1000 కేజీల బంగారంతో నిర్మించిన ఆల‌యం….! ఆ ఆల‌య‌పు విశిష్ట‌త‌లు మీకోసం.!!

మ‌న దేశంలో ఎంతో పురాత‌న కాలానికి చెందిన చారిత్రాత్మ‌క ఆల‌యాలే కాదు, మ‌నిషి నిర్మించిన కొన్ని అద్భుత‌మైన ఆల‌యాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆల‌యాలను చాలా మంది సంద‌ర్శిస్తుంటారు. వాటి నిర్మాణాన్ని చూసి పుల‌కించిపోతుంటారు. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ ఆల‌యం గురించి వింటే మాత్రం ఎంత‌గానో ఆశ్చ‌ర్య‌పోతారు. ఎందుకంటే అందులో ఉండే విశిష్ట‌త అలాంటిది మ‌రి. ఇంత‌కీ అందులో ఏం ప్రత్యేక‌త ఉందో తెలుసా..? ఆ ఆల‌యం మొత్తాన్ని 1000 కేజీల బంగారంతో నిర్మించారు. ఏంటీ షాక్ తిన్నారా..? అవును, ముందే చెప్పాం క‌దా, మీకు ఆశ్చ‌ర్యం క‌లుగుతుంద‌ని. అయితే మ‌రి ఈ ఆల‌యం ఎక్క‌డ ఉందో తెలుసా..?

రాజ‌స్థాన్‌లోని అజ్మీర్‌లో ఆ ఆల‌యం ఉంది. దాని పేరు సోనీజీ కీ న‌సియా. దీన్ని 19వ శ‌తాబ్దంలో నిర్మించారు. ఇది ఒక జైన ఆల‌యం. ఇందులోని ప‌లు నిర్మాణాల‌కు గాను 1000 కేజీల బంగారాన్ని వాడార‌ట‌. లెక్క లేనంత వెండి, విలువైన రంగు రాళ్ల‌ను వాడి ఈ ఆల‌యాన్ని నిర్మించార‌ట‌. ఈ ఆల‌యంలో మొద‌టి అంత‌స్తులో ఓ గ‌ది ఉంటుంది. దాన్ని స్వ‌ర్ణ న‌గ‌రి అంటారు. పేరుకు తగిన‌ట్టుగానే దీంట్లో ఉండే అన్ని నిర్మాణాల‌ను బంగారంతోనే చేశారు.

ఈ స్వర్ణ న‌గ‌రి గ‌దిలో జైన మ‌తానికి చెందిన ప‌లు ముఖ్య వ్య‌క్తులు, అంశాల‌కు చెందిన వివ‌రాలు చెక్క‌బ‌డ్డాయి. అన్నింటినీ బంగారంతోనే చెక్క‌డం విశేషం. ఇక ఈ ఆల‌యంలో ఒక‌ప్ప‌టి అయోధ్య‌, ప్ర‌యాగ న‌గ‌రాల‌కు చెందిన న‌మూనాల‌ను కూడా బంగారంతో చెక్కారు. ఈ ఆల‌యాన్ని అజ్మీర్‌కు చెందిన సోనీ కుటుంబ స‌భ్యులు నిర్మించారు. ప్ర‌స్తుతం వారి వార‌సులు ఈ ఆల‌యానికి సంర‌క్ష‌కులుగా ఉన్నారు. అయితే ఈ ఆల‌యంలో విశ్వం మొత్తం ప్ర‌తిబింబించేలా ఓ న‌మూనా ఉంటుంది. దాన్ని జైన మ‌త దృష్టిలో చూపించారు. జైన మ‌తానికి చెందిన ప‌లు విష‌యాల‌ను గ్లాస్‌ల‌పై అందంగా చెక్కారు. ప‌లు పెయింటింగ్‌ల‌ను కూడా ఆల‌యంలో ఏర్పాటు చేశారు. వాటిలో విలువైన రాళ్లు, ర‌త్నాలు ఉంటాయి. ఇక ఈ ఆల‌యం బ‌య‌ట నుంచి చూస్తే ఎరుపు రంగులో ఉంటుంది. ఎందుకంటే దీన్ని ఎరుపు రంగు ఇసుక‌, రాళ్ల‌తో నిర్మించారు క‌నుక ఆల‌యం బ‌య‌టి వైపు ఎరుపుగా ఉంటుంది..!

Comments

comments

Share this post

scroll to top