నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కొత్త వీడియో… ముంబై తొక్కిసలాటలో లైంగిక దాడా..? లేక సహాయ చర్యనా.? [VIDEO]

ముంబై లోని ఎల్ఫిన్ స్టోన్ రైల్వే స్టేషన్ లో 23 మంది తొక్కిసలాటలో చనిపోగానే…ఒక 25 ఏళ్ల యువతిపై లైంగిక దాడి జరిగిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ది హిందూ కథనం ప్రకారం “తొక్కిసలాటలో చావు బతుకుల మధ్య ఉండి సాయం కోసం ఎదురుచూస్తున్నా ఓ అమ్మాయిపై అత్యాచారంకి పాల్పడ్డారు కొందరు నీచులు.ఇటీవలే సిఏ పూర్తి చేసి ఆక్సిస్ బ్యాంకు లో పనిచేస్తుంది “హిలోని”. పదిన్నరకు ఎల్ఫిన్ స్టోన్ స్టేషన్ చేరుకుంది. చనిపోయిన 22 మంది లో ఈ 25 ఏళ్ల యువతి ఒకరు. ఆమె బంధువులు ఆమె డ్రెస్, బాగ్ చూసి ఆమెను కనిపెట్టారు. సీసీ ఫుటేజ్ లో చుస్తే కొందరు నీచులు ఆమెపై దాడి చేసినట్టు…నగలు, డబ్బులు దోచుకున్నట్టు తెలుస్తుంది.”. ఇదే విషయాన్నీ నిన్న ఎన్నో మీడియా చానెల్స్ ప్రచారం చేసారు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. ఇది రాసిన వారిలో మేము కూడా ఒకళ్ళం. కానీ మరో వీడియోలో మరో కోణం బయటపడింది. ఎంత తప్పుగా రాసామో అర్ధం అయ్యింది. హిందూ లాంటి పెద్ద మీడియా చానెల్స్ కూడా న్యూస్ ను తప్పు దారి పట్టించాయి అని అర్ధం అయ్యింది!

హిందూ రిలీజ్ చేసిన 8 సెకండ్ల వీడియో చూడండి. ఈ వీడియో చూసి లైంగిక దాడి అని ప్రచురించారు.

watch video here:

https://twitter.com/vedikachaubey/status/914320922626080768

ఇప్పుడు ట్విట్టర్ లో 43 సెకండ్ల సరికొత్త వీడియో వచ్చింది. అందులో చుస్తే వాళ్ళు లైంగిక దాడికి పాల్పడట్లేదు..సహాయం చేస్తున్నారు అని అర్ధం అవుతుంది.  ఈ కొత్త వీడియో చూసి నిజం తెలుసుకొని నెటిజన్లు పెద్ద మీడియా ఛానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

watch video here:

Comments

comments

Share this post

scroll to top