బుర‌ఖా ధ‌రించ‌లేద‌ని… ముస్లిం మ‌హిళ‌కు సౌదీలో బెదిరింపులు..!

ముస్లిం మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్తే క‌చ్చితంగా బుర‌ఖా ధరించాల్సిందే… ఇది ఆ వ‌ర్గం మ‌త పెద్ద‌లు, ఇత‌రులు చెప్పే మాట‌. ముస్లిం మ‌హిళ‌లు బుర‌ఖా ధ‌రించాల‌ని ఎక్క‌డా లేదు. క‌నీసం ఖురాన్‌లో కూడా ఆ మాట చెప్ప‌లేదు. అందుకే నా ఇష్టం వ‌చ్చినట్టు నేనుంటా… ఇదీ బుర‌ఖాపై ఆ ముస్లిం మ‌హిళ అభిప్రాయం. ఆ క్ర‌మంలోనే ఆ దేశంలో బుర‌ఖా లేకుండా బ‌య‌ట తిరిగింది. అంత‌టితో ఆగ‌లేదు. ముందు చెప్పిన‌ట్టుగా మాట‌లు చెబుతూ ట్విట్ట‌ర్ పోస్ట్ చేసింది. అందులో బుర‌ఖా లేకుండా దిగిన ఫొటోను కూడా పెట్టింది. అయితే చివ‌రిక‌దే పోస్టు ఇప్పుడు ఆమె ప్రాణాల‌కే ప్ర‌మాదంగా మారింది. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే…

al-shehri

ఆమె పేరు మ‌ల‌క్ అల్‌-షెహ్రి. త‌న సోద‌రితో క‌లిసి ఇటీవ‌లే సౌదీకి ప‌ర్యాట‌కురాలిగా వ‌చ్చింది. అయితే ఆమె బ‌య‌ట తిరిగిన‌ప్పుడల్లా బుర‌ఖా ధ‌రించ‌లేదు. కానీ సౌదీలో ముస్లిం మ‌హిళే కాదు, ఇత‌ర మ‌తాల‌కు చెందిన మ‌హిళ‌లు కూడా బ‌య‌ట తిరిగితే విధిగా బుర‌ఖా ధ‌రించాల్సిందేన‌ట‌. అది ఆ దేశ నియ‌మం. కానీ అల్‌-షెహ్రి అదేమీ పాటించ‌లేదు. స్వ‌త‌హాగా ముస్లిం మ‌హిళ అయిన‌ప్ప‌టికీ ఆమె త‌న వ‌ర్గం పెట్టిన నిబంధ‌న‌ల‌ను ఖాత‌రు చేయ‌లేదు. సౌదీలో ఎక్క‌డ తిరిగినా బుర‌ఖా వేసుకోలేదు స‌రిక‌దా ఒ కేఫ్ వ‌ద్ద బ‌య‌ట ఫొటో దిగి దాన్ని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. అందులో బుర‌ఖా అంటే త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని, ఇస్లాంలో దాని గురించి చెప్ప‌లేద‌ని త‌న ట్వీట్‌లో పేర్కొంది. దీంతో ఆమె పోస్ట్ వైర‌ల్ అయింది. అది అంత‌టా తిరిగి తిరిగి కొంద‌రు ముస్లిం మ‌త పెద్ద‌ల‌కు, ఇత‌రుల‌కు తెలియ‌డంతో ఆమెకు క‌ష్టాలు ప్రారంభ‌మ‌య్యాయి.

కొంద‌రు ఆ పోస్ట్‌ను డిలీట్ చేయాల‌ని వార్నింగ్ ఇవ్వగా, కొంద‌రైతే చంపేస్తామ‌ని బెదిరించారు. దీంతో అల్‌-షెహ్రి ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. అయినా ఆమెకు బెదిరింపులు ఆగ‌లేదు. కొంద‌రైతే ఆమెను ఉరి తీయాల‌ని బ‌హిరంగంగానే చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పుడామె ఎక్క‌డుందో వెతికే ప‌నిలో ప‌డ్డారట కొంద‌రు వ్య‌క్తులు. అయితే ఆమె దొరుకుతుందో లేదో తెలియ‌దు కానీ, ఇప్పుడీ విష‌యం సౌదీలో పెద్ద దుమార‌మే రేపుతోంది. కొంద‌రు అల్‌-షెహ్రికి మ‌ద్ద‌తుగా ఉండ‌డం కూడా గ‌మ‌నార్హం. ఇక చివ‌ర‌కు ఈ విష‌యం ఎన్ని ప‌రిణామాలకు దారి తీస్తుందో..! అల్‌-షెహ్రికి ఏమ‌వుతుందో… మ‌న‌మైతే చెప్ప‌లేం..!

Comments

comments

Share this post

scroll to top