ఈ ట్రిక్ తో ఎంత‌టి గాఢ నిద్ర వ‌స్తున్నా ఎంత సేపైనా ఆపుకోవ‌చ్చు తెలుసా..!

నిద్ర అనేది మ‌న‌కు అత్య‌వ‌స‌రం. రోజంతా శ్ర‌మ చేసే వారైనా, ఖాళీగా ఉండేవారైనా, చిన్న‌, పెద్ద ఎవ‌రైనా రాత్ర‌యితే నిద్ర పోవాల్సిందే. అయితే వ్య‌క్తుల ప‌నులు, వారి ఇష్టాలు, అభిరుచుల‌ను బ‌ట్టి వారు నిద్ర‌పోయే వేళ‌లు వేరేగా ఉంటాయి. కొంద‌రు బాగా ఎక్కువ సేపు మేల్కొని రాత్రి ఎప్పుడో నిద్రిస్తారు. కొంద‌రు రాత్రి 7 గంట‌ల‌కే ముసుగు త‌న్నేస్తారు. కానీ కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రం ఒక్కోసారి నిద్ర‌ను ఆపుకుని ఉండాల్సి వ‌స్తుంది. అది ప‌ని గురించి కావ‌చ్చు, మ‌రేదైనా విష‌యం కావ‌చ్చు. అలాంట‌ప్పుడు క‌ళ్ల మీద‌కు వ‌స్తున్న నిద్ర‌ను ఆపుకోవ‌డం కోసం చాలా మంది అనేక ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తారు. కొంద‌రు టీ తాగుతారు, కొంద‌రు ముఖం క‌డుక్కుంటారు. అయితే అవి కాకుండా ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ ట్రిక్‌ను పాటించి చూడండి. దీంతో నిద్ర అస్సలే రాదు, కావ‌ల్సినంత సేపు మెళ‌కువ‌తో ఉండ‌వ‌చ్చు. ఆ ట్రిక్ ఏమిటంటే…

పెట్రోలియం జెల్లీ తెలుసు క‌దా. అదేనండీ వాజెలైన్‌. దాన్ని కొంచెం తీసుకుని క‌ను రెప్ప‌ల‌పై అప్లై చేయండి. అంతే.. ఇక నిద్ర మీ జోలికి రాదు. అవును, మేం చెబుతోంది నిజ‌మే. వాజెలైన్‌ను అప్లై చేస్తే అస‌లు మీకు నిద్ర రాదు. ఇది ఎలా ప‌నిచేస్తుందో తెలుసుకోవాల‌నుకుంటున్నారా..? అయితే ఇదిగో ఇలా…

సాధార‌ణంగా మ‌నం వాజెలైన్‌ను ఎందుకు రాసుకుంటాం..? చ‌ర్మం తేమ‌తో ఉండాల‌ని చెప్పి చ‌లికాలంలో ఎక్కువ మంది దీన్ని రాసుకుంటారు. ఆ మాట‌కొస్తే కొంద‌రు మిగిలిన కాలాల్లోనూ రాసుకుంటారు లెండి, అది వేరే విష‌యం. అయితే ఏ కాలంలో రాసుకున్నా చ‌ర్మానికి తేమ‌ను ఇవ్వ‌డ‌మే దాని ప‌ని. ఈ క్ర‌మంలో దాన్ని క‌ను రెప్ప‌ల‌పై అప్లే చేస్తే అది క‌ళ్ల‌కు తేమ‌ను ఇస్తుంది. దీంతో క‌ళ్లు ఎప్పుడూ తేమ‌గా ఉంటాయి. త‌ద్వారా నిద్ర రాదు. ఎలా అంటే… మీకు నిద్ర వ‌స్తున్న‌ప్పుడు స‌హ‌జంగానే మీ క‌ళ్లు పొడిగా మారుతాయి. మెద‌డు క‌ళ్ల‌కు నీటిని పంప‌దు. అందుకే అవి డ్రై అయి నిద్ర ముంచుకు వస్తుంది. అలాంట‌ప్పుడు ముఖం క‌డుగుతారు క‌దా, దీంతో కొంత తేమ క‌ళ్ల‌కు త‌గిలి కొంత సేపు మెళ‌కువ‌తో ఉంటారు. కానీ ఆ తేమ పోతే మ‌ళ్లీ నిద్ర ముంచుకు వ‌స్తుంది. మెద‌డు ద్ర‌వాల‌ను క‌ళ్ల‌కు పంప‌దు. దీంతో నిద్ర వ‌స్తుంది. అయితే వాజెలైన్‌ను అప్లై చేయ‌డం వ‌ల్ల చాలా సేప‌టి వ‌ర‌కు తేమ క‌ళ్ల‌కు ఉంటుంది. క‌నుక నిద్ర రాకుండా ఆపుకోవ‌చ్చు. అయితే దీన్ని అవ‌స‌రం అనుకుంటేనే వాడండి. ఎందుకంటే నిద్ర పోకుండా ఆపుకుని ఉండాల‌ని ఎవరూ కోరుకోరు క‌దా. నిద్ర పోతేనే మ‌న‌కు ఆరోగ్యం ల‌భిస్తుంద‌నే విష‌యాన్ని మాత్రం గుర్తుంచుకోండి..!

Comments

comments

Share this post

scroll to top