నియంత హిట్ల‌ర్ వాడిన టెలిఫోన్ అది..! దానికి వేలంలో వ‌చ్చిన ధ‌ర తెలుసా..?

జ‌ర్మ‌నీని పాలించిన నియంత అడాల్ఫ్ హిట్ల‌ర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. హిట్ల‌ర్ అంటేనే నిరంకుశ పాల‌న‌కు, నియంతృత్వ పోక‌డ‌ల‌కు పెట్టింది పేరు. అత‌ని చ‌రిత్ర చ‌దువుతుంటూనే ఒళ్లంతా జ‌ల‌ద‌రించిన‌ట్టు అవుతుంది. అందుకు కార‌ణం హిట్ల‌ర్ చేసిన అకృత్యాలు, పాల్పడిన అఘాయిత్యాలే. ఎన్నో ల‌క్ష‌ల మందిని చంపించిన నియంత‌గా అత‌ను చరిత్ర‌లో నిలిచాడు. అయితే అత‌ను అలా జ‌నాల‌ను చంప‌మ‌ని త‌న కింది సిబ్బందికి దేని ద్వారా ఆదేశాలు ఇచ్చేవాడో తెలుసా..? అది ఓ టెలిఫోన్ ద్వారా..! ఆ టెలిఫోన్ ఇప్ప‌టికీ ఉంది. ఇటీవ‌లే జ‌రిగిన ఓ వేలంలో చాలా పెద్ద మొత్తం వెచ్చించి ఆ ఫోన్‌ను ఓ వ్య‌క్తి కొనుగోలు చేశాడు.

hitler-phone-3

చిత్రంలో చూశారుగా… ఇదే హిట్ల‌ర్ వాడిన ఎరుపు టెలిఫోన్‌..! దానిపై ఆయ‌న సొంత పార్టీ అయిన నాజీ లోగో, దాన్ని త‌యారు చేసిన సీమెన్స్ కంపెనీ ముద్ర‌, హిట్ల‌ర్ పేరు ఉన్నాయి. వాటిని స్ప‌ష్టంగా చూడ‌వ‌చ్చు. ఈ ఫోన్‌ను హిట్ల‌ర్ రెండో ప్ర‌పంచ యుద్ధం జ‌రిగిన చివ‌రి రెండేళ్ల వ‌ర‌కు వాడాడ‌ట‌. దాని ద్వారానే అత‌ను సైనికుల‌కు ఆదేశాలు ఇచ్చేవాడ‌ట‌. అత‌ని ఆదేశాలు అందుకున్న నాజీలు జ‌నాల‌ను ఊచ‌కోత కోసేవారు. అలా కొన్ని ల‌క్ష‌ల మంది చావుల‌కు సాక్ష్యంగా నిలిచింది ఆ టెలిఫోన్‌..! అనేక మంది అమాయ‌కుల‌పై హిట్ల‌ర్ జ‌రిపిన రాక్ష‌స క్రీడ‌ల‌కు సాక్షీభూతం ఆ ఫోన్‌..!

hitler-phone-2

hitler-phone-1

ఆ టెలిఫోన్‌ను హిట్ల‌ర్ తాను ఎక్క‌డికి వెళ్లినా తీసుకెళ్లేవాడ‌ట‌. చివ‌ర‌కు యుద్ధం చేసేట‌ప్పుడు కూడా హిట్ల‌ర్ ఆ ఫోన్‌నే ఉప‌యోగించాడ‌ట‌. అయితే ఆ ఫోన్ ను ఇటీవ‌లే అమెరికాలో వేలానికి పెట్టారు. అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ అనే సంస్థ నిర్వ‌హించిన ఆ వేలంలో హిట్ల‌ర్ టెలిఫోన్ ఏకంగా 2.43 ల‌క్ష‌ల డాల‌ర్ల‌కు అమ్ముడైంది. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపుగా రూ. 1,62,65,326. అయితే ఆ ఫోన్‌ను ఎవ‌రు కొనుగోలు చేశారనే విష‌యాన్ని మాత్రం వేలం నిర్వ‌హించిన సంస్థ చెప్ప‌లేదు.

Comments

comments

Share this post

scroll to top