3డీ ఆర్ట్‌కు ప్రాణం వ‌స్తే… అది ఆ యువ‌కుడు గీసిన చిత్రాల‌లా ఉంటుంది…

కింద ఇచ్చిన చిత్రాల‌ను ఓ సారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించారా..? వాడి ప‌డేసిన కూల్‌డ్రింక్ క్యాన్, ప‌గ‌ల‌గొట్ట‌బ‌డిన కోడిగుడ్డు, ఎలక్ట్రిక్ బ‌ల్బ్‌, ఆమ్లెట్‌… ఏంటివ‌న్నీ..? వాటి ఫొటోలు అలా తీశారేమిటి..? అనుకుంటున్నారా..? అయితే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే అవి ఫొటోలు కాదు. ఓ చిత్ర‌కారుని కుంచె నుంచి జాలువారిన అద్భుత క‌ళాఖండాలు. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. అవి నిజంగా చిత్రాలే. కాక‌పోతే వాటిని 3డీ ఎఫెక్ట్‌తో ఆ యువ‌కుడు గీశాడంతే. అత‌నే సుశాంత్ ఎస్ రాణే.

3d-art-1

3d-art-2

ముంబైలోని రామ్ నారాయ‌ణ కాలేజీలో మొద‌టి సంవ‌త్స‌రం డిగ్రీ విద్య‌ను అభ్య‌సిస్తున్న సుశాంత్‌కు మొద‌టి నుంచి ఫైన్ ఆర్ట్స్‌పై మ‌క్కువ ఎక్కువ‌. ఈ క్ర‌మంలోనే అద్భుత‌మైన పెయింటింగ్‌ల‌ను గీయ‌డం అల‌వాటు చేసుకున్నాడు. అలా అత‌ను 3డీ ఆర్ట్‌లోనూ ఆరితేరాడు. అయితే ఈ ఆర్ట్‌ను అత‌ను నేర్చుకోవ‌డానికి అత‌నికి ప‌ట్టిన స‌మ‌యం ఎంతో తెలుసా? చెబితే మీరు ఆశ్చ‌ర్యపోతారు. కేవ‌లం 6 వారాల వ్య‌వ‌ధిలోనే అత‌ను 3డీ ఆర్ట్‌లో నిపుణుడిగా మారాడు. ఎవ‌రి స‌హాయం లేకుండానే త‌నంత‌ట తానుగా ఈ ఆర్ట్ నేర్చుకోవ‌డం మ‌రో విశేషం. కాగా తాను ఆర్ట్ నేర్చుకునే క్ర‌మంలో వేసిన అలాంటి 3డీ పెయింటింగ్‌ల‌న్నింటినీ త‌న ఫేస్‌బుక్‌, ట్విట్వ‌ర్ పేజ్‌ల‌లో ఉంచాడు. దీంతో అత‌ని ఆర్ట్ గురించి సోష‌ల్ మీడియాలో అంత‌టా ప్ర‌చారం అయింది. ఈ క్రమంలో సుశాంత్ ఆర్ట్‌కు ఫిదా అయిన ప‌లువురు క‌ళాప్రియులు అత‌ని ఫాలోవ‌ర్లుగా మారిపోయారు. న‌టుడు రితేష్ దేశ్‌ముఖ్‌తోపాటు ప‌లువురు బాలీవుడ్ న‌టులు కూడా అత‌ని ఆర్ట్‌కు అబ్బుర‌పోయి ట్విట్ట‌ర్‌లో అత‌ని ఫాలోవ‌ర్లు అయిపోయారు. ప్ర‌స్తుతం సుశాంత్‌కు ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 33వేల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు. దీన్ని బ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అత‌ను ఇప్పుడు ఎంత పాపుల‌ర్ అయిపోయాడో. అంతే మ‌రి! ప్ర‌తిభ ఉండాలే గానీ పేరు, ధ‌నం వాటంత‌ట అవే వ‌స్తాయి. అది సుశాంత్‌ను చూస్తే అక్ష‌రాలా నిజ‌మేన‌నిపిస్తుంది క‌దూ!

3d-art

3d-art

సుశాంత్ గీసిన చిత్రాల‌ను చూడాలంటే అత‌ని ఫేస్‌బుక్ పేజీని https://www.facebook.com/sushantartwork/ లింక్‌లో ద‌ర్శించ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top