ఒకేకాన్పులో ముగ్గురు పిల్లల్ని( ట్రిప్లెట్) కన్న ఓ తల్లి…తన గురించి చెప్పిందిలా.!

వివాహం అంటూ అయ్యాక ఏ స్త్రీ కైనా క‌చ్చితంగా పిల్ల‌ల్ని క‌నాల‌నే ఉంటుంది. కాక‌పోతే కొంద‌రు ముందు, కొంద‌రు వెనుక పిల్లల్ని కంటారు. అది వేరే విష‌యం. అయితే ఏ స్త్రీకైనా పెళ్ల‌య్యాక పిల్లల్ని క‌నాల‌ని, వారిని పెంచి పోషించాల‌ని, వారి ముద్దు మాట‌లు, అల్ల‌రి చేష్ట‌లు చూసి ఆనందం చెందాల‌ని, అమ్మ‌త‌నం అనుభ‌వించాల‌ని ఉంటుంది. ఈ క్ర‌మంలో పిల్ల‌ల్ని క‌న్నాక ఏమో గానీ క‌న‌క ముందు అంటే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు ఆ త‌ల్లి ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంది. త‌న క‌డుపులో పెరుగుతున్న జీవి ఈ భూ ప్ర‌పంచం చూసే వ‌ర‌కు ఎంతో జాగ్ర‌త్త‌గా మోస్తూ ర‌క్ష‌ణ తీసుకుంటుంది. అయితే కేవ‌లం ఒకే బిడ్డ గ‌ర్భంలో ఉంటేనే ఏ స్త్రీకైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అదే ముగ్గురు ఉంటే..? అప్పుడు ఆ మ‌హిళ ప‌డే బాధ వ‌ర్ణ‌నాతీతం. అదిగో అలాంటి బాధ‌నే ఆ మ‌హిళ కూడా అనుభ‌వించింది. ముగ్గురు బిడ్డ‌ల్ని ఒకేసారి క‌డుపులో మోసే ద‌గ్గ‌ర్నుంచి, వారిని పెంచి పెద్ద చేసే వ‌ర‌కు ఆ త‌ల్లి ప‌డ్డ బాధ‌ల్ని, అనుభ‌వించిన క‌ష్టాల‌ను స్వ‌యంగా వివరించింది.

shefali-vaidya

ఆమె పేరు షెఫాలి వైద్య‌. ఆమె గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు అమెరికాలో భ‌ర్త‌తో నివ‌సించేది. అయితే ఒకానొక రోజు ఆమె వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా ఆమె క‌డుపులో మూడు పిండాలు పెరుగుతున్నాయ‌ని, ఆమెకు ముగ్గురు (ట్రిప్లెట్‌) పిల్ల‌లు జ‌న్మిస్తార‌ని వైద్యులు చెప్పారు. అయితే షెఫాలి ముందుగా అది జోక్ అనుకుంది. కానీ ఆ త‌రువాతే అస‌లు విష‌యం తెలిసింది. దీంతో ఒక్క‌సారిగా షాక్‌కు గురైంది. అయినా తేరుకుని ధైర్యంగా ముందుకు సాగింది. క‌డుపులో ఒక బిడ్డ ఉంటేనే అలాంటి గ‌ర్భిణీలు న‌వ మాసాల పాటు చాలా ఇబ్బందులు పడాల్సి వ‌స్తుంది. అదే షెఫాలి తాను ముగ్గురికి జ‌న్మ‌నివ్వ‌బోతున్నాన‌ని తెలిసి ఓ వైపు ఆనందం వ్య‌క్తం చేసింది. కానీ మ‌రో వైపు ఆందోళ‌న కూడా ప‌డింది. అయితే ఆమె త‌న బిడ్డ‌ల ప‌ట్ల చ‌క్క‌ని కేర్ తీసుకోవ‌డంతో ఎట్ట‌కేల‌కు ముగ్గురు శిశువుల‌కు జ‌న్మ‌నిచ్చింది.

షెఫాలి అలా ముగ్గురు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నివ్వ‌గానే ఎంత‌గానో ఆనందం వ్య‌క్తం చేసింది. ఆ ఉత్సాహంతోనే వారిని జాగ్ర‌త్త‌గా సంర‌క్షించ‌సాగింది. అయితే న‌వ‌జాత శిశువు ఒక్క‌రే ఉన్నా ఆ త‌ల్లిదండ్రుల‌కు ఆ శిశువు లాల‌న చూడ‌డం కొంచెం ఆందోళ‌న‌గా, కంగారుగానే ఉంటుంది. ఇక ముగ్గురు శిశువులు ఉన్న షెఫాలి కుటుంబం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముగ్గురికి పాలు ప‌ట్ట‌డం, స్నానం చేయించ‌డం, ఏడ‌వ‌కుండా చూసుకోవ‌డం, నిద్ర లేని రాత్రుల‌ను గ‌డ‌ప‌డం వంటి ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఆమె అధిగ‌మించింది. దీనికి తోడు ఆమె కుటుంబ స‌భ్యులు కూడా స‌హాయం అందించారు. ఈ క్ర‌మంలో ఆ శిశువులకు ఆదిత్‌, అర్జున్‌, అన‌న్య అని పేర్లు పెట్ట‌డం, వారు 10 నెల‌ల వ‌య‌స్సు ఉండ‌గా ఇండియాకు రావ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. అయిన‌ప్ప‌టికీ షెఫాలి త‌న కెరీర్‌ను కూడా వ‌దల్లేదు. మీడియా రంగంలోనూ త‌న ప్ర‌తిభ చూపించింది. అయితే ఆమె గురించిన ఇంకో విశేష‌మేమిటంటే… గ‌ర్భం దాల్చిన త‌ల్లుల‌కు, పిల్ల‌ల్ని పెంచుతున్న వారి కోసం స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను అందించే విధంగా ఓ బ్లాగ్ (వెబ్‌సైట్‌)ను ఏర్పాటు చేసింది. దాంట్లో త‌న అనుభ‌వాల‌ను స్వ‌యంగా పోస్ట్ చేస్తూ అందరికీ మార్గ నిర్దేశం చేస్తోంది. ముగ్గురు బిడ్డ‌ల త‌ల్లి అయినా ఓ వైపు కెరీర్‌ను, మ‌రో వైపు వారి లాల‌ల‌ను స్వ‌యంగా చూస్తూ, ఇంకో వైపు త‌ల్లుల కోసం సైట్ ను నిర్వ‌హిస్తోంది. ఈ విష‌యంలో మ‌నం ఆమెను అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top