ఈ ట్రాఫిక్ పోలీస్ పడే కష్టానికి, నిజాయితికి నిలబడి సెల్యూట్ చేయాల్సిందే.

ట్రాఫిక్ పోలీసులంటే అడ్డ దిడ్డంగా ఇష్టం వచ్చిన‌ట్టు చ‌లాన్లు వేయ‌డం, లేదంటే వాహ‌న‌దారుల నుంచి అందినకాడికి దండుకోవ‌డం… వంటి విష‌యాలే దాదాపుగా అంద‌రికీ స్ఫుర‌ణ‌కు వ‌స్తాయి. కానీ ఆ శాఖ‌లో అంద‌రూ అలాంటి వారే ఉండ‌రు. వారిలో నిజాయితీగా ప‌నిచేసే వారు కూడా ఉంటారు. కానీ అలాంటి వారు మ‌న‌కు చాలా అరుదుగా క‌నిపిస్తారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి నీతి, నిజాయితీలు క‌లిగిన ఓ ట్రాఫిక్ ఏఎస్ఐ గురించే. అత‌నే ధ‌న్‌సుఖ్ మెన్సిభాయ్ క‌చోత్‌.

kachot

గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగంలో అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ (ఏఎస్ఐ) గా మెన్సిభాయ్ క‌చోత్ 2006 నుంచి ప‌నిచేస్తున్నాడు. అంత‌కు ముందు అత‌ను అదే న‌గ‌రంలో క్రైం విభాగంలోనూ సేవ‌లందించాడు. అయితే క‌చోత్ 2006 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 10 ఏళ్ల కాలంలో రూ.2.16 కోట్ల‌ను ట్రాఫిక్ చలాన్ల రూపంలో వాహ‌న‌దారుల నుంచి వ‌సూలు చేసి రికార్డ్ సృష్టించాడు. నిత్యం ఉద‌యం 9 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సిటీ రోడ్ల‌పై తిరుగుతూ అక్ర‌మంగా పార్కింగ్ చేయ‌బ‌డ్డ వాహ‌నాల‌ను ట్ర‌క్కులోకి ఎక్కించి అనంత‌రం వాటి కోసం వ‌చ్చే వాహ‌న‌దారుల‌కు ఫైన్ వేస్తాడు. దీంతో వారు ఫైన్ క‌చ్చితంగా చెల్లిస్తారు. అలా క‌చోత్ రోజుకు రూ.10 వేల నుంచి రూ.20వేల వ‌ర‌కు ఫైన్ల‌ను వాహ‌న‌దారుల నుంచి రాబ‌డుతున్నాడు.

అయితే వాహ‌న‌దారుల నుంచి ఫైన్‌ల‌ను రాబ‌ట్టే క్ర‌మంలో కొంద‌రు తాము అక్ర‌మంగా పార్క్ చేయ‌లేద‌ని బుకాయిస్తారు. దీంతో వారికి తాను తీసిన అక్ర‌మ పార్కింగ్ ఫొటోను క‌చోత్‌ చూపిస్తాడు. దీంతో వారు మారు మాట్లాడ‌కుండా ఫైన్ క‌డ‌తారు. డ్యూటీని అంత ప‌క్కాగా చేస్తాడు క‌చోత్‌. అంతేకాదు, ఫైన్ క‌ట్ట‌మ‌ని బెదిరించే వారిని కూడా త‌న దైన శైలిలో డీల్ చేసి ఫైన్ క‌ట్టేలా చేస్తాడు కచోత్‌. ఈ క్ర‌మంలో అత‌ను డ్యూటీలోనూ నిజాయితీని ప్ర‌ద‌ర్శిస్తాడు. వాహ‌న‌దారుల నుంచి ఎలాంటి లంచం కూడా తీసుకోడు. అంత‌టి నిజాయితీ ప‌రుడైన పోలీస్ అత‌ను.

kachot

లంచం తీసుకోకుండా, నీతి, నిజాయితీల‌తో ప‌నిచేయాల‌ని చిన్న‌త‌నంలో త‌న తండ్రి చెప్ప‌డం వ‌ల్లే అలా చేయ‌గ‌లుగుతున్నాన‌ని అంటున్నాడు క‌చోత్‌. అంతేకాదు, అత‌ని పై అధికారులు ఏమంటారంటే సిటీలో మ‌రో రెండు టోయింగ్ ట్ర‌క్కులు ఉన్నాయ‌ని, అయితే వాటి ద్వారా వ‌స్తున్న చ‌లాన్ల క‌న్నా, క‌చోత్ ద్వారా వ‌స్తున్న చ‌లాన్లే అధికంగా ఉంటాయ‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో గ‌త 10 ఏళ్ల‌లో అత‌ను చ‌లాన్ల ద్వారా రూ.2 కోట్ల‌కు పైగా ఆదాయాన్ని సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి అందించాడ‌ని అంటున్నారు. ఇలాంటి నిజాయితీ ప‌రులైన ట్రాఫిక్ పోలీసులు ఉంటే అప్పుడు ట్రాఫిక్‌కు రెవెన్యూ పెరుగుతుంది. అంతేకాదు ఇతర జ‌నాల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు త‌ప్పుతాయి. మ‌రింత మెరుగ్గా ట్రాఫిక్ సేవ‌ల‌ను అందించేందుకు వీలు క‌లుగుతుంది. అంతే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top