నీ ఆకారం చూస్తేనే..వాంతికొస్తుంది అన్నోళ్లందరూ…అవాక్కయ్యారు.!

”నువ్వు అస్సలు బాగాలేవు. ఆ ముఖం ఏంటి… శ‌రీరం ఏంటి… ఆ ఆకారం… అబ్బో… చూస్తేనే వాంతికొస్తుంది. అంత‌టి గ‌లీజ్‌, అగ్లీ ఫేస్ నీది…!” లాంటి కామెంట్ల‌ను ఎవ‌రైనా నిత్యం ఎదుర్కొంటుంటే వారి ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌న ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. జీవిత‌మే దండ‌గ‌, ఇక బ‌తుకే వ్యర్థం, చ‌నిపోదాం అనే అలాంటి వారు డిసైడ్ అవుతారు. కానీ ఆమె అలా కాదు. త‌న‌ను అలా గేలి చేసిన వారే మెచ్చుకునేలా చేసింది. ఎగ‌తాళి చేసి, ఆట‌ప‌ట్టించిన వారే ముక్కున వేలేసుకునేలా చేసింది. ఆమే య‌శ్‌మీన్ మ‌న‌క్‌.

yashmeen-manak

కండ‌లు తిరిగిన దేహ దారుఢ్యం. చూపు తిప్పుకోనీయ‌ని 8 ప‌ల‌క‌ల దేహం. స్టేజిపై బాడీ బిల్డింగ్ చేస్తుంటేనే ఎంతో మందిని క‌ట్టి ప‌డేస్తుంది ఆమె దారుఢ్యం. య‌శ్‌మీన్ మ‌న‌క్ ఇప్పుడంటే పేరుమోసిన వుమెన్ బాడీ బిల్డ‌ర్‌గా ఖ్యాతి గాంచింది. కానీ చిన్న‌ప్పుడు ఆమె అందుకు త‌గిన విధంగానే అవ‌మానాల‌ను, హేళ‌న‌ల‌ను, చీత్కారాల‌ను కూడా ఎదుర్కొంది. చిన్న‌ప్పుడు అందరు బాలిక‌ల్లానే అందంగా ఉన్న ఆమె ఓ వైద్యుడు ఇచ్చిన మెడిసిన్ విక‌టించ‌డం కార‌ణంగా అంద విహీనంగా త‌యారైంది. దీంతో తోటి వారు ఎంత‌గానో గేలి చేశారు. అయినా య‌శ్‌మీన్ వాటిని ప‌ట్టించుకోలేదు. ఏదో ఒక రంగంలో స‌త్తా చాటి త‌న‌ను గేలి చేసిన వారి నోరు మూయించాల‌ని అనుకుంది. అందులో భాగంగానే త‌న‌కు ఎంత‌గానో ఇష్టం అయిన బాడీ బిల్డింగ్‌ను ఎంచుకుంది.

బాడీ బిల్డింగ్‌లో రాణించ‌డ‌మే ల‌క్ష్యంగా య‌శ్‌మీన్ చిన్న‌ప్ప‌టి నుంచి కృషి చేసింది. అందుకు త‌గిన కోర్సుల‌ను కూడా చేసింది. ఎట్ట‌కేల‌కు తాను అనుకున్న‌ది సాధించింది. ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో గెలుపొంది మెడ‌ల్స్ సాధించింది. ఈ ఏడాది నిర్వ‌హించిన ఇండియ‌న్ బాడీ బిల్డింగ్ ఫెడ‌రేష‌న్ చాంపియ‌న్‌షిప్ కైవ‌సం చేసుకుంది. ఇటీవ‌లే జ‌రిగిన మిస్ ఆసియా బాడీ బిల్డింగ్‌లో భార‌త్‌కు కాంస్య ప‌త‌కం సాధించి పెట్టింది. ఇప్పుడు య‌శ్‌మీన్‌కు 36 ఏళ్లు. అయినా చెక్కు చెద‌ర‌ని దేహంతో అంద‌రినీ ఆమె ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సొంతంగా ఓ సెంట‌ర్ ఏర్పాటు చేసి అందులో 300 మందికి బాడీ బిల్డింగ్‌లో శిక్ష‌ణ‌ను ఇస్తోంది. అందులో స్త్రీలే కాదు, పురుషులు కూడా ఉండ‌డం విశేషం..! అలా య‌శ్‌మీన్ త‌న‌ను గేలి చేసిన వారినే ముక్కున వేలు వేసుకునేలా చేసింది. ఆమె కృషి నిజంగా అభినంద‌నీయం..!

అన్న‌ట్టు ఇంకో విష‌యం… ఇప్పుడు య‌శ్‌మీన్‌ను అంతా ఏమ‌ని పిలుస్తున్నారో తెలుసా..? ”ఉక్కు మ‌హిళ” అని..! అది నిజ‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top