ఆ థియేట‌ర్‌లో దెయ్యాలు ఉన్నాయ‌ట‌. రోజూ బ‌య‌టికి వ‌చ్చి తిరుగుతాయ‌ట‌. దీంతో దాన్ని మూసేశారు. ఎక్క‌డో తెలుసా..?

వెన్నులో వ‌ణుకు పుట్టించే హార్ర‌ర్ స‌న్నివేశాలు.. అందుకు త‌గిన‌ట్టుగా సౌండ్ ఎఫెక్ట్‌లు.. భ‌యం క‌లిగించే పాత్ర‌లు.. వీటిని మ‌నం హార్ర‌ర్ సినిమాల్లో చూస్తాం. ఇంట్లో క‌న్నా థియేట‌ర్‌లో చూస్తేనే ఇలాంటి సినిమాల‌ను బాగా ఎంజాయ్ చేయ‌గ‌లుగుతాం. అయితే థియేట‌ర్లో హార్ర‌ర్ మూవీని చూడ‌డం వ‌ర‌కు ఓకే. కానీ అదే థియేట‌ర్‌లోనే దెయ్యాలు ఉంటే.. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అస‌లు థియేట‌ర్‌లోనే దెయ్యాలు ఉంటే..? ఎవ‌రైనా అందులోకి వెళ్తారా..? అస్స‌లే వెళ్లరు. అవును, ఆ ప్రాంతంలో ఉన్న థియేట‌ర్‌లో కూడా ఇదే జ‌రుగుతోంది. అందులో దెయ్యాలు తిరుగుతున్నాయ‌ని, వింత వింత శ‌బ్దాలు వ‌స్తున్నాయ‌ని ఆ థియేట‌ర్ వైపు చూడ‌డ‌మే మానేశారు ప్రేక్ష‌కులు. దీంతో దాన్ని మూసేయ‌క త‌ప్ప‌లేదు య‌జ‌మానుల‌కు..!

అది క‌ర్ణాట‌క‌లోని కోలార్ జిల్లా ముళ‌బాగిలులో ఉన్న సంగం థియేట‌ర్‌. అందులో దెయ్యాలు తిరుగుతున్నాయ‌ని, అప్పుడ‌ప్పుడు వింత వింత శ‌బ్దాలు వ‌స్తున్నాయ‌ని, ఇక రాత్ర‌యితే కొంద‌రికి దెయ్యాలు క‌నిపించాయ‌ని కూడా ఎవ‌రో ప్ర‌చారం చేశారు. దీంతో ఆ థియేట‌ర్ కు ఎవ‌రూ వెళ్ల‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఓన‌ర్ త‌న థియేట‌ర్‌ను కొద్ది రోజుల కింద‌టే మూసేశాడు. అయితే ఈ మ‌ధ్యే మ‌ళ్లీ కొత్త స‌మ‌స్య వ‌చ్చింది. అదేమిటంటే…

థియేట‌ర్ నుంచి దెయ్యాలు బ‌య‌టికి వ‌స్తున్నాయ‌ట‌. రాత్ర‌యితే చాలు అవి బ‌య‌టికి వ‌చ్చి చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో తిరుగుతున్నాయ‌ట‌. అలా అని కొంద‌రు తాము దెయ్యాల‌ను చూశామ‌ని కూడా చెప్ప‌డం విశేషం. దీంతో తాజాగా ఆ థియేట‌ర్‌ను పోలీసులు సంద‌ర్శించారు. వారు రెండు, మూడు రోజులు గ‌స్తీ కాశారు. దీంతో వారు తేల్చేశారు అక్క‌డ దెయ్యం ఏమీ లేద‌ని. అదంతా వ‌ట్టి పుకారేన‌ని, ఎవ‌రో కావాల‌ని అలా చేశారని పోలీసులు చెప్పారు. అయితే వారు అలా చెప్పినా జ‌నాలు ఆ థియేట‌ర్ వైపు చూడాలంటే జంకుతున్నార‌ట‌. అవును మ‌రి, దెయ్యం ఉన్నా, లేక‌పోయినా ఆ పుకారు వ‌స్తే అలాంటి నిర్మాణాల వైపుకు ఎవ‌రు వెళ్తారు చెప్పండి..!

Comments

comments

Share this post

scroll to top