ఆమె వయసు 28 మాత్రమే..కానీ ఇప్పటికే 60 కోట్ల వ్యాపారం చేసింది..! ఏం చేస్తుందో తెలుసా.?

28 ఏళ్ల అమ్మాయి అంటే ఎలా ఉంటుంది..చదువు అయిపోయి ఉద్యోగం చేసుకుంటూనో..లేదంటే పెళ్లి అయిపోయి పిల్లలని చూసుకుంటూనో తన లైఫ్ అండ్ తన కుటుంబం ,ఫ్రెండ్స్ ఇలా  కొన్ని పరిమితులలో ఉంటుంది.కానీ దీపాళీ అలా లేదు..ఏదో సాధించాలన్న కోరిక తనకు చిన్నప్పటి నుండే ఉండేది.అందుకే ఈ రోజు 60కోట్ల వ్యాపారం చేస్తుంది… తను చేసే వ్యాపారం కూడా నిత్యావసర వస్తువులది… నిత్యావసర వస్తువుల వ్యాపారంతో 60కోట్ల సంపాదన వెనుక దీపాళి కృషి పట్టుదల ఉంది..

చిన్నప్పటి నుండి ఐఎఎస్ కావాలనుకున్న దీప దేశంలో మంచి పేరున్న కమొడిటీ వ్యాపారంలో ప్రవేశించింది..అది కూడా ఎక్కడనుకున్నారు చంబల్ ప్రాంతంలో ..అక్కడ ఏ వ్యాపారం ప్రారంభించిన దానికి ఆటంకాలు ఏర్పరచడానికి లిక్కర్ మాఫియా ఎంటరవుతుంది.అలాంటి క్లిష్టపరిస్తితులను ఎదుర్కొని నిలబడింది.సమస్యలకు ఎదురీదడం దీపాళికి కొత్త కాదు..టిఫిన్ స‌ర్వీస్‌, హాస్ట‌ల్ నిర్వ‌హ‌ణ‌, రెస్టారెంట్ న‌డ‌ప‌డం వంటి వాటిలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. వివిధ ర‌కాల ప‌నులు చేస్తూ త‌న చ‌దువులు పూర్తిచేసుకుంది. త‌ను ఒక ప‌క్క చ‌దువుకుంటూ మ‌రో వైపు ప‌నిచేస్తూ కుటుంబానికి సైతం ఆర్థికంగా త‌న వంతు తోడ్పాటు నందించింది..

కమొడిటీ రంగంలోకి రావాడానికన్నా ముందు అనేక చిన్న చిన్న వ్యాపారాలు చేసింది దీపాళి.ఆఖరుకి లిక్కర్ మాఫియా ఆగడాలను ఎదుర్కోని కమొడిటి రంగంలో స్థిరపడింది గ్వాలియర్ అమ్మాయి.మొత్తం మ‌గ‌వాళ్లే నిర్వ‌హించ‌గ‌ల క‌మొడిటీ వ్యాపారంలో మొట్ట‌మొద‌టి మ‌హిళ‌గా నిలిచింది. మ‌న దేశం ఈ వ‌స్తు వ్యాపారానికి బాగానే ఉంటుంది. భార‌త్‌లో పూర్తి కాలం పాటు క‌మొడిటీ వ్యాపారంలో ఉన్న ఏకైక మ‌హిళ ఈ అమ్మాయే కావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం గోదుమ‌ల వ్యాపారానికి సంబంధించి ఒక సొంత సంస్థ‌ను ఇండోర్‌లో ఆమె రిజిస్ట‌ర్ చేసింది.జ‌య ల‌క్ష్మి ఫుడ్స్ పేరుతో ఇండోర్ క‌మొడిటీ మార్కెట్లో త‌న సంస్థ‌ను ఆమె రిజిస్ట‌ర్ చేసింది. ప‌గ‌లు, రాత్రి ప‌నిచేసి క‌మొడిటీ ట్రేడింగ్‌లో మెల‌కువ‌లు నేర్చుకుంది. ఇండోర్ మార్కెట్లో దాదాపు 1500 రిజిస్ట‌ర్డ్ ట్రేడ‌ర్లు ఉన్నారు. అంద‌రూ ఈ వ్యాపారంలోకి దీపాళిని స్వాగ‌తించారు. ఆమె కార్యాల‌యం క‌మొడిటీ మార్కెట్ కౌన్సిల్ క్యాంప‌స్‌లో ఉంది. ఆమె ఒక సంస్థ‌లో ప‌నిచేసేట‌ప్పుడు గోదుమ‌లు శాంపిల్ చెక్ చేసి ఆర్డ‌ర్ చేసే బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించింది. త‌ర్వాత వాటిని కొరియ‌ర్లో పంప‌డం, ఆర్డ‌ర్లు వ‌చ్చిన త‌ర్వాత మార్కెట్లో వెళ్లి స‌ప్లై చేసేది. గ‌త మూడేళ్లుగా ఈ ట్రేడింగ్‌ను నిరాటంకంగా కొన‌సాగిస్తోంది. ఇప్ప‌టికే దాదాపు రూ.60 కోట్ల మేర వ్యాపారం నిర్వ‌హించింది. తన సొంత సంస్థ కాకముందు చేసిన వేరే సంస్థలో రాత్రి పదింటి వరకు ఉండి మెలకువలు నేర్చుకునేది…

చ‌దువులూ ,వ్యాపారమే  కాదు ఇత‌ర అంశాల్లో సైతం ఆమెకు ఆస‌క్తి ఉంది. ఆట‌ల్లో చాలా చురుకుగా పాల్గొంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో క్రీడ‌ల్లో పాల్గొంది. అంతే కాకుండా బాస్కెట్ బాల్‌, హాండ్ బాల్ క్రీడ‌ల్లో ఆమె జాతీయ స్థాయి క్రీడాకారిణి.ఆడవాళ్లున్నది ఫలానా పనికే అని పరిమితులు పెట్టుకుంటారు కానీ తలుచుకుంటే ఏదన్నా సాధించగలరు అన్నదానికి దీపాళి చక్కటి ఉదాహరణ.

 

Comments

comments

Share this post

scroll to top