మాంసాహారులను శాఖాహారులుగా మారుస్తున్న వీడియో!? వెజ్ టేరియన్ గా మారాలనుకుంటే ఈ వీడియో చూడండి.

ఎటు చూసినా ర‌క్తం. ఎరుపు రంగు పులుముకుందేమో అన్న‌ట్టుగా అక్క‌డంతా ఎక్క‌డ చూసినా నెత్తురే. అలాంటి స్థితిలో ఉన్న ఆ ప్ర‌దేశంలో నోరు లేని మూగ‌జీవాలు మ‌మ్మ‌ల్ని ఎందుకు పుట్టించావ‌య్యా… దేవుడా… అన్న‌ట్టు చూస్తున్నాయి. ఆరోగ్యం బాగా లేక, తిండి స‌రిగ్గా తిన‌క అప్ప‌టికే శుష్కించి ఉన్న శ‌రీరాల‌పై క‌నిక‌రం లేకుండా మోదుతున్న య‌జ‌మానిని చూసి ఏమీ చేయ‌లేని స్థితిలో ఉన్నాయ‌వి. ఓ వైపు గున‌పాలు గుచ్చుకుంటున్నాయి. మ‌రోవైపు య‌జమానులు రాళ్లు, క‌ర్ర‌లు అని తేడా లేకుండా దేంతో ప‌డితే దాంతో కొడుతున్నారు. ఇంకో వైపు ప్రాణం ఉన్న జీవుల‌ని కూడా చూడ‌కుండా వాటి అవ‌య‌వాల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు క‌త్తిరిస్తున్నారు. వెర‌సి… ఆ ప్ర‌దేశం బ‌య‌టికి చూసేందుకు బాగానే ఉన్నా… లోప‌లికి వెళితేనే… అక్క‌డ జ‌రుగుతున్న జంతు హింస గురించి తెలుస్తుంది. అది హింస కాదు. అంత‌క‌న్నా ఎక్కువే. దాన్ని వ‌ర్ణించ‌డానికి ప‌దాలు కూడా స‌రిపోవేమో. అవును, మీరు వింటుంది నిజ‌మే. ఇది క‌థ కాదు. జంతువుల ఫామ్ (క్షేత్రం) ల‌లో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న దాని గురించే మేం చెబుతోంది. ఇది మేం చెప్పేది కాదు. ఓ జ‌ర్న‌లిస్టు ఇన్వెస్టిగేష‌న్‌లో బ‌య‌ట ప‌డిన నిజాలు.

cows

అత‌ని పేరు కోడీ కార్ల్‌స‌న్‌. అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో నివాసం ఉంటున్నాడు. హ్యూమ‌న్ సొసైటీ అనే సంస్థ‌లో ఇన్వెస్టిగేటివ్ జర్న‌లిస్ట్‌గా ప‌నిచేస్తున్నాడు. ఈ క్ర‌మంలో అత‌ను అమెరికాలోని ప‌లు ప్రాంతాల్లో ఉన్న ఆవులు, కోళ్లు, పందులు, చేప‌ల ఫామ్స్‌ల‌లో ప‌నిచేశాడు. అలా ప‌నిచేసే స‌మ‌యంలో అక్క‌డ జ‌రుగుతున్న తంతును వీడియో తీశాడు. పైన మేం చెప్పింది అదే. అయితే దీన్ని చూసిన కోడీ మ‌న‌స్సు చ‌లించిపోయింది. ఆయా ఫామ్స్‌లో చిత్ర హింస‌ల‌కు గుర‌వుతున్న మూగ జీవాల‌ను చూసి అత‌ను త‌ట్టుకోలేక‌పోయాడు. దీంతో అత‌ను పూర్తి స్థాయి వెజిటేరియ‌న్‌గా మారిపోయాడు. అంతేకాదు, ఆ వీడియోను మీడియా సంస్థ‌ల‌కు అంద‌జేశాడు. ఈ క్ర‌మంలో ఆయా ఫామ్స్‌ల‌లో జ‌రుగుతున్న జీవ‌హింస గురించి అంద‌రికీ తెలిసింది. అయినా ష‌రా మామూలే. నాన్‌వెజ్ తినేవారు దాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. కానీ కొంద‌రిలో మాత్రం మార్పు వ‌చ్చింది.

కోడీ తీసిన వీడియో ఏమోగానీ చాలా మంది మాంసాహారుల‌ను శాఖాహారులుగా మార్చేసింది. అయితే ఇంకా ఎక్కువ మందిలో స్పంద‌న తీసుకురావ‌డం కోసం కోడీ ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశాడు. అదే మీట్ వీడియో. www.meatvideo.in. అందులో కోడీ తాను తీసిన వీడియోను అప్‌లోడ్ చేశాడు. దానికి ప‌క్క‌నే శాఖాహారులుగా మారాల‌ని సూచిస్తూ ఓ ప్లెడ్జ్ ఫాంను కూడా ఏర్పాటు చేశాడు. దాంట్లో ఈ-మెయిల్ ఐడీని ఎంట‌ర్ చేసిన‌వారు శాఖాహారులుగా మారిపోయి ప్లెడ్జ్ తీసుకున్న‌ట్టే లెక్క‌. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే దాదాపుగా 16వేల మందికి పైనే ఈ ప్లెడ్జ్ ను తీసుకున్నారు. అయితే అలా ప్లెడ్జ్ తీసుకున్న వారికి వెజిటేరియ‌న్ డైట్‌, రెసీపీలు, టిప్స్ క‌లిగిన బుక్‌ను ఉచితంగా అంద‌జేస్తుండ‌డం విశేషం. మీరు కూడా శాఖాహారులుగా మారాలంటే ప్లెడ్జ్ తీసుకోండి మరి. దాంతో వెజిట‌బుల్ డైట్‌, రెసిపీల‌తో కూడిన బుక్ కూడా వ‌స్తుంది.

కోడీ కార్ల్‌స‌న్ తీసిన వీడియో ఇదే…

Comments

comments

Share this post

scroll to top