హ‌త్యా నేరం ఆరోపించినా… సోద‌రి పిల్ల‌ల‌ను క‌న్న త‌ల్లిలా చూసుకుంటోంది ఆమె..!

క‌డుపున పుట్టిన క‌న్న బిడ్డ‌ల‌ని కూడా చూడ‌కుండా పిల్ల‌ల‌ను హ‌త‌మారుస్తున్న త‌ల్లిదండ్రులు ఉన్న రోజులివి. అలాంటిది… క‌డుపున పుట్ట‌క‌పోయినా… త‌న సోద‌రి పిల్ల‌ల కోసం ఆమె త‌న జీవితాన్ని త్యాగం చేసింది. వారి కోస‌మే జీవిస్తోంది. అందుకు గాను ఆమె వంద‌ల కేజీల బ‌రువు కూడా త‌గ్గింది. అంతేకాదు, సోద‌రి ఆరోపించిన హ‌త్యా నేరాన్ని మ‌న‌స్ఫూర్తిగా నెత్తి మీద వేసుకుంది. అయినా చ‌ట్టం దృష్టిలో ఎవ‌రూ త‌ప్పించుకోలేరు క‌దా. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. ఆ యువ‌తి నిర్దోషిగా బ‌య‌టికి వ‌చ్చింది. అయితే హత్యా నేరం ఆరోపించినంత మాత్రాన ఆమె త‌న సోద‌రి పిల్ల‌ల‌ను దూరం చేసుకోలేదు. వారి కోస‌మే బ‌రువు త‌గ్గి, వారిని ఇప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకుంటోంది. ఆమే… అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన మ‌య్‌రా..!

mayra

మ‌య్‌రా చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో బొద్దుగా ఉండేది. అయితే అనుకోకుండా ఆమె 453 కిలోల వ‌ర‌కు టీనేజ్‌లో బ‌రువు పెరిగింది. ఆ బ‌రువుతో నిత్యం ఇంట్లోనే బెడ్‌పై ఉండాల్సి వ‌చ్చింది. అయితే మ‌య్‌రాకు జేమీ అనే ఓ సోద‌రి ఉండేది. ఆమెకు ముగ్గురు పిల్ల‌లు. అయితే మ‌య్‌రా జేమీ వ‌ద్ద ఉండ‌డం ఆమెకు అస్స‌లు న‌చ్చ‌లేదు. దీంతో జేమీ ఎలాగైనా మ‌య్‌రాను వ‌దులుకోవాల‌ని అనుకుంది. వెంట‌నే ఓ హ‌త్య‌కు ప‌థ‌కం ప‌న్నింది. అందుకు జేమీ ఎవ‌ర్ని ఎంచుకుందో తెలుసా..? సొంత బిడ్డ‌నే. అలా అనుకోగానే వెంట‌నే త‌న ప‌థ‌కం అమ‌లులో పెట్టేసింది. క‌న్న బిడ్డ‌నే కొట్టి కొట్టి చంపింది. ఆ నేరం మ‌య్‌రా మీద‌కు తోసింది జేమీ. మ‌య్‌రా మీద కూర్చుని త‌న బిడ్డ‌ను చంపేసింద‌ని జేమీ పోలీసుల‌కు చెప్పింది. అయితే అంత భారీకాయం ఉండ‌డంతో అప్ప‌టికే జీవితంపై విరక్తి చెందిన మ‌య్‌రా స‌హ‌జంగానే త‌న‌పై త‌న సోద‌రి జేమీ ఆరోపించిన హ‌త్యా నేరాన్ని అంగీక‌రించింది.

కానీ… నిజం దాగ‌దు క‌దా. చ‌ట్టం నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు. జేమీ విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. పోస్ట్ మార్ట‌మ్ రిపోర్టు వేరేగా వ‌చ్చింది. కొట్టి కొట్టి గాయాలు చేయ‌డంతోనే ఆ బిడ్డ మ‌ర‌ణించింద‌ని డాక్ట‌ర్లు తేల్చారు. దీంతో అస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. జేమీ నేరాన్ని ఒప్పుకుంది. క‌ట‌క‌టాల పాలైంది. ఆమెకు 15 ఏళ్ల జైలు శిక్ష ప‌డింది. అయితే స్వ‌యానా సొంత సోద‌రి త‌న‌పై హ‌త్యా నేరం ఆరోపించినా, మ‌య్‌రా ఎలాగూ నిర్దోషిగా బ‌య‌టికి వ‌చ్చింది, కానీ జేమీ మిగిలిన పిల్ల‌ల‌ను మాత్రం నిర్ల‌క్ష్యం చేయ‌లేదు. వారిని అల్లారు ముందుగా పెంచింది. అయితే అందుకోసం త‌న బ‌రువు అడ్డ‌మ‌ని భావించిన మ‌య్‌రా చాలా క‌ష్ట‌ప‌డి ఏకంగా 363 కిలోల వ‌ర‌కు త‌గ్గింది. దీంతో ఆమెను జేమీ పిల్ల‌లు సొంత క‌న్న త‌ల్లి క‌న్నా ఎక్కువ‌గా చూసుకుంటున్నారు. ప్ర‌స్తుతం వారికి త‌ల్లి లేని లోటును తీరుస్తోంది మ‌య్‌రా..! నిజం చెప్పండి… ఇప్ప‌టి స‌మాజంలో ఇలాంటి వారు ఎంత మంది ఉంటారు..?

Comments

comments

Share this post

scroll to top