వాట‌ర్ క్యాన్ల‌తో టాయిలెట్‌ను త‌యారు చేసిన 8 వ విద్యార్థి..!

మ‌న దేశంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో స‌దుపాయాలు ఎలా ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. ఉపాధ్యాయులు అస్స‌లే ఉండ‌రు. ఉన్నా స‌రిగ్గా రారు. వ‌చ్చినా పాఠాలు బోధించ‌డంలో నిర్ల‌క్ష్యం. పైగా విద్యార్థుల‌తో ప‌ని చేయించుకుంటారు. దీనికి తోడు త‌ర‌గ‌తి గ‌దులు శిథిలావ‌స్థ‌లో ఉంటాయి. ఎప్పుడు కూలుతాయో చెప్ప‌లేం. ఇక తాగునీరు ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిందే. మ‌రుగుదొడ్ల గురించైతే అసలు చెప్పాల్సిన ప‌నిలేదు. ఒక‌టి, రెండు ఏది వ‌చ్చినా పిల్ల‌లు స్కూల్ బ‌య‌ట‌కు ప‌రిగెత్తాల్సిందే. ఈ క్ర‌మంలోనే అలాంటి బాధ త‌ప్పేలా ఓ విద్యార్థి తాను చ‌దువుతున్న ప్ర‌భుత్వ పాఠ‌శాలలో చిన్న ఐడియాతో పిల్ల‌ల‌కు బాత్‌రూం సౌక‌ర్యాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగాడు. అందుకు స్కూల్ యాజ‌మాన్యానికి అంటే ప్ర‌భుత్వానికి అయిన ఖ‌ర్చు ఎంతో తెలుసా..? రూ.1వేయి మాత్ర‌మే. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.

student-made-toilet

అత‌ని పేరు సుబిక్ పాండ్య‌న్‌. ఉంటోంది త‌మిళ‌నాడులోని ట్రికీలో. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 8వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడు. అయినా ఎంతో ప్ర‌తిభ ఉన్న విద్యార్ధి. అయితే అత‌ను చ‌దువుతున్న ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో టాయిలెట్స్ లేవు. దీంతో పిల్ల‌లు బ‌య‌ట‌కు ప‌రిగెత్తాల్సి వ‌స్తుండ‌డాన్ని పాండ్య‌న్ గ‌మ‌నించాడు. ఈ క్ర‌మంలోనే అత‌నికి స్థానికంగా ఓ కిరాణా షాపులో వాట‌ర్ క్యాన్స్ క‌నిపించాయి. అవి 20 లీట‌ర్ల సామ‌ర్థ్యం ఉన్న‌వి. దీంతో పాండ్య‌న్‌కు వెంట‌నే మ‌న‌స్సులో ఓ ఆలోచ‌న మెరిసింది. దాన్ని అమ‌లులో పెట్టేశాడు. త‌న ఆలోచ‌న‌ను ఆ పాఠ‌శాల ఉపాధ్యాయుల‌తో చెప్ప‌గా, వారు వెంట‌నే దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టారు.

అలా ఆ పాఠ‌శాల ఉపాధ్యాయులు పాండ్య‌న్‌కు అత‌ని కావ‌ల్సిన వస్తువుల‌ను స‌మ‌కూర్చారు. వాటిలో 20 లీట‌ర్ల వాట‌ర్ క్యాన్స్ కొన్ని, కొన్ని పీవీసీ పైపులు, ప్లాస్ట‌ర్స్ వంటివి ఉన్నాయి. అయితే వాటిని పాండ్య‌న్ ఏం చేశాడో తెలుసా..? వాట‌ర్ క్యాన్స్‌ను బోర్లా పెట్టి వాటిని మ‌ధ్య‌లో క‌ట్ చేసి వాటి మూతుల‌కు పీవీసీ పైప్‌ల‌ను అమ‌ర్చి, అనంత‌రం ఆ క్యాన్ల‌న్నింటినీ స్కూల్‌లోని ఓ రూంలో ఏర్పాటు చేశాడు. దీంతో ఆ రూం బాత్‌రూంలా మారింది. అంతే, పాండ్య‌న్ ఐడియాతో ఇప్పుడు ఆ స్కూల్ పిల్ల‌లు టాయిలెట్ కోసం బ‌య‌ట‌కు వెళ్ల‌డం లేదు. ఎంచ‌క్కా ఆ బాత్‌రూంనే వాడుకుంటున్నారు. అయితే ఆ బాత్‌రూం ఏర్పాటుకు అయిన ఖ‌ర్చు ఎంతో తెలుసా..? రూ.1వేయి మాత్ర‌మే. దీంతో ఆ స్కూల్‌కు స‌మీపంలో ఉన్న మ‌రో 4 స్కూల్స్‌లో కూడా ఇలాగే బాత్‌రూంల‌ను ఏర్పాటు చేశారు. ఈ క్ర‌మంలో పాండ్య‌న్‌కు డిజైన్ ఫ‌ర్ చేంజ్ అవార్డును కూడా ప్ర‌దానం చేశారు. ఏది ఏమైనా, ఇలాంటి ప్ర‌తిభ ఉన్న విద్యార్థుల‌ను మరింత ప్రోత్స‌హించాల్సిందే క‌దా… అలాగే ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో పైన చేసిన విధంగా త‌క్కువ ఖ‌ర్చుతో టాయిలెట్ల‌ను కూడా ఏర్పాటు చేయ‌వ‌చ్చు. దీంతో అనేక మంది పిల్ల‌ల‌కు ఎంతో సౌక‌ర్య‌వంతంగా ఉంటుంది..!

Comments

comments

Share this post

scroll to top