దుర్వాస‌న రాని, నీరు అవ‌స‌రం లేని నూత‌న త‌ర‌హా ట్రైన్ టాయిలెట్‌ను డిజైన్ చేసిన మ‌ణిపాల్ యూనివ‌ర్సిటీ విద్యార్థి…

మ‌న దేశంలో రైల్వే స్టేష‌న్లు గానీ, రైళ్ల‌లో గానీ పారిశుధ్య వ్య‌వ‌స్థ ఏవిధంగా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా టాయిలెట్ల‌న్నీ కంపు కొట్టే దుర్వాస‌న‌, దుర్గంధంతో నిండిపోయి, శిథిలావ‌స్థ‌కు చేరుకుని అస్స‌లు ఉప‌యోగానికి ప‌నికిరానివిగా ఉంటాయి. దీంతో వాటిలోకి వెళ్లాలంటేనే ప్ర‌యాణికులు జంకుతారు. ఏవిధ‌మైన రోగాలు వ‌స్తాయో, ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు క‌లుగుతాయోన‌ని వారి భ‌యం మ‌రి. అయితే ఇక‌పై అలాంటి టాయిలెట్లు క‌నుమ‌రుగు కానున్నాయి. ఎంత మంది ఉప‌యోగించినా శుభ్రంగా ఉండే విధంగా, అస్స‌లు దుర్వాస‌న అన్న ముచ్చ‌టే లేకుండా, నీరు అవ‌స‌రం లేని కొత్త ర‌కం టాయిలెట్ల‌ను త్వ‌ర‌లో రైల్వే వారు ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి తేనున్నారు. అందుకు కార‌ణం ఓ విద్యార్థి త‌యారు చేసిన నూతన త‌ర‌హా టాయిలెటే.

new-train-toilet

మ‌ణిపాల్ యూనివ‌ర్సిటీలో ఆర్కిటెక్చ‌ర్ కోర్సును అభ్య‌సిస్తున్న వినోద్ ఆంథోనీ థామ‌స్ అనే విద్యార్థి నూత‌న త‌ర‌హా టాయిటెల్ డిజైన్‌పై ఆలిండియా లెవ‌ల్‌లో నిర్వ‌హించిన ఓ కాంపిటీషన్‌లో విజ‌యం సాధించి 2వ స్థానంలో నిలిచాడు. ఇత‌ని ఆవిష్క‌ర‌ణ టాప్‌-10 లిస్ట్‌లో చోటు సంపాదించింది. త‌న ఆవిష్క‌ర‌ణ‌కు గాను పోటీలో గెలిచినందుకు వినోద్ రూ.75వేల న‌గ‌దు బ‌హుమ‌తిని కూడా ఇటీవ‌లే అందుకున్నాడు. ఎంత ఉప‌యోగించినా శుభ్రంగా ఉండే విధంగా, దుర్వాసన రాకుండా, నీరు అవ‌స‌రం లేని టాయిలెట్‌ను ఇత‌ను రూప‌క‌ల్ప‌న చేయ‌డం విశేషం.

new-train-toilet

సాధార‌ణ టాయిలెట్ల‌లో వాట‌ర్‌ను ఫ్ల‌ష్ చేసే సిస్ట‌మ్ ఉంటుంది. కానీ వినోద్ డిజైన్ చేసిన టాయిలెట్‌లో వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తీసుకువెళ్లే ఓ క‌న్వేయ‌ర్ సిస్ట‌మ్ ఉంటుంది. ఇది వ్య‌ర్థాల‌ను క‌లెక్ట్ చేసి ఓ డ‌స్ట్‌బిన్‌లోకి పంపుతుంది. ఈ క్ర‌మంలో టాయిలెట్‌ను వినియోగించిన త‌రువాత అందులో దుర్వాస‌న కూడా రాదు. కాగా వినోద్ త‌యారు చేసిన నూత‌న టాయిలెట్ డిజైన్ రైల్వే అధికారుల‌ను కూడా ఆక‌ట్టుకుంది. మ‌రి దీన్ని వారు ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారో లేదో వేచి చూడాల్సి ఉంది.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top