ఆమె ఒక‌ప్పుడు చాయ్‌వాలా కూతురు.. ఇప్పుడు పేరు గాంచిన క్రికెట‌ర్ తెలుసా..!

క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉంటే ఎవ‌రైనా ఏ రంగంలోనైనా అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించ‌వ‌చ్చంటారు క‌దా. అలా ఉన్న‌త స్థానాల‌కు చేరిన వారిని మ‌నం చాలా మందినే చూశాం. అయితే మ‌న భార‌త మ‌హిళ‌ల క్రికెట్ జ‌ట్టులో ఉన్న ఆ బౌల‌ర్ కూడా స‌రిగ్గా ఆ కోవ‌కే చెందుతుంది. ఒక‌ప్పుడు ఆమెది పేద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడ‌ని స్థితిలో ఆమె తండ్రి ఉండేవాడు. అయిన‌ప్ప‌టికీ అత‌ను కూతుర్ని క్రికెట‌ర్ చేయాల‌ని అనుకున్నాడు. క‌ష్ట‌ప‌డ్డాడు. తండ్రి ప‌డే క‌ష్టాన్ని ఆమె వృథా చేయ‌లేదు. తానూ తీవ్రంగా శ్ర‌మించింది. దీంతో ఇప్పుడు అంత‌ర్జాతీయ స్థాయి క్రికెట‌ర్ అయి మ్యాచ్‌ల‌లో రాణించ‌డ‌మే కాదు, దేశ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న‌ది. ఆమే… ఏక్తా బిష్త్‌..!

ఏక్తా బిష్త్ ది చాలా పేద కుటుంబం. వారు ఉత్త‌రాఖండ్‌లోని అల్మోరా అనే ప్రాంతంలో నివాసం ఉండే వారు. అయితే ఏక్తాకు చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తాను 6 సంవత్స‌రాల వ‌య‌స్సు నుంచే క్రికెట్ ఆడ‌డం మొద‌లు పెట్టింది. త‌మ చుట్టు ప‌క్క‌ల ఉండే బాలుర‌తో ఆమె ఒక్క‌తే క్రికెట్ ఆడేది. టీం మొత్తంలో బాలిక ఆమె ఒక్క‌తే కావ‌డం విశేషం. అయిన‌ప్ప‌టికీ తండ్రి కుంద‌న్ సింగ్ బిష్త్ ఆమెను వ‌ద్ద‌ని అనే వాడు కాదు. ఆడ‌మ‌నే ప్రోత్స‌హించేవాడు. కూతురుకు క్రికెట్ ప‌ట్ల ఉన్న ఆస‌క్తిని ఆయ‌న గ‌మనించి అకాడ‌మీలో చేర్పించాడు.

అయితే కుంద‌న్ సింగ్ బిష్త్ ఆర్మీలో హ‌వీల్దార్‌గా ప‌నిచేసేవాడు. దీంతో ఆయ‌న‌కు వ‌చ్చే జీతం స‌రిపోయేదికాదు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న చాయ్ అమ్మ‌డం మొద‌లు పెట్టాడు. ఆర్మీ నుంచి బ‌య‌టికి వ‌చ్చి చాయ్ వ్యాపారంతోనే కుటుంబాన్ని పోషించాడు. మ‌రోవైపు కూతురు ఏక్తాకు కోచింగ్ ఇప్పించాడు. దీంతో తండ్రి క‌ష్టాన్ని ఏక్తా వృథా చేయ‌లేదు. చాలా త్వ‌ర‌గానే జాతీయ జ‌ట్టుకు సెలెక్ట్ అయింది. దీంతో వారి ఆర్థిక ప‌రిస్థితి కాస్తంత మెరుగు ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఆమె ప‌లు అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను కూడా ఆడి స‌త్తా చాటింది. తాజాగా పాకిస్థాన్ జ‌ట్టుతో జ‌రిగిన వ‌రల్డ్ క‌ప్ మ్యాచ్ లో ఏక్తా బిష్త్ ఏకంగా 5 వికెట్ల‌ను కూల్చి పాకిస్థాన్ న‌డ్డి విరిచింది. దీంతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఆ విజయంలో ఏక్తాదే కీల‌కపాత్ర‌. దీంతో ఇప్పుడామె దేశ వ్యాప్తంగా చాలా మంది అభిమానుల‌ను సంపాదించుకుంది..!

Comments

comments

Share this post

scroll to top