించి దాన్నంతా కొడుకు పీయూష్ చ‌దువు కోస‌మే వినియోగించాడు. అయితే పీయూష్ తండ్రి క‌ష్టాన్ని వృథా చేయ‌లేదు.

జైలులో అత్యంత ఇరుకైన చిన్న రూంలో ఉన్నా, రాత్రి 11 గంట‌లకు లైట్లు ఆఫ్ చేసినా, ఇత‌ర ఏ ఇబ్బంది ఎదురైనా ఎంతో ప‌ట్టుద‌ల‌గా క‌ష్ట‌ప‌డి చ‌దివాడు. ఇటీవ‌ల జ‌రిగిన ఐఐటీ-జీ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో 453వ ర్యాంకును సాధించి స‌త్తా చాటాడు. నిజ‌మైన క‌ష్టానికి, శ్ర‌మ‌కు, అంకిత భావానికి ద‌క్కిన ప్ర‌తిఫ‌లం అది. దీంతో ఫూల్ చంద్ ఎంత‌గానో ఆనందించాడు. కాగా ఇప్పుడ‌త‌ని జైలు శిక్ష కూడా ముగిసింది. ఈ క్ర‌మంలో అత‌ను బ‌య‌ట‌కు రాగానే కొడుకు చ‌దువు కోసం మ‌రింత క‌ష్ట‌ప‌డ‌తాన‌ని అంటున్నాడు. ఈ తండ్రీ కొడుకుల‌ను చూస్తే ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం అనిపించ‌క మాన‌దు. ఈ సంద‌ర్భంగా వారిద్ద‌రినీ మ‌నం అభినందించాల్సిందే. ఏమంటారు!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top