#మాన‌వ‌త్వం ఇంకా స‌జీవంగానే ఉంది అన‌డానికి రుజువు ఈ వాస్త‌వ ఘ‌ట‌న‌!

న‌లుగురిలో ఉన్నప్పుడు ఎవ‌రికైనా ఏదైనా సమ‌స్య వ‌స్తే అప్పుడు ఆ వ్య‌క్తికి చుట్టూ ఉన్న వారు స‌హాయం చేయాలి. అదే మంచి స‌మాజం అనిపించుకుంటుంది. స‌మాజంలో అంద‌రి మ‌ధ్య స‌త్సంబంధాలు, మాన‌వ‌త్వం నెల‌కొంటాయి. ముంబై వాసులు కూడా అలాంటి మాన‌వ‌త్వాన్నే ప్ర‌ద‌ర్శించారు. ర‌న్నింగ్ లోక‌ల్ ట్రైన్ లో పురిటి నొప్పులతో బాధ‌ప‌డుతున్న ఓ ముస్లిం మ‌హిళ‌కు మ‌హిళా ప్ర‌యాణికులు కాన్పు చేశారు. దీంతో ఆ మ‌హిళ పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది.

officer-with-baby

అత‌ని పేరు మ‌హ‌మ్మ‌ద్ ఇర్ష‌ద్‌. అత‌ని భార్య పేరు సుల్తానా షేక్‌. ఈ నెల 5వ తేదీన ఆమెకు డాక్ట‌ర్లు డెలివ‌రీ డేట్ ఇచ్చారు. అయితే అందుకు నాలుగు రోజుల ముందుగానే అంటే ఈ నెల 1వ తేదీన సుల్తానాకు పురిటి నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఇర్ష‌ద్ త‌న త‌ల్లి స‌హాయంతో భార్య సుల్తానాను తీసుకుని లోక‌ల్ ట్రెయిన్ ఎక్కాడు. వారు ముంబై సీఎస్‌టీ వ‌ద్ద ఉన్న ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌కు ట్రైన్‌లో ప్ర‌యాణ‌మ‌య్యారు. కాగా ట్రెయిన్ దాద‌ర్ స్టేష‌న్ చేరుకుంటుంద‌న‌గా సుల్తానాకు నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో ఇర్ష‌ద్ తోటి మ‌హిళా ప్ర‌యాణికులను స‌హాయం అడగ్గా వారు సుల్తానాకు పురుడు పోసేందుకు సిద్ధ‌మ‌య్యారు.

baby-mumbai

dadar-railway-station

అయితే ట్రెయిన్ అంతలోనే దాద‌ర్ స్టేష‌న్‌కు చేరుకుంది. దీంతో ట్రైన్‌లో ఉన్న టిక్కెట్ కలెక్ట‌ర్ చైన్ లాగారు. అనంత‌రం రైల్వే స్టేష‌న్‌లో అందుబాటులో ఉన్న వైద్యుల‌ను పిలిపించారు. దీంతో సుల్తానాకు వారు ట్రైన్‌లోనే విజ‌య‌వంతంగా డెలివ‌రీ చేశారు. పండంటి ఆడ‌పిల్ల ఆమెకు జ‌న్మించింది. ఆ త‌రువాత సుల్తానాను రైల్వే పోలీసులు స్థానికంగా ఉన్న ఓ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం త‌ల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు. అయితే మ‌హ‌మ్మ‌ద్ ఇర్ష‌ద్ మాత్రం త‌న భార్య‌కు స‌హాయం చేసిన వారంద‌రికీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. అడ‌గ్గానే త‌న భార్య‌కు స‌హాయం చేసిన వారంద‌రికీ అత‌ను కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు. అంతే క‌దా మ‌రి..! స‌మాజం అన్నాక అంద‌రం ఒక‌రికొక‌రం ఆ మాత్రం స‌హాయం చేసుకోవాలి క‌దా..!

Comments

comments

Share this post

scroll to top