ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెడుతున్న మ‌హిళ ఆమె..! వారి పేరు చెబితేనే ఉగ్ర రూపం దాలుస్తుంది..!

ఉగ్ర‌వాదులంటేనే జాలి, ద‌య, క‌నిక‌రం లాంటివి లేని వారు. క్రూర‌త్వానికి మారు పేరు. త‌మ‌కు అడ్డంగా ఎవ‌రైనా వ‌స్తే వారిని అంత‌మొందించే దాకా విడిచి పెట్ట‌రు. అలాంటి వారితో పోట్లాడాలంటే చాలా తెగువ‌, ధైర్యం ఉండాలి. అది ఆర్మీ, పోలీస్‌ వంటి విభాగాల్లో ప‌నిచేసే వారికే సాధ్య‌మ‌వుతుంది. సాధార‌ణ పౌరులు ఉగ్ర‌వాదుల‌తో పోట్లాడ‌లేరు. అందునా ఓ సామాన్య మ‌హిళ అయితే ఆ ప‌దం వింటేనే జంకుతుంది. అయితే ఆ యువ‌తికి మాత్రం ఎలాంటి భ‌యం లేదు స‌రి క‌దా, ఉగ్ర‌వాది అంటేనే శివ‌తాండ‌వం చేస్తుంది. వారిని మట్ట‌బెట్టే దాక వ‌ద‌ల‌దు. ఆమే కుర్దీష్‌-దానిష్ మ‌హిళ అయిన జోనా పలానీ. వ‌య‌స్సు 23 ఏళ్లు. అయినా ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టేందుకు పోరాటం చేస్తోంది.

joanna-palani

జోనా ప‌లానీ పాలిటిక్స్‌లో డిగ్రీ చ‌దువుతున్న రోజుల‌వి. అయితే ఆమెకు మొద‌ట్నుంచీ కాస్త ధైర్యం పాళ్లు ఎక్కువే. ఈ క్ర‌మంలోనే ఆమె ఉగ్ర‌వాదుల వ‌ల్ల ఆయా దేశాలు ఎంత‌టి న‌ష్టాన్ని అనుభ‌విస్తున్నాయో క‌ళ్లారా చూసింది. దీంతో ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. అదేమిటంటే… క‌నిపించిన ఉగ్ర‌వాదిని క‌న‌బ‌డిన‌ట్టు మ‌ట్టుబెట్ట‌డం. అదే ప‌నికి ఆమె పూనుకుంది. అందుకు చ‌దువు అడ్డంకిగా ఉంద‌ని భావించింది. వెంట‌నే చ‌దువుకు స్వ‌స్తి చెప్పింది. ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది. ఈ క్ర‌మంలో ఆమె షూటింగ్ వంటి ప‌లు అంశాల్లో శిక్ష‌ణ తీసుకుంది.

joanna-palani-2

అయితే జోనా ప‌లానీ తాను అనుకున్న‌ట్టుగానే 2014లో సిరియా, ఇరాక్‌ల‌లోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల‌తో పోరాటానికి దిగింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చింది కూడా. అయితే ఆమెను డెన్మార్క్ పోలీసులు అరెస్టు చేసి అనంత‌రం బెయిల్‌పై విడిచి పెట్టారు. దాంతోపాటు ఆమెపై ఒక నిబంధ‌న కూడా విధించారు. అదేమిటంటే… డెన్మార్క్‌ను వ‌దిలి ఎక్క‌డికీ వెళ్ల‌కూడ‌ద‌ని. అయితే ఆమె త‌న ల‌క్ష్యాన్ని మానుకోలేదు. మ‌ళ్లీ ఉగ్ర‌వాదుల‌పై విరుచుకు ప‌డేందుకు న‌డుం బిగించింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి కోపెన్ హాగ‌న్ జైలులో ఉంచారు. ఈ క్ర‌మంలో ఆమెకు కోర్టు రెండు సంవ‌త్స‌రాల జైలు శిక్ష కూడా విధించ‌నుంది. అయితే జోనా ప‌లానీ ఇప్ప‌టికీ ఏమంటుందంటే… ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెడ‌తానంటే డెన్మార్క్ ప్ర‌భుత్వం ఎందుకు ఒప్పుకోవ‌డం లేదో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని, స‌మాజానికి మంచి చేస్తున్నా త‌న‌ను ఇలా నిర్బంధించడం అన్యాయ‌మ‌ని అంటోంది. అయితే ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు మాత్రం ఆమెపై క‌క్ష క‌ట్టారు. ఆమెను చంపిన వారికి 10 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను అందిస్తామ‌ని చెబుతున్నారు. అయినా ఈ బెదిరింపుల‌కు ఆమె భ‌య‌ప‌డ‌డం లేదు స‌రి క‌దా, జైలు నుంచి వ‌చ్చాక కూడా తాను అదే ప‌ని చేస్తాన‌ని ధీమాగా చెబుతోంది. మ‌రి… ఆమె ల‌క్ష్యం నెర‌వేరుతుందా..?

Comments

comments

Share this post

scroll to top