ఈ భూమిపై మనం జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనపై ప్రేమ చూపిస్తారు. కానీ ఎవరెంత ఆప్యాయత, ప్రేమ కనబరిచినా తల్లి ప్రేమ ముందు అవన్నీ దిగదుడుపే. బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లికి, ఆ బిడ్డకు మధ్య చిగురించే అనుబంధం వర్ణించరానిది. బిడ్డ ప్రతి క్షణంలోనూ తల్లి పాత్రే ముందుంటుంది. బిడ్డకు మాట, నడక నేర్పించడం మొదలుకొని, గోరు ముద్దలు తినిపించడం, నిత్యం కావల్సిన పనులు చేసి పెట్టడం, అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకోవడం, అల్లారు ముద్దుగా పెంచడం వంటి ఎన్నో సందర్భాల్లో తల్లే ముందుంటుంది.
బిడ్డకు ఆనందం కలిగినా, దుఃఖం వచ్చినా, ఇతర ఎలాంటి భావాలు కలిగినా, బాధ కలిగినా, అనారోగ్యం వచ్చినా తల్లి వాటిలో భాగస్వామి అవుతుంది. బిడ్డ ఆనందాన్ని తన ఆనందం అనుకుంటుంది. బిడ్డ బాధను తన బాధ అనుకుంటుంది. సరిగ్గా ఇదే విషయాన్ని అనుసరించి ఓ కంపెనీ తీసిన యాడ్ అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆ కంపెనీ ఉత్పత్తి ప్రమోషన్ కోసమే అయినా ఆ యాడ్ ద్వారా తల్లి ప్రేమ ఎలాంటిదో చెబుతూ ఆ ప్రేమను మిస్ చేసుకోవద్దని, తల్లితో బిడ్డలు తమ అనుబంధాన్ని అలాగే కొనసాగించాలనే ఓ అంతర్గత సందేశాన్ని అద్భుతంగా తెలియజేశారు.
యూట్యూబ్లో వైరల్గా మారిన ఆ వీడియోను కింద వీక్షించవచ్చు…