ఆమె ఒక‌ప్పుడు ఆర్చ‌రీ చాంపియ‌న్‌… ఇప్పుడు నారింజ పండ్ల‌ను అమ్ముకుంటోంది..!…ఎందుకో తెలుసా?

మ‌న దేశంలో పేద కుటుంబంలో పుట్టిన క్రీడాకారుల‌కు స‌రైన ఆర్థిక స‌హ‌కారం అందడం లేద‌నడానికి ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ మ‌హిళ జీవిత‌మే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌. ఆమె ఒక‌ప్పుడు ఆర్చ‌రీలో చాంపియ‌న్‌. కానీ… ఎలాంటి ఆర్థిక స‌హ‌కారం గానీ, ప్ర‌భుత్వ తోడ్పాటు గానీ లేక‌పోవ‌డంతో ఆమె స్పోర్ట్స్ కెరీర్‌ను విడిచి పెట్టాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో కుటుంబ పోష‌ణ కోసం నారింజ పండ్లు అమ్ముకుంటోంది. అస్సాంకు చెందిన బులి బ‌సుమ‌టారి గురించే ఇప్పుడు మేం చెబుతోంది..!

buli-basumatary

అస్సాంలోని ఓ మారుమూల ప‌ల్లెలో జ‌న్మించిన బులి చిన్న‌త‌నం నుంచే ఆర్చ‌రీ (విలు విద్య‌)లో ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచేది. ఈ క్ర‌మంలోనే ఆమె ఆర్చ‌రీలో విజ‌య‌వంత‌మైన క్రీడాకారిణిగా ఎదిగింది. అందులో భాగంగా ఆమె పాల్గొన్న ప‌లు టోర్న‌మెంట్ల‌లో గోల్డ్‌, సిల్వ‌ర్ మెడ‌ల్స్‌ను సాధించింది. 2004లో రాజ‌స్థాన్‌లో జ‌రిగిన నేష‌న‌ల్ స‌బ్ జూనియ‌ర్ ఆర్చ‌రీ చాంపియ‌న్‌షిప్‌లో రెండు గోల్డ్ ఒక సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించ‌గా, 2008లో జంషెడ్‌పూర్‌లో జ‌రిగిన 28వ నేష‌న‌ల్ ఆర్చ‌రీ చాంపియ‌న్ షిప్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ సాధించింది. అయితే 2010లో అనుకోకుండా ఆమెకు ఓ ప్ర‌మాదంలో తీవ్ర గాయాలు కావ‌డంతో ఆమె ఆర్చ‌రీ నుంచి దూర‌మైంది.

అయితే బులికి ఆ స‌మ‌యంలో స‌రైన ఆర్థిక స‌హ‌కారం అందితే దాంతో మ‌ళ్లీ ఆర్చ‌రీ క్రీడ‌లో పాల్గొనే అవ‌కాశం ఉండ‌గా, అందుకు ప్ర‌భుత్వం కానీ, ఎవ‌రూ కానీ స్పందించ‌లేదు. దీంతో ఆమె శాశ్వ‌తంగా ఆర్చ‌రీ క్రీడ‌కు దూర‌మైంది. ఈ క్ర‌మంలో ఆమెకు పెళ్లయి ఇద్ద‌రు పిల్లలు కూడా జ‌న్మించారు. అయితే కుటుంబ పోష‌ణ భారం కావ‌డంతో ఆమె ఇప్పుడు రోడ్డు ప‌క్క‌న నారింజ పండ్ల‌ను అమ్ముకుంటూ పిల్ల‌ల‌ను పోషించుకుంటోంది. కాగా ఈ విష‌యం ఈ మ‌ధ్యే క్రీడా మంత్రిత్వ శాఖ‌కు తెలియ‌డంతో వారు బులిని గౌహ‌తిలో ఆర్చ‌రీ కోచ్‌గా ప్ర‌భుత్వం త‌ర‌ఫున నియ‌మించారు. ఏది ఏమైనా… బులికి ఇంకాస్త ముందే ఆర్థిక స‌హాయం అంది ఉంటే ఆమె ఇప్పుడు క‌చ్చితంగా ఒలంపిక్స్ లో మెడ‌ల్ తెచ్చి ఉండేదేమో క‌దా..!

Comments

comments

Share this post

scroll to top