ఈ ప్ర‌త్యేక‌మైన రోడ్లు వ‌ర్షం నీటిని పీల్చేస్తాయి..! రోడ్లు కూడా పాడ‌వ‌వు..!ఇద్ద‌రు ఇంజ‌నీరింగ్ విద్యార్థుల అద్భుత‌సృష్టి.

మ‌న దేశంలో వ‌ర్షాకాలంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. చిన్న‌పాటి వర్షం ప‌డినా రోడ్లు చెరువుల‌ను త‌ల‌పిస్తాయి. ఇక అందునా హైద‌రాబాద్ లాంటి న‌గ‌రంలో అయితే అలాంటి చెరువుల‌కు లెక్కే ఉండ‌దు. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని ప్ర‌యాణం చేస్తారు. ఇక వ‌ర్షం త‌గ్గాక రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో చెప్ప‌లేం. వాటిని ఓ ప‌ట్టాన బాగు చేయ‌రు. ఈ క్ర‌మంలో కాలాలు అలా దొర్లిపోయి వేస‌వి వ‌స్తే మ‌ళ్లీ నీటికి క‌ట‌క‌టే. వ‌ర్షాకాలంలో ఎన్నో కోట్ల‌, ల‌క్ష‌ల లీట‌ర్ల నీరు రోడ్ల‌పై వృథాగా పోతుంది. వేస‌విలో నీరే దొర‌క‌దు. అందుకు కార‌ణం భూగ‌ర్భ జ‌లాలు ఎండిపోవ‌డం. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేదా..? అంటే… ఉంది..! ఇద్ద‌రు విద్యార్థులు రోడ్ల ప‌రిస్థితికే కాదు, నీటి స‌మ‌స్య‌కూ చ‌క్క‌ని ప‌రిష్కారం చూపారు. మరి వారు క‌నిపెట్టిన  ఆ ప‌రిష్కారం ఏమిటంటే…

surana-sridharan
వారి పేర్లు అమ‌న్ సురానా, య‌దార్థ్ శ్రీ‌ధ‌ర‌న్. చ‌దువుతోంది హై స్కూల్‌లో. ఉంటోంది రాజ‌స్థాన్‌లోని జైపూర్‌లో. వీరిద్ద‌రే పైన చెప్పిన ఆయా స‌మ‌స్య‌ల‌కు ఒకే ప‌రిష్కారం క‌నుగొన్నారు. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా వారు క‌నిపెట్టిన ఆ ప‌రిష్కారం రెండు స‌మ‌స్య‌ల‌కు ప‌నికొచ్చింది. Reinforced Thermoplastic Composite Lumber (RTCL). ఇదే వారు క‌నిపెట్టింది. ఇంత‌కీ దీన్ని ఎలా త‌యారు చేస్తారో తెలుసా..? ప‌్లాస్టిక్‌తో..! మ‌న దేశంలో ఏటా 70 ల‌క్ష‌ల ట‌న్నుల ప్లాస్టిక్ వాడుతున్నార‌ట‌. అదంతా వ్య‌ర్థంగా మిగిలిపోతుంది. అలా వ్య‌ర్థంగా మిగిలిన ప్లాస్టిక్ నే ముందు చెప్పిన విధంగా ఆర్‌టీసీఎల్ గా త‌యారు చేస్తారు. దీన్ని  రోడ్లు వేసేందుకు ఉప‌యోగిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల రోడ్డు నిర్మాణానికి చాలా త‌క్కువ వ్య‌యం అవుతుంద‌ట‌. తారు, సిమెంట్ క‌న్నా చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే దీంతో రోడ్డు వేయ‌వ‌చ్చు. అలాగే మ‌ర‌మ్మ‌త్తుల‌కు కూడా చాలా తక్కువే అవుతుంది. వాటిని నిర్వ‌హించ‌డం కూడా చాలా ఈజీ.

rtcl-roads
అయితే ఆర్‌టీసీఎల్ ప‌ద్ధతిలో వేసే రోడ్ల‌కు లోప‌లి భాగంలో పీవీసీ పైపులు ఉంటాయి. రోడ్డు మ‌ధ్య‌లో ఉండే ప్ర‌త్యేకమైన నిర్మాణం ద్వారా దానిపై ప‌డ్డ నీరు ఆ పీవీసీ పైపుల గుండా లోప‌లికి వెళ్తుంది. దీంతో భూగర్భ జ‌లాలు పెరుగుతాయి. ఈ క్ర‌మంలో రోడ్డుపై ప‌డే వ‌ర్ష‌పు నీరు ఎప్ప‌టికప్పుడు లోప‌లికి వెళ్తూ ఉంటుంది. ఫ‌లితంగా రోడ్లు బాగుండ‌డ‌మే కాదు, నీటి వ‌న‌రులు కూడా పెరుగుతాయి. ఇలా ఆర్‌టీసీఎల్ ప‌ద్ధ‌తిలో వేసే రోడ్ల వ‌ల్ల రెండు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భించిన‌ట్టు అయింది. అయితే ఆ విద్యార్థులు ప్ర‌స్తుతం త‌మ డిజైన్‌కు పేటెంట్ తీసుకునే ప‌నిలో ప‌డ్డారు. అది ఓకే అయ్యాక‌… ఇక‌పై ఆర్‌టీసీఎల్ రోడ్లే మ‌న‌కు అందుబాటులోకి రానున్నాయి. అవి వ‌స్తే… మ‌న‌కు ఎంత‌గానో లాభం ఉంటుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top