ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుందరమైన ప్రదేశాలను, టూరిస్ట్ ప్రాంతాలను సందర్శించాలని, ఆ ప్రాంతాల్లో హాయిగా విహరిస్తూ ఎంజాయ్ చేయాలని చాలా మందికి ఉంటుంది. కానీ కొందరు మాత్రమే అలా వెళ్లగలుగుతారు. ఎందుకంటే అలాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ముఖ్యంగా కావల్సింది డబ్బు. అది లేకపోతే ఏం చేయలేం. అయితే ఆ యువతికి కూడా సరిగ్గా ఇలాంటి కోరికే ఉండేది. కానీ ఆమె వద్ద అందుకు తగిన డబ్బు ఉండేది కాదు. దీంతో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. ఓ వైపు ప్రపంచ దేశాలలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనే ఆశ ఉన్నా, అందుకు డబ్బు లేకపోవడంతో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. అయితే ఎట్టకేలకు ఆమె కోరిక నెరవేరింది. ఎంతో కాలంగా వేచి చూస్తున్న ఆమె ఆశ తీరింది. అదెలాగో తెలుసా..?
Miss Travel అనే వెబ్సైట్ వల్ల. అవును, అదే. ఆ యువతి పేరు హెయిడీ పండోరా. అమెరికాలోని ఫ్లోరిడాలో నివాసం ఉంటోంది. అయితే పైనే చెప్పాం కదా, ఈమెకు ప్రపంచ దేశాలను విజిట్ చేయాలనే కోరిక ఉండేదని, కానీ అందుకు డబ్బులేక డిప్రెషన్లోకి వెళ్లిందని చెప్పాం కదా. అయితే ఈమెకు Miss Travel అనే వెబ్సైట్ గురించి తెలిసింది. దీంతో హెయిడీ కల నెరవేరింది. అదేంటీ… ఈ వెబ్సైట్ వల్ల ఆమె కల నెరవేరడం ఏంటీ, వెబ్సైట్ వారు ఏమైనా సహాయం చేశారా..? అంటే.. కాదు. కానీ ఆ సైట్ వల్లే ఆమె ప్రపంచ దేశాలను చుట్టి వస్తోంది. ఎలా అంటే..
నిజానికి Miss Travel అనే వెబ్సైట్ ఓ డేటింగ్ సైట్. అందులో హెయిడీ రిజిస్టర్ చేసుకుంది. దీంతో ఆమెతో రిలేషన్ షిప్ కావాలనుకునే పురుషులు ఆమెను సంప్రదించేవారు. వారితో ఆమె ఎంచక్కా టూర్లకు వెళ్లేది. పైసా ఖర్చు ఉండేది కాదు. పైగా టూర్ ముగిశాక ఆమెకు డబ్బులు కూడా ఇచ్చే వారు. దీంతో ఇప్పుడిదే ఆమె ఉద్యోగం అయిపోయింది. ఓ వైపు ఎంచక్కా ప్రపంచ దేశాలకు టూర్ వెళ్లడం, మరో వైపు పైసా ఖర్చు లేదు, ఇంకో వైపు వచ్చి పడే డబ్బులు. ఇంతకన్నా ఆమెకు ఇంకేం కావాలి. అయితే అలా టూర్కు వెళ్లినప్పుడు హెయిడీ తనకు నచ్చితే పురుషులతో శృంగారంలో కూడా పాల్గొంటుందట. దీంతో చాలా మంది ధనిక పురుషులు ఇప్పుడామెతో టూర్లకు ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఎందుకిలా చేస్తున్నావ్.. ? అని ఆమెను ప్రశ్నిస్తే.. తాను కేవలం పెళ్లయి భార్యతో దూరంగా ఉండే ధనిక పురుషులతోనే సంబంధం పెట్టుకుంటానని, వారితోనే అలా టూర్లకు వెళ్తానని, ఇది ఎవరికీ ఇబ్బంది కలిగించదు కదా.. అని చెబుతోంది ఈ సుందరి. అవును మరి, ఇప్పుడిలా బాగానే ఉంటుంది. కానీ ఏదైనా తేడా కొడితే అప్పుడు తెలుస్తుంది..! చివరిగా ఇంకో విషయం.. ఇలా టూర్లతో హెయిడీ గత 3 ఏళ్లలో ఎన్ని దేశాల్లో పర్యటించిందో తెలుసా..? 20 దేశాల్లో. దుబాయ్, మొరాకో, హవాయి, థాయ్లాండ్ దేశాల్లోనైతే ఆమె చూడని ప్రదేశం లేదు. మరి ఇలా వచ్చిన మొత్తం డబ్బును ఆమె ఏం చేస్తుందో తెలుసా..? ఆ మొత్తాన్ని బ్యాంకుల్లో వేసి పొదుపు చేసుకుంటోంది. అవును, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నారు కదా..!