ఒక మనిషి స్థాయి,స్థానం వేసుకునే బట్టలను బట్టి కాదని..తనకు ఎదురైన అనుభవాన్ని శేర్ చేసుకున్న సుధామూర్తి

వెళ్లమ్మా వెళ్లు ఇది బిజినెస్ క్లాస్ ,నువ్ నిల్చోవాల్సిన ఎకానమి క్లాస్ అక్కడుంది అటెల్లి నిల్చో అని కొంచెం ఛీత్కారంగా మాట్లడిన ఆమెని చూసి ఏం మాట్లడకుండా సైలెంట్ గానే ఉంది చుడిదార్ వేసుకుని కొంచెం సంప్రదాయంగా,మధ్యతరగతి మహిళలా ఉన్నామే..తనని అటు వెళ్లి నిల్చోమన్నామే చూడ్డానికి ఫోష్ గా ఉంది.కట్ చేస్తే  అదే రోజు సాయంత్రం సదరు హైహీల్స్ వేసుకున్న మహిళ హాజరైన సెమినార్ ను నిర్వహించింది ఎయిర్ పోర్టులో సాదాసీదా సల్వార్ కమీజ్ ధరించిన ఆ మహిళ ..

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్మన్, రచయిత సుధామూర్తి రాసిన ‘త్రీ థౌజెండ్ స్టిచెస్’ పుస్తకంలో తనకు ఎదురైన ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నారు. దుస్తులు, ఆహార్యం గురించిన ఛాందసవాద భావాలను ఖండిస్తూ ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. దాని వివరాల్లోకి వెళ్తే… లండన్ లోని హీత్రూ విమానాశ్రయంలో బిజినెస్ క్లాస్ లో విమానం ఎక్కేందుకు సుధామూర్తి క్యూలో నిల్చున్న సమయంలో హైహీల్స్ వేసుకుని టిప్పుటాపుగా తయారైన మహిళ ఒకరు వచ్చి, ‘ఎకానమీ క్లాస్ అక్కడ…ఇది బిజినెస్ క్లాస్’ అంటూ సూచించింది. సుధామూర్తి దానిని పట్టించుకోకుండా క్యూలో ఉండడం చూసి ‘చెబుతుంటే అర్థం కాలేదా? ఎకానమీ క్లాస్ క్యూ లైన్ అక్కడ’ అని మరోసారి సూచించింది.

‘క్లాస్’ అంటే కేవలం డబ్బు ఉండడం కాదని, నోబెల్ గ్రహీత మదర్‌ థెరిస్సా, గణితమేధావి మంజులా భార్గవ ఇద్దరూ ‘క్లాసీ’ మహిళలేనని ఆమె పేర్కొన్నారు. నిరాడంబరంగా ఉన్నప్పటికీ వారిద్దరూ గొప్పవారేనని ఆమె తెలిపారు. కేవలం డబ్బు పోగేసుకోవడం ద్వారా ఓ స్థాయిని పొందామని అనుకోవడం పాతకాలపు ఛాందసవాద ఆలోచనా ధోరణికి నిదర్శనమని ఆమె తన పుస్తకంలో విశ్లేషించారు. ఆ రోజు తనకు ఎదురైన అనుభవం ఆగ్రహం కాకుండా బాధ కలిగించిందని చెప్పారు.
ఇంకో విశేషమేంటంటే, అదే రోజు సాయంత్రం సుధామూర్తి అపాయింట్ మెంట్ తీసుకున్న సమయంలో ఆమె కాటన్ దుస్తులు ధరించి సమావేశమయ్యారు.

Comments

comments

Share this post

scroll to top