ఎవరి మూత్రం వారు తాగితే రోగాలు రావని మన మాజీ ప్రధాని ఛెప్పిన మాటలను 20 యేళ్ళుగా పాటిస్తున్న గ్రామస్థులు.!

మనదేశ నాల్గవ ప్రధాని మొరార్జీ దేశాయ్  ఎవరి మూత్రం వారు సేవించడం వలన ఎలాంటి రోగాలు దరిచేరవని, ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటారని తాను తన మూత్రం సేవిస్తున్నాని, చాలామందికి  చెప్పేవాడు. ఆయన  మాటలను కొందరు తిరస్కరించగా, ఈ  గ్రామప్రజలు  మాత్రం 20 యేళ్ళుగా ఆయన మాటలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని అమర్పూర్ అనే ఈ  గ్రామంలో వాళ్ళు నీటికి బదులుగా తమ మూత్రాన్ని తాగుతున్నారు. ఈ విషయం వారికి తప్పుగా మరియు ఇదేదో శిక్షలా అనిపించడంలేదు. కాగా తమకు ఇదే మంచిదని భావిస్తున్నారు.

1_1455623085

20 ఏళ్ళుగా ఆ గ్రామప్రజలు మూత్రం సేవిస్తున్నారు:
అప్పటి దేశ ప్రధాని మొరార్జీ దేశాయ్, ఎవరి మూత్రం వారు సేవించడం వలన చాలా రోజులుగా నయంకాని రోగాలు నయమవుతాయని, ఇక వ్యాధులు దరిచేరవని చెప్పాడు. ఆయన ఈ పని చేసేవాడట. ఇలా చేయడం వలన వ్యాధులు తొలగిపోవడమే కాకుండా,కంటిని మూత్రంతో శుభ్రం చేసుకుంటే కంటి శుక్లం సమస్యలు కూడా రావని ఆయన చెప్పిన  మాటలను అమర్పూర్ గ్రామానికి చెందిన ప్రజలు  అప్పటి నుండి అదే అనుచరిస్తున్నారు. తమ మూత్రాన్ని తామే తాగుతున్నారు.దీని వలన ఎలాంటి వ్యాధులు తమ ఒంటికి సోకవని,ఆరోగ్యంగా ఉంటున్నామని చెబుతున్నారు. అయితే కొందరు వైద్య పరిశోధకులు ఇలా చేయడం తప్పని ఆరోగ్యానికి ప్రమాదమని చెప్పినా, ఆ విషయం గురించి అక్కడి ప్రజలు ఖాతరు చేయడం లేదు. ఇంకా ఇలా సేవించడం వలన తమ కండదారుడ్యం బలంగా ఉంటుందని మరికొందరు చెబుతున్నారు.
2_1455623086
ఇలా మూత్రం సేవించడం ఎలా మొదలైంది:
ఈ గ్రామంలో మొత్తం 7 లక్షల మంది జనాభా ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక వ్యక్తికి ఏదో అంతుచిక్కని వ్యాధి సోకింది. వైద్యులకు చూపిస్తే చేతులెత్తేశారు. ఆ రోగం అలా రోజురోజుకు అందరికీ చుట్టుకుంది. ఆ వ్యాధిని ఎలా అరికట్టాలో తెలియలేదు వారికి. ఆ ఊరిలో నివసించే ఒక పెద్దాయన మొరార్జీ చెప్పిన మాటలను చెప్పాడు. చాలా రోజుల నుండి నయం కాని రోగాలు, తమ మూత్రం సేవించడం వలన తగ్గిపోతాయని. ఇక జీవితంలో మళ్ళీ రోగాల బారినపడమని ఆయన చెప్పాడు. అయితే ఆ పెద్దమనిషి చెప్పిన మాటలను మొదట అందరూ తిరస్కరించారు. ఆ వ్యాధి సోకిన వారు, మూత్ర్రం సేవించిన తర్వాత ఆరోగ్యంగా ఉండడంతో ఇక అందరూ తమ మూత్రాన్ని సేవించడం మొదలుపెట్టారు. అలా గత 20 ఏళ్ళుగా తమ మూత్రాన్ని వారు సేవిస్తూ ఆరోగ్యంగా ఉన్నారు. ఎలాంటి రోగాలకైనా మూత్రమే ఔషధమని దాహంవేసినా, అలసినా మూత్రమే సేవిస్తున్నారు.
5_1455623086
వైద్య పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే:
వైద్య పరిశోధకులు పరిశోధనలు చేసి మూత్రం సేవిస్తున్న విషయం గురించి ఒక నివేదికను రూపొందించారు. అందులో వారు ఏం చెప్పారంటే మానవుడి శరీరం నుండి బయటకు వెలువడే మూత్రంలో 95%నీరు, మిగిలన 5%శరీరానికి హానిచేసే క్రిములు, వ్యర్థ పదార్థాలు ఉంటాయి. అందుకని ఎట్టి పరిస్థులలోనూ మానవుడు తన మూత్రాన్ని సేవించకూడదని, హానికరమని చెబుతున్నారు. అయితే ఎంతమంది వైద్యులు ఈ విషయం చెప్పినా తాము ఫిక్స్ అయిన రూట్ లోనే అక్కడి ప్రజలు వెళ్తున్నారు.
7_1455623086

Comments

comments

Share this post

scroll to top