కేవ‌లం 40 రోజుల్లోనే 101 వెబ్‌సైట్ల‌ను డిజైన్ చేసి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది ఈ విద్యార్థిని.! రియల్లీ గ్రేట్!

ఎవ‌రికైనా ఒక వ్య‌క్తికి ఒక వెబ్‌సైట్ డెవ‌ల‌ప్ చేయాలంటే అందుకు ఎన్ని రోజుల స‌మ‌యం ప‌డుతుంది ? అబ్బో.. వెబ్‌సైట్ అంటే బాగా వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది. అందుకు చాలా క‌ష్ట‌ప‌డాలి. ఎన్నో డిజైన్లు చేయాలి. సాఫ్ట్‌వేర్ కోడింగ్ రాయాలి. అందుకు చాలా రోజుల స‌మ‌య‌మే ప‌డుతుంది.. అంటారా..! అవును, అయితే వెబ్ డిజైనింగ్ చేసే అంద‌రి దృష్టిలో ఈ విష‌యం క‌రెక్టే కావ‌చ్చు. కానీ.. నిజానికి ఒక వెబ్‌సైట్‌ను డిజైన్ చేసేందుకు ఆమెకు చాలా త‌క్కువ స‌మ‌యమే ప‌డుతుంది. ఇంకా చెప్పాలంటే.. ఆమె 40 రోజుల్లో 101 వెబ్‌సైట్ల‌ను డిజైన్ చేసింది మ‌రి. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే… ఆమె పేరు కందిమ‌ళ్ల ర‌జిత‌.

కందిమ‌ళ్ల ర‌జిత‌ది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లోని పెట్లూరివారిపాలెం. ఆమెది సామాన్య మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం. తండ్రి రాఘ‌వ‌య్య‌ రైతు. త‌న‌కు ఒక అక్క, క‌వ‌ల సోద‌రి, త‌మ్ముడు ఉన్నారు. వారు త‌మ త‌మ చ‌దువులు కొన‌సాగిస్తున్నారు. ఇక ర‌జిత నరసరావుపేట ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్ ఫైన‌ల్ ఇయ‌ర్ చ‌దువుతోంది. అయితే వారి కాలేజీలో స్టార్ట‌ప్ విభాగం ఏర్పాటు చేశారు. దీంతో ర‌జిత తాను కూడా ఏదో ఒక‌టి సాధించాల‌నుకుంది. నెమ్మ‌దిగా వెబ్ డిజైనింగ్ చేయ‌డం మొద‌లు పెట్టింది. అన‌తి కాలంలోనే అందులో ప్రావీణ్య‌త‌ను సంపాదించింది.

 

అలా ర‌జిత వెబ్ డిజైనింగ్‌లో నైపుణ్య‌త‌ను సాధిస్తూనే కాలేజీకి ఇచ్చిన వేస‌వి సెల‌వుల్లో ఆ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌నుకుంది. అందులో భాగంగానే మొద‌ట రెండు వెబ్‌సైట్ల‌ను త‌యారు చేసింది. అయితే వాటి ప్రేర‌ణ‌తో ఏకంగా ఒకేసారి 40 రోజుల్లో 101 వెబ్‌సైట్ల‌ను త‌యారు చేసింది. దీంతో ఆమె పేరు ఒక్క‌సారిగా మారుమోగి పోయింది. ఆమె ఈ ఘ‌న‌త‌ను సాధించినందుకు గాను అంతర్జాతీయ వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో ఆమెకు స్థానం ద‌క్కింది. దీంతోపాటు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం, త‌న కాలేజీ యాజ‌మాన్యం చేతుల మీదుగా ప్ర‌శంస‌ల‌ను, రివార్డుల‌ను అందుకుంది.

త‌రువాత రజిత సొంతంగా ఆల్‌టెక్‌ ట్రెండ్‌ పేరుతో తానే సీఈవోగా ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేసింది. అందులో త‌మ కాలేజీ విద్యార్థులు 12 మందిని ఉద్యోగులుగా నియ‌మించింది. ఈ క్ర‌మంలోనే ప‌లు కంపెనీల నుంచి ఇప్పుడు ఆమెకు వెబ్ డిజైనింగ్ ఆర్డ‌ర్లు కూడా వ‌స్తున్నాయి. త్వ‌ర‌లో త‌న కంపెనీ సేవ‌ల‌ను హైద‌రాబాద్‌లో విస్త‌రించ‌నుంది. గూగుల్ వంటి ప‌లు ప్ర‌ముఖ కంపెనీల నుంచి కూడా ర‌జిత‌కు కావ‌ల్సిన సపోర్ట్ అందుతోంది. ఈ క్ర‌మంలో ఈమె కేవ‌లం వెబ్ డిజైనింగ్ మాత్ర‌మే కాకుండా, యాప్ డెవ‌ల‌పింగ్‌, ఎస్ఈవో వంటి సేవ‌ల‌ను సైతం త‌న కంపెనీ ద్వారా అందిస్తోంది. ఇక ఎప్పటికైనా గ్రామీణ వాసుల‌కు ఉప‌యోగ‌ప‌డే, వారికి అర్థ‌మ‌య్యే రీతిలో వెబ్ సైట్ల‌ను త‌యారు చేయాల‌నేది ఈమె క‌ల‌. ఆ క‌ల సాకారం కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top