నాసిర‌కం చీర‌ను పంపిన ఆన్‌లైన్ సైట్‌కు రోగం కుదిర్చింది ఆ మ‌హిళ‌..!

ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు లేదా బ‌య‌ట ఎక్క‌డైనా మాల్స్, రిటెయిల్ స్టోర్స్‌, ఇత‌ర షాపుల్లో మ‌నం ఏవైనా వ‌స్తువు కొంటే అది పాడైతే అప్పుడు మ‌నం మొదట మ‌నం దాన్ని అమ్మిన వారి వ‌ద్ద‌కు వెళ్తాం. వారు ఎలాగూ క‌స్ట‌మ‌ర్ కేర్ సెంట‌ర్‌కు వెళ్ల‌మ‌ని చెబుతారు. దీంతో అక్క‌డికీ మ‌నం వెళ్తాం. ఒక వేళ అక్క‌డ కూడా మ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంద‌నుకోండి, ఏం చేస్తాం..? అంతా మ‌న ఖ‌ర్మ‌, అనుకుంటాం. ఇది ఒక‌ప్పుడు. ఇప్పుడు ఇలా కాదు. కాలం మారింది. జ‌నాలు కూడా త‌మ హ‌క్కుల గురించి తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఎదురైన‌ప్పుడు ప్ర‌జ‌లు ధైర్యంగా ముందుకెళ్లి వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తున్నారు. న‌ష్టం ల‌క్ష‌ల్లో ఉన్నా, వేలు, వంద‌ల్లో ఉన్నా క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును తిరిగి పొందేందుకు వారు ఆ ఫోరంను ఆశ్ర‌యిస్తున్నారు. అందులో స‌ఫ‌లీకృతం అవుతున్నారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ సక్సెస్ ఫుల్ స్టోరీయే. ఇంత‌కీ అందులో బాధితురాలు పొందిన రీఫండ్ ఎంతో తెలుసా..? రూ.700.

ఆమె పేరు జి.హేమావ‌తి. ఈ మ‌ధ్యే ఇండియా ర‌ష్ అనే ఓ సైట్‌లో చీర ఆర్డ‌ర్ ఇచ్చింది. దాని ఖ‌రీదు రూ.700. డెలివ‌రీ చార్జిలు క‌లిపి ఆమె రూ.750 చెల్లించి ఆ చీర‌ను డెలివ‌రీ తీసుకుంది. అయితే దాన్ని చూశాక గానీ ఆమెకు తెలియ‌లేదు. అది నాసిర‌కం చీర అని, తాను ఆర్డ‌ర్ ఇచ్చింది కాకుండా వేరేది వ‌చ్చింద‌ని. దీంతో ఆమె షాక్‌కు గురైంది. అయినా తేరుకుని స‌ద‌రు వెబ్‌సైట్‌కు కంప్లెయింట్ ఇచ్చింది. అయితే వారు ఏమ‌న్నారంటే త‌మ‌కు రీఫండింగ్‌, రీప్లేస్‌మెంట్ పాల‌సీ లేద‌ని, అందువ‌ల్ల ఒక‌సారి అమ్మిన వ‌స్తువును మార్చ‌డం గానీ, దానికి బ‌దులుగా డ‌బ్బును రీఫండ్ చేయ‌డం గానీ కుద‌ర‌దు అని వారు చెప్పారు.

దీంతో హేమావ‌తి మ‌రోసారి షాక్‌కు గురైంది. అయితే దాన్ని అంత తేలిగ్గా వద‌ల‌లేదు ఆమె. నేష‌న‌ల్ క‌న్‌జ్యూమ‌ర్ ఫోరం వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయ‌గా, వారు లేఖ స్వ‌యంగా రాసి ఇవ్వ‌మ‌న్నారు. దీంతో ఆమె అలాగే రాసింది. ఈ క్ర‌మంలో ఆమె లేఖ అందుకున్న‌ట్టుగా ఫోరం రిప్లై ఇచ్చింది. ఆ త‌రువాత 3 రోజుల‌కు స‌ద‌రు సైట్ ప్ర‌తినిధులు స్వ‌యంగా ఆమెను ఈ-మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయి బ్యాంక్ డిటెయిల్స్ అడిగి తెలుసుకుని ఆ మొత్తాన్ని ఆమె అకౌంట్‌లో వేశారు. అలా ఆమె రూ.700 రీఫండ్ అందుకుంది. అయితే డెలివ‌రీ చార్జిలు మాత్రం ఇవ్వ‌లేదు. అయినా స‌రే… ఆమె వ‌ద‌లాల‌నుకోలేదు, కానీ రూ.50 మాత్ర‌మే క‌దా. అందుకు మ‌ళ్లీ కాంటాక్ట్ చేయ‌డం ఎందుకని ఆమె వ‌దిలేసింది. అయితే ఎవ‌రూ కూడా అలా రూ.1ని అయినా వ‌ద‌ల‌కండి. ఎందుకంటే మనం క‌ష్ట‌ప‌డి సంపాదించింది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top