ఆకలితో ఉన్న బిడ్డ ఏడుస్తుందంటే చాలు తల్లి చేసే మొదటి పని, పాలివ్వడం. అంతేకానీ బిడ్డ ఏడుస్తూ ఉందంటే ఏ తల్లి అయినా అస్సలు చూస్తూ ఊరుకోదు. తన బిడ్డ ఆకలి తీర్చేందుకు తల్లి ఎంతగానో ఆరాటపడుతుంది. అమ్మతనంలోని గొప్పతనం అది. ఆ మాటకొస్తే భూ ప్రపంచంలో ఉన్న తల్లులందరూ అంతే. ఎవరూ తమ బిడ్డల ఏడుపును చూస్తూ కూర్చోరు. అయితే కన్న బిడ్డ ఏడిస్తే తల్లి పాలివ్వడం సహజమే కానీ వేరే ఎవరో కన్న బిడ్డకు స్తన్యం ఇవ్వాల్సి వస్తే? మానవత్వంతో కూడిన ఆ పనిని ఎంత మంది చేస్తారు? ఎవరు చేస్తారో, ఎవరు చేయరో తెలియదు కానీ ఆ మహిళ మాత్రం చేసి చూపించింది. వృత్తి రీత్యా విధి నిర్వహణలో ఉన్నా మానవత్వం ఉన్న ఓ తల్లిగా స్పందించి వేరే బిడ్డ ఆకలిని తీర్చింది. ఆమే లూయిసా ఫెర్నాండా ఉరియా.
కొలంబియా దేశంలోని ఓ అటవీ ప్రాంతంలో లూయిసా ఫెర్నాండా ఉరియా పోలీస్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తోంది. కాగా ఒక రోజు ఆ అటవీ ప్రాంతంలో అప్పుడే జన్మించిన ఓ శిశువును ఎవరో విడిచి పెట్టి వెళ్లిపోయారు. ఆ పసికందు ఏడుపు విన్న ఓ స్థానిక మహిళ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో దగ్గర్లోనే ఉన్న లూయిసా అక్కడికి వచ్చింది. అయితే ఆ శిశువు ఆరోగ్యం అంత బాగా లేదు. అప్పటికే హైపోథెర్మియాతో ఆ పసికందు అవస్థ పడుతోంది. దీంతో లూయిసా వెంటనే ఆ శిశువును చేరదీసి ఆ బిడ్డకు తన పాలిచ్చింది. దీంతో ఆ పసికందు కొద్దిగా తేరుకుంది. అనంతరం శిశు సంరక్షణ అధికారులు వచ్చి ఆ శిశువును తీసుకెళ్లారు.
కాగా లూయిసా ఆ సంఘటనకు కొంత కాలం ముందే ఓ బిడ్డను కనడంతో ఆమె వద్ద కూడా పాలున్నాయి. దీంతోనే ఆ పసికందుకు లూయిసా తన స్తన్యమివ్వగలిగింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా అక్కడి మీడియాకు వెల్లడించింది. అయితే ఆమె ఇలా ఓ అపరిచిత శిశువుకు తన మాతృ హృదయంతో పాలివ్వడం, అదీ ఓ పోలీస్ ఆఫీసర అయి ఉండి అలాంటి పని చేయడంతో ఆ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా మంది ఆమె చేసిన పనికి అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఆ శిశువుకు సంబంధించిన తల్లిదండ్రుల వివరాలు ఇంకా తెలియరాలేదని, త్వరలో వారిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఏది ఏమైనా లూయిసా చేసిన పనికి నిజంగా ఆమెకు మనం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే! కదా!
పసికందుకు స్తన్యమిస్తున్న లూయిసా…
I salute you for your Great deed. Hats off officer!!!!
I salute you great mother for your great deed. Hats off officer!!!!!