ఆమె త‌న న‌గ‌లు తాక‌ట్టుపెట్టి పేద‌ల‌కు 100కు పైగా మ‌రుగుదొడ్లు కట్టించి ఇచ్చింది..!

అక్టోబ‌ర్ 2, 2019. అప్ప‌టికి మ‌న దేశాన్ని బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న లేని దేశంగా చేయాల‌నేది కేంద్ర ప్ర‌భుత్వం సంక‌ల్పం. అదే రోజుకు మ‌న జాతిప‌తి మ‌హాత్మాగాంధీ 150వ జ‌యంతి జ‌రుగుతుంది. అందుకోస‌మే ప్ర‌ధాని మోడీ స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్ పేరిట ప్ర‌జ‌లంద‌రికీ మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేయాల‌ని భావించి, అందులో భాగంగానే ఆ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అయితే ఇదే కార్య‌క్ర‌మాన్ని ఓ మ‌హిళ చాలెంజింగ్‌గా తీసుకుంది. త‌మ గ్రామంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టుకునే విధంగా వారిలో చైత‌న్యం తీసుకువ‌స్తోంది. అంతేకాదు, అందుకు గాను ఆర్థిక స‌హాయం అవ‌స‌రం ఉన్న వారికి ఆమె స్వయంగా డ‌బ్బుల‌ను కూడా అందిస్తోంది. ఆమే… కాజల్ రాయ్‌..!

kajal-roy

కాజల్ రాయ్‌ది చ‌త్తీస్‌గ‌డ్‌లోని బ‌గీచా ప్రాంతంలో ఉన్న స‌న్నా అనే గ్రామం. ప్ర‌ధాని మోడీ ప్ర‌వేశ‌పెట్టిన స్వ‌చ్ఛ భార‌త్ మిష‌న్‌ను ఈమె ఒక య‌జ్ఞంలా భావించింది. అందులో భాగంగానే త‌మ గ్రామంలో ఉన్న ప్ర‌జ‌లంద‌రూ క‌చ్చితంగా మ‌రుగుదొడ్లు క‌ట్టుకోవాల‌ని వారిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తోంది. మ‌రుగుదొడ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల క‌లిగే అన‌ర్థాల‌ను అక్క‌డి ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తోంది. అయితే ఆమె అలా చెబుతుండే స‌రికి చాలా మంది స్వ‌యంగా మరుగుదొడ్ల‌ను నిర్మించుకున్నారు కూడా. కానీ కొంద‌రికి మాత్రం త‌గినంత డ‌బ్బు లేక‌పోవ‌డంతో ఆ ప‌ని వీలు కాలేదు. అయినా వారికి కాజ‌ల్ రాయ్ స్వ‌యంగా చేయూత‌నందిస్తోంది.

toilets-in-village

toilets-using

కాజ‌ల్ రాయ్ త‌న న‌గల‌ను తాక‌ట్టు పెట్టి త‌ద్వారా వ‌చ్చిన డ‌బ్బుతో ఆ గ్రామంలోని పేద‌ల‌కు స్వ‌యంగా మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టిస్తోంది. అలా ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె 100కు పైగా మ‌రుగుదొడ్ల‌ను నిర్మించింది. ఈ క్రమంలోనే ఆమె గురించి ప్ర‌ధాని మోడీకి తెలిసింది. దీంతో ఆమెను రానున్న మ‌హిళా దినోత్స‌వం నాడు మోడీ స్వ‌యంగా స‌న్మానించ‌నున్నారు. నిజానికి మ‌న దేశంలో ఇంకా దాదాపుగా స‌గం జ‌నాభాకు అంటే 45 కోట్ల మందికి మ‌రుగుదొడ్లు లేవ‌ట‌. వారంతా బ‌హిరంగ మ‌ల‌విసర్జ‌న చేస్తున్నార‌ని తెలిసింది. మ‌రి వారంద‌రికీ మ‌రుగుదొడ్లు క‌ట్టించాలంటే… ఆ ప్ర‌క్రియ 2019 వ‌ర‌కు పూర్త‌వుతుందా..? లేదా..? అన్న‌ది వేచి చూడాలి. ఏది ఏమైనా పేద‌ల కోసం మ‌రుగుదొడ్లు క‌ట్టించి ఇస్తున్న కాజ‌ల్ రాయ్ ఉదార స్వ‌భావాన్ని మ‌నం క‌చ్చితంగా అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top