ఆమెకు కూర్చుని తిన్నా త‌ర‌గ‌ని ఆస్తి ఉంది… అయినా టిఫిన్ బండి పెట్టుకుని జీవ‌నం సాగిస్తోంది… ఎందుకో తెలుసా..?

మంచి ఉద్యోగం, బాగా సంపాదించిన‌ భ‌ర్త‌, ఉండ‌డానికి ఖ‌రీదైన ఇల్లు… రెండు పెద్ద కార్లు… కూర్చుని తిన్నా త‌ర‌గ‌ని ఆస్తి…. ఇవ‌న్నీ ఉంటే ఇక ఎవ‌రైనా ఏం చేస్తారు..? చేసేదేముందీ, హాయిగా జీవితాన్ని అనుభ‌వించ‌డం త‌ప్ప‌..! అంతే, ఎవ‌రైనా దాదాపుగా అలానే చేస్తారు. కానీ గుర్గావ్‌కు చెందిన ఊర్వ‌శీ యాద‌వ్ అనే మ‌హిళ మాత్రం అలా కాదు. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి రోడ్డు ప‌క్క‌న ఓ చిన్న టిఫిన్ బండిని న‌డుపుకుని జీవిస్తోంది. అవునా, అని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇది నిజ‌మే. ఇంత‌కీ ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలుసా..?

oorvashi-yadav

గుర్గావ్‌కు చెందిన ఊర్వ‌శీ యాద‌వ్‌కు 45 సంవ‌త్స‌రాలు. స్కూల్ టీచ‌ర్‌గా ప‌నిచేస్తోంది. భ‌ర్త అమిత్ ఓ రియ‌ల్ ఎస్టేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌. అత‌ను కూడా బాగానే సంపాదిస్తున్నాడు. ఇక ఆమె మామ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆమెకు గుర్గావ్‌లో రూ.3 కోట్ల విలువ చేసే పెద్ద బంగ‌ళా ఉంది. ఖ‌రీదైన రెండు పెద్ద కార్లు కూడా ఉన్నాయి. అయితే అనుకోకుండా జ‌రిగిన ఓ ప్ర‌మాదం ఆమెను పూర్తిగా మార్చేసింది. అదేమిటంటే…

ఊర్వ‌శీ యాద‌వ్ భ‌ర్త అమిత్ ఇటీవ‌లే ఓ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దీంతో అత‌ని తుంటికి డాక్ట‌ర్లు ఆప‌రేష‌న్ చేయాల‌ని చెప్పారు. అయినా ఆ ఆప‌రేష‌న్‌తో అత‌ను న‌డిచే అవ‌కాశం లేద‌ని వారు తేల్చేశారు. దీంతో ఊర్వ‌శీ యాద‌వ్‌లో అనుకోకుండా మార్పు వ‌చ్చింది. భ‌ర్త ఉద్యోగం చేయ‌లేడు. ఈ క్ర‌మంలో త‌న జీతంతోనే ఇల్లు న‌డ‌వాలి. ఒక వేళ అది మానేశాక అప్పుడు ప‌రిస్థితి ఏంటి? అని ఆలోచించింది. దీంతో వెంట‌నే ఓ నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే… రోడ్డు పక్క‌న టిఫిన్ బండి పెట్టాల‌ని..!

అలా ఊర్వ‌శీ యాద‌వ్ వెంట‌నే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఓ టిఫిన్ బండిని ఏర్పాటు చేసుకుంది. దాంతోనే ఇప్పుడు జీవిస్తోంది. నెల‌కు రూ.2500 నుంచి రూ.3వేల వ‌ర‌కు సంపాదిస్తోంది. అయితే ఇదంతా చూసిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే అంత‌టి ఆస్తి ఉండి కూడా, ప‌నిచేయాల్సిన అవ‌స‌రం లేకున్నా ఆమె ఎందుకిలా చేస్తుంద‌ని అంద‌రూ చెవులు కొరుక్కుంటున్నారు. కానీ ఊర్వ‌శీ యాద‌వ్ మాత్రం ఒక్క‌టే చెబుతోంది, ఇప్పుడంటే త‌మ‌కు తిండికి, బ‌ట్ట‌కు ఎలాంటి లోటు లేదు, కానీ కూర్చుని తింటే కొండ‌లైనా క‌రిగిపోతాయి అన్న చందంగా భ‌విష్య‌త్తులో త‌మ ఆస్తి అంతా పోతే ఏం చేయాల‌ని ఆలోచించాన‌ని, అప్పుడు ఎలాగూ ఈ స్థితి త‌ప్ప‌దు క‌దా, అందుకే ఇప్ప‌టి నుంచి అల‌వాటు చేసుకుంటున్నా, అని బ‌దులిస్తోంది. అయితే త‌న‌కు వంట చేయ‌డం చాలా ఇష్ట‌మ‌ని, అందుకే టిఫిన్ బండిని పెట్టాన‌ని, కానీ దాంతోనే స్థిరప‌డిపోన‌ని, భ‌విష్య‌త్తులో పెద్ద రెస్టారెంట్‌ను ఓపెన్ చేస్తాన‌ని ఊర్వ‌శీ యాద‌వ్ చెబుతోంది. నిజ‌మేగా, స్వ‌యం ఉపాధికి మించిన ఆర్థిక వ‌న‌రు ఇంకొక‌టి ఏముంటుంది చెప్పండి..!

వాట్సాప్ లో మా ఆర్టికల్స్ మీకోసం.  ఈ నెంబర్ కు 7997192411 Start అని ఓ వాట్సాప్ మెసేజ్ చేయండి.

Comments

comments

Share this post

scroll to top