ఈ ఆలయం “బీరుసీసాల”తో నిర్మించారు తెలుసా..? ఎక్కడుందో, ఎలా ఉందో చూడండి!

అందాల రాక్షసి సినిమాలో హీరో ,హీరోయిన్ ప్రతిమని బీరు సీసాలతో తయారు చేసిన సీన్..ఆ సీన్ లో హీరోయిన్ ఫొటో మనల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి కదా..ఆ సినిమా మొత్తానికి అదే హైలైట్ సీన్ అని కూడా అనిపిస్తుంది..కానీ మనమెప్పుడు అలా చేయాలనుకోం..కానీ బీరు సీసాలతో ఏకంగా గుడినే కట్టేశారు.. చాలా అందంగా బీరు సీసాలతో తయారుచేయబడిన ఆలయం ఎక్కడుందొ తెలుసా థాయిలాండ్లో..మన ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి..ప్రతీది మనల్ని ఆశ్చర్యానికి గురిచేసేదే..అందులో ఈ  ఆలయం ఒక్కటి..దీనిగురించి మరిన్ని విషయాలు తెలుసుకోండి..

బీర్ సీసాలతో దేవాలయాన్ని నిర్మించాలనే  ఆలోచన  ఒక సన్యాసికి వచ్చింది..వచ్చిందే తడవుగా  అతని స్నేహితులతో తన ఆలోచనను పంచుకుని.. ముందుగా ఖాళీ సీసాలతో వారి గుడిసెలను అలంకరించేవారు.. ఈ ఆలోచన తర్వాత ఆ నోట ఈ నోట ప్రజలందరికీ చేరి ప్రజలు వారి ఖాళీ సీసాలు దానం చేయడం ప్రారంభించారు; ఫలితంగా గుడి కట్టడానికి కావలసినన్ని సీసాలు దొరికాయి. గుడి కట్టడానికి వేర్వేరు ఆకారాలు,బ్రాండ్లు ఉన్న కొన్ని మిలియన్ ఖాళీ సీసాలను సేకరించగలిగారు..నెక్స్ట్ ఏంటీ..గుడి కట్టడమే తరువాయి..

ఈ ఆలయంలో రెండు పెద్ద బుద్ధుని బొమ్మలు ఉన్నాయి. వారు ఖాళీ సీసాలను మాత్రం మే కాకుండా బంగారు గాజు మొజాయిక్ ని కూడా ఉపయోగించారు. అక్కడి బుద్దుడుని బుదై అని పిలుస్తారు..ఈ దేవాలయాన్ని తయారుచేయడానికి ప్రతి దానిలో దాదాపు ఖాళీ సీసాలను వాడటం జరిగింది. మొత్తం సీసాలు ఉపయోగించి అద్దాలను పగలగొట్టి సాధ్యమైనంత వరకు ఉత్తమ రూపంలో అందరినీ ఆశ్చర్యపరిచేలా అందంగా కనిపించే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది వాస్తుశిల్పికి గొప్ప సవాలుగా ఉండేది. స్నానపు గదులు నుండి శ్మశానం వరకు, మొత్తం ఆలయం బీర్ సీసాలతో తయారు చేయబడింది. వ్యర్థాలను పునర్వినియోగించడం అనేదానికి ఇదోక మంచి ఎగ్జాంపుల్ కదా..

Comments

comments

Share this post

scroll to top