ధోనీ కారును ఆ మ‌హిళ అడ్డగించి రోడ్డుపై అలాగే నిలుచుంది… ఎందుకో తెలుసా..?

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రు చెప్పండి. ఆయ‌న‌కు ప్ర‌పంచ‌మంత‌టా అభిమానులు ఉన్నారు. ధోనీ క‌నిపిస్తే చాలు, ఆయ‌న‌తో సెల్ఫీ దిగాల‌ని, ఆటోగ్రాఫ్ తీసుకోవాల‌ని చాలా మంది అనుకుంటారు. కానీ… ఆ చాన్స్ అంద‌రికీ రాదు క‌దా. ఈ క్ర‌మంలోనే అలాగే ఓ మ‌హిళా అభిమాని ధోనీతో సెల్ఫీ అయినా దిగాల‌ని, అది కుదర‌క‌పోతే క‌నీసం ఆటోగ్రాఫ్ అయినా తీసుకోవాల‌ని సంబ‌ర ప‌డింది. అందుకోస‌మే ఆయ‌న‌ను ఫాలో అయింది. చివ‌ర‌కు ఏం జ‌రిగిందంటే…

woman-dhoni-1
ఇటీవ‌లే ధోనీ త‌న రాష్ట్ర జ‌ట్టు అయిన జార్ఖండ్ త‌ర‌ఫున కోల్‌క‌తాలో విజ‌య్ హ‌జారే ట్రోఫీలో ఆడారు క‌దా. అయితే మ్యాచ్ అయిపోగానే ధోనీ కోల్‌క‌తా నుంచి విమానంలో రాంచీకి బ‌య‌ల్దేరారు. రాంచీలోనే క‌దా ఆయ‌న ఉండేది. ఈ క్ర‌మంలో కోల్‌క‌తాలోనే ధోనీ ప్ర‌యాణిస్తున్న విమానంలోనే ఓ మ‌హిళ ధోనీని చూసి ఎలాగైనా ధోనీతో సెల్ఫీ దిగాల‌ని అనుకుంది. అందుకు గాను ఆమె ఆ విమానంలో నుంచే ధోనీని ఫాలో అవుతూ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ధోనీ రాంచీ విమానాశ్ర‌యంలో దిగి త‌న హ‌మ్మ‌ర్ వాహ‌నంలో ఎక్కి కూర్చున్నాడు. అక్క‌డికి కూడా ఆ మ‌హిళ వ‌చ్చింది. ఇక ధోనీ దొర‌క‌డ‌మో అని భావించిన ఆమె ఏకంగా ఆయ‌న కారుకు అడ్డంగా నిలుచుంది.


అలా అయినా ధోనీ దిగి వ‌చ్చి త‌న‌తో సెల్ఫీ దిగుతాడ‌ని ఆమె భావ‌న‌. అయితే ధోనీ కారు దిగ‌లేదు. అలాగే వేచి ఉన్నాడు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది వ‌చ్చి ఆ మ‌హిళ‌ను కారు ముందు నుంచి తొల‌గించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే క‌నీసం ధోనీ ఆటోగ్రాఫ్ అయినా ఇప్పించాల‌ని ఆ మ‌హిళ ప‌ట్టుబ‌ట్టింది. అప్పుడు కూడా ధోనీ స్పందించ‌లేదు. దీంతో ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను దూరంగా పంపేశారు. గ‌తంలో కూడా ఓ మ‌హిళ ఇలాగే ధోనీని వెంబ‌డించి ఆయ‌న ఇంటి దాకా వ‌స్తే అప్పుడు ధోనీ ఎంతో ఔదార్యం చూపి ఆమెతో ఫొటో దిగాడు. కానీ… ఈ సారి అలా ధోనీ చేయ‌క‌పోవ‌డం గ‌మనార్హం..!

Comments

comments

Share this post

scroll to top