షార్ట్ ఫిలిం వీడియోతో దీపావ‌ళికి అస‌లైన అర్థం చెప్పాడు ఆ న‌టుడు..!

దీపావ‌ళి అంటే నిజంగా ట‌పాకాయ‌లు పేల్చ‌డ‌మేనా..? ఇప్ప‌టి త‌రం వారిని అడిగితే ఇదే చెబుతారు. కానీ నిజంగా అస‌లు దీపావళి అంటే ఏమిటి..? అదొక వేడుక‌… సంతోషాన్ని అంద‌రితోనూ పంచుకునే సంబురం. అంద‌రి జీవితాల్లోనూ వెలుగులు నిండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకోవాల్సిన త‌రుణ‌మ‌ది. టపాకాయ‌లూ అవీ మొన్నా మ‌ధ్య నుంచే వ‌చ్చాయి, కానీ అస‌లు పండుగ అంటే మ‌నం తెలుసుకోవాల్సిన అర్థం అదే. దానికి బ‌దులు ఇప్పుడు మ‌నం చేస్తున్న‌ది ఏంటి..? ట‌పాకాయ‌ల పేరిట డ‌బ్బును ఖ‌ర్చు చేయ‌డం.!?

diwali-meaning

వేల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి ట‌పాసులు కొని కాలుస్తాం. ఎంజాయ్ చేస్తాం. కానీ అదే డ‌బ్బును ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌ల ఆర్తిని తీర్చ‌డం కోసం ఉప‌యోగిస్తే..? అంత‌కు మించిన పరోప‌కారం ఇంకోటి ఉండ‌దు. నిజానికి చెప్పాలంటే ట‌పాసులంటే డ‌బ్బును కాల్చ‌డ‌మే. పరోక్షంగా దానికి అదే అర్థం వస్తుంది. అయినా దీన్ని ఎంద‌రు ఒప్పుకుంటారు..? అలా ఒప్పించ‌డానికి ఏదైనా ప్ర‌య‌త్నం చేస్తే అలాంటి వారినే త‌ప్పు ప‌డ‌తారు. వాస్తవానికి ద‌గ్గ‌ర‌గా ఆలోచించండి. దీపావ‌ళి అంటే ట‌పాకాయ‌లు కాదు… ఆప‌న్న‌హ‌స్తం కోసం ఎదురుచూస్తున్న ఆర్తుల బాధ‌ను తీర్చ‌డ‌మే. వారి జీవితాల్లో వెలుగులు నింప‌డ‌మే. అప్పుడు వారి ముఖాల్లో క‌నిపించే అస‌లైన చిరున‌వ్వులే తారాజువ్వ‌లు. వారి ఆనందాలే ఉవ్వెత్తున ఎగిసే చిచ్చుబుడ్లు అవుతాయి.

దీపావ‌ళి అంటే డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి ట‌పాకాయ‌లు కొని కాల్చ‌డం. అంటే పరోక్షంగా డబ్బును కాల్చిన‌ట్టే. దానికి బ‌దులుగా అదే డ‌బ్బును పేదల కోసం ఉప‌యోగించండి..! అంటూ న‌టుడు వ‌రుణ్ పృథ్వి ఇస్తున్న సందేశ‌మిది. దాన్ని వీడియో రూపంలో కింద వీక్షించ‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top