యుద్ధంలో ఆమె భర్త మరణించారు…కానీ ఆమెకు పెన్షన్ అందడానికి 58 ఏళ్ళు పట్టింది!.. కారణం ఏంటో తెలుసా?

ఆర్మీలో ప‌నిచేసిన సైనికులు యుద్ధంలో చ‌నిపోతే ఆ సైనికుడి కుటుంబానికి నెల నెలా ఫించ‌న్ అందుతుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే ఆ వృద్ధురాలికి మాత్రం అలా ఫించ‌న్ అందేందుకు ఏకంగా 58 ఏళ్లు ప‌ట్టింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సాధార‌ణంగా ఏ సైనికుడుల అలా చ‌నిపోయినా అత‌ని కుటుంబానికి ఫించ‌న్ మొత్తం అందేందుకు పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. చాలా త్వ‌ర‌గానే ఆ డ‌బ్బు అందుతూ ఉంటుంది. కానీ ఆ మ‌హిళ విషయంలో మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. కార‌ణం… ఆమె నిర‌క్ష‌రాస్యురాలు కావ‌డం… భ‌ర్త గురించి స‌రిగ్గా తెలియ‌క‌పోవ‌డ‌మే..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..! ఇంత‌కీ ఆ వృద్ధురాలు ఎవ‌రో తెలుసా..?

Kashibai

ఆమె పేరు కాశీబాయి. మ‌హారాష్ట్ర వాసి. ఈమెకు చాలా చిన్న‌త‌నంలోనే… అంటే… పెళ్లి అనే మాట గురించి తెలిసీ తెలియ‌ని వ‌య‌స్సులోనే ఆమెకు పెళ్లి చేశారు. భ‌ర్త పేరు లాన్స్ నాయ‌క్ జోటి ధోండి యాద‌వ్‌. సైన్యంలో ప‌నిచేస్తాడు. అయితే పెళ్ల‌యిన వెంట‌నే వ‌చ్చిన రెండో ప్ర‌పంచ యుద్ధం కార‌ణంగా అందులో అత‌ను పాల్గొనేందుకు వెళ్లిపోయాడు. అనంత‌రం అత‌ను చ‌నిపోయాడు. అయితే పెళ్లి స‌మ‌యంలో కేవ‌లం ఒక‌టి రెండు సార్లు త‌ప్ప కాశీబాయి త‌న భ‌ర్త‌ను స‌రిగ్గా చూడ‌లేదు. ఈ క్ర‌మంలో అత‌ను ఎలా ఉంటాడో కూడా ఆమెకు స‌రిగ్గా ఆన‌వాళ్లు తెలియ‌దు. అయితే అత‌ను చ‌నిపోయాక మాత్రం ఆ వార్త కాశీబాయికి చేరింది. యుద్ధంలో ఆమె భ‌ర్త ధరించిన దుస్తుల‌ను మాత్రం ఆమెకు పంపారు. ఇదిలా ఉంటే… సైన్యంలో ప‌నిచేస్తూ త‌న భ‌ర్త చ‌నిపోయినందుకు గాను ఆమెకు వితంతు ఫించ‌న్ ఇస్తార‌ని కూడా ఆమెకు తెలియ‌దు. ఆర్మీ అధికారుల వ‌ల్ల తెలిసింది. అయితే ఆ ఫించ‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకునేంత అవ‌గాహ‌న కూడా ఆమెకు లేదు. దీంతో భ‌ర్త చ‌నిపోయాక 13 ఏళ్లకు గానీ ఆమెకు ఫించ‌న్ రాలేదు. అలా ఆమె 1958లో నెల‌కు రూ.8 వ‌ర‌కు ఒక సంవ‌త్స‌రం పాటు ఫించ‌న్ తీసుకుంది. 1959 నుంచి ఫించ‌న్ ఆగిపోయింది.

అయితే ప‌త్రాలు స‌రిగ్గా లేవంటూ అధికారులు మళ్లీ ఆమెకు ఫించ‌న్ ఇవ్వ‌డం ఆపేశారు. దీంతో ఆమెకు మ‌ళ్లీ ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఈ క్ర‌మంలో ఆమె ఓ యువ‌కున్ని కూడా కొడుకుగా ద‌త్త‌త తీసుకుంది. కానీ అత‌ను కూడా నిర‌క్ష‌రాస్యుడు కావ‌డంతో ఆమెకు తిప్ప‌లు త‌ప్ప‌లేదు. అలా ఆ విషయం మ‌రుగున ప‌డిపోయింది. అయితే ఈ మ‌ధ్యే అక్క‌డే స్థానికంగా ఉండే శ‌రద్ దెర్ అనే ఓ మాజీ సైనికుడు ఆమెకు కావల్సిన ప‌నిచేసి పెట్టాడు. ఆమె భ‌ర్త‌కు చెందిన ప‌త్రాల‌న్నింటినీ జ‌త చేసి ఫించ‌న్ కోసం ఆమె చేత ద‌ర‌ఖాస్తు చేయించాడు. చాలా పాత రికార్డులు కావ‌డంతో కొంత ఇబ్బందే అయింది. అయినా శ‌ర‌ద్ దెర్ ఏమాత్రం విసుగు చెంద‌క ఆ వృద్ధురాలి కోసం ప‌నిచేశాడు. ఈ క్ర‌మంలో అధికారులు కూడా వేగంగా స్పందించ‌డంతో ఇప్పుడామె ఫించ‌న్ ఓకే అయింది. దీంతో ఎప్ప‌టి నుంచో రావ‌ల్సి ఉన్న పెండింగ్ ఫించ‌న్ మొత్తం ఇప్పుడామెకు అంద‌నుంది. అయితే ఆ మొత్తాన్ని ఆమెకు స్పెష‌ల్ ఫ్యామిలీ స్కీమ్ కింద ఇవ్వ‌నున్నారు. అలా ఇచ్చాక కూడా నెల‌కు రూ.24వేల వ‌ర‌కు ఆమెకు ఫించ‌న్ అంద‌నుంది. త్వ‌ర‌లోనే ఆమె ఆ మొత్తాన్ని అందుకోనుంది..! ఏది ఏమైనా… ఆ వృద్ధురాలు ప‌డ్డ పాట్లు మ‌రొక‌రికి రాకూడ‌దు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top