ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశాల్లో పాక్ తీరును ఉతికి ఆరేసి, ఎండ‌గ‌ట్టిన భార‌త మ‌హిళ అధికారి..!

జమ్మూ కాశ్మీర్‌లోని యూరిలో ఇటీవ‌ల జ‌రిగిన ఉగ్ర‌దాడిలో భార‌త్‌కు చెందిన 17 మంది సైనికులు అమ‌ర‌వీరులైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో స‌ద‌రు దాడిని దృష్టిలో ఉంచుకుని యావత్ ప్ర‌పంచం పాకిస్థాన్ చేసిన దాన్ని ఖండించింది. ప్ర‌పంచంలోని దేశాల‌న్నీ పాకిస్థాన్ చ‌ర్య‌ల‌ను ఖండించ‌డ‌మే కాదు, ఆ దేశం ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా మారింద‌ని, వారిని నిర్మూలించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని, ఉగ్ర‌వాదాన్ని తుద ముట్టించాల్సిందేన‌ని అన్ని దేశాలు వ్యాఖ్య‌లు చేశాయి. భార‌త్ కూడా ఆ దాడి జ‌రిగిన‌ప్ప‌టి నుంచి పాకిస్థాన్ చ‌ర్య‌ల‌ను ప్ర‌పంచ వేదిక‌ల్లో ఎండ‌గడుతూ వ‌స్తూనే ఉంది. ఆ క్ర‌మంలోనే తాజాగా జ‌రిగిన ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశాల్లోనూ పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ తీరును మ‌న భార‌త కార్య‌ద‌ర్శి ఈన‌మ్ గంభీర్ ఎడాపెడా ఏకి పారేసింది. దీంతో న‌వాజ్ బ్యాచ్‌కు నోట మాట రాలేదు.

eenam-gambhir

2005 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన 35 ఏళ్ల ఈన‌మ్ గంభీర్ ప్ర‌స్తుతం ఐక్య‌రాజ్య స‌మితిలో భార‌త త‌ర‌ఫున కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తోంది. ఈ మ‌ధ్య జ‌రిగిన ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశాల్లోనూ ఈమె పాల్గొంది. అదే స‌మ‌య‌లో న‌వాజ్ ష‌రీఫ్ కాశ్మీర్ గురించి ఐక్య‌రాజ్య స‌మితి స‌మావేశంలో ప్ర‌సంగించాడు. కాగా ఆ స‌మావేశంలో ష‌రీఫ్ ఏమ‌న్నాడంటే, కాశ్మీర్‌లో మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌ని అన్నాడు. తాము చేస్తున్న చ‌ర్య‌ల‌ను అత‌ను స‌మ‌ర్థించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే వెంట‌నే ప్ర‌సంగం ప్రారంభించిన ఈన‌మ్ గంభీర్ న‌వాజ్ మాట‌ల‌ను బేష‌ర‌తుగా ఖండించింది. అస‌లు మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతోంది పాక్‌లోనే అని, ఆ దేశం ఉగ్ర‌వాదుల‌కు అడ్డాగా మారింద‌ని, యూరిలో 17 మంది భార‌త జ‌వాన్ల‌ను పొట్ట‌న పెట్టుకున్న ఉగ్ర‌వాదులు పాక్ నుంచి వ‌చ్చిన వారే అని, వారికి ఆ దేశ ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉండ‌బ‌ట్టే వారు ఆ విధంగా దాడికి పాల్ప‌డ్డార‌ని ఈన‌మ్ పాక్ తీరును ఎండ‌గ‌ట్టింది.

పాకిస్థాన్‌లో ఉగ్ర‌వాదులు న‌డి వీధుల్లో తిరుగుతున్నార‌ని, అందుకు కార‌ణం పాక్ వారిని పెంచి పోషిస్తుండ‌డ‌మే అని ఈన‌మ్ తెలియజేసింది. ఉగ్ర‌వాదుల‌కు ఆ విధంగా వ‌త్తాసు ప‌లుకుతున్నందు వ‌ల్లే పాక్ కార‌ణంగా పొరుగున ఉన్న దేశాల‌న్నీ ఇబ్బందులు ప‌డుతున్నాయ‌ని, ఒకప్పుడు విద్యార్జ‌న‌కు కేంద్రంగా ఉన్న పాక్‌లోని త‌క్ష‌శిల నేడు ఉగ్ర‌వాదుల‌కు పాఠాలు బోధించే కేంద్రంగా మారంద‌ని మండిపడింది. ఉగ్ర‌వాదుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉన్న పాక్ మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న గురించి మాట్లాడ‌డం విడ్డూరంగా ఉంద‌ని, పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు చాలా చోట్ల త‌మ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తూ ఇత‌ర దేశాల‌కు స‌వాల్ విసురుతున్నార‌ని ప్ర‌స్తావించింది. ఉగ్ర‌వాదుల పోష‌ణ‌కే పాక్ ఎక్కువ నిధులు ఖ‌ర్చు చేస్తూ అక్క‌డి ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, వారిని త‌న నియంత్ర‌ణ‌లో ఉండే విధంగా న‌వాజ్ ష‌రీఫ్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆమె ఆరోపించింది. నిజానికి మ‌హిళ‌ల‌ను, మైనారిటీల‌ను అణ‌చివేస్తూ పాక్‌లోనే ఎక్కువ‌గా మానవ హక్కుల ఉల్లంఘ‌న జ‌రుగుతుంద‌ని ఈన‌మ్ క‌డిగిపారేసింది. ఉగ్ర‌వాదానికి భార‌త్ భ‌య‌ప‌డ‌ద‌ని, త‌గిన రీతిలో జ‌వాబు చెబుతుంద‌ని ఈన‌మ్ ధైర్యంగా ప్ర‌సంగించింది. దీనికి న‌వాజ్ బ్యాచ్ దిక్కులు చూస్తూ ఉండిపోయారు. దాదాపు 3 నిమిషాలు సాగిన ఈ ప్ర‌సంగంలో ఈన‌మ్ పాక్ దుశ్చ‌ర్య‌ల‌ను క‌డిగి పారేసింది. ఈ క్ర‌మంలో ఆమె ప్ర‌సంగాన్ని భార‌త పౌరులంద‌రూ శ‌భాష్ అని మెచ్చుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమె ప్ర‌సంగం వీడియో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కావాలంటే మీరూ ఆ వీడియోను చూడ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top