ఓ పెద్ద కంపెనీ మేనేజర్ కు,సమోసాలమ్ముకునే వ్యక్తి మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ.

అది దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీ. అక్క‌డ ఓ బ‌డా కార్పొరేట్ కంపెనీ ఉంది. దానికి ఎదురుగా ఓ చిన్న హోట‌ల్‌. అందులో ఓ వ్య‌క్తి స‌మోసాలు అమ్ముతూ ఉంటాడు. చూసేందుకు చిన్న హోట‌లే అయినా, అత‌ను అమ్మే స‌మోసాల రుచి అద్భుతంగా ఉంటుంది. వాటిని తిన‌డం కోసమే ఆ హోట‌ల్‌కు ఎదురుగా ఉన్న ఆ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులు నిత్యం వ‌స్తుంటారు. స‌మోసాల రుచి ఆస్వాదించి మ‌రీ వెళ్తుంటారు. అయితే అప్ప‌టికే ఆ వ్య‌క్తి హోటల్‌కు మంచి స‌మోసాలు దొరికే హోట‌ల్‌గా చుట్టు ప‌క్క‌లంతా పేరు వ‌చ్చింది.

samosa-vendor

ఓ రోజు స‌ద‌రు బ‌డా కార్పొరేట్ కంపెనీకి చెందిన మేనేజ‌ర్ ఒక‌త‌ను వ‌చ్చి ఆ హోట‌ల్‌లో స‌మోసాల‌కు ఆర్డ‌ర్ ఇచ్చి తింటున్నాడు. అంత‌లో వాటిని అమ్మే ఆ వ్య‌క్తితో స‌ద‌రు మేనేజ‌ర్ మాట‌లు క‌లిపాడు. ఈ క్ర‌మంలో వారి సంభాషణ ఇలా సాగింది.

మేనేజ‌ర్: నువ్వు స‌మోసాలు బాగా చేస్తున్నావు. మంచి నైపుణ్యం ఉంది. వాటిని అమ్మ‌డంలోనూ అమోఘ‌మైన టాలెంట్ నీకు ఉంది. ఇంత‌టి తెలివి ఉండి కూడా నువ్వు దాన్ని అన‌వ‌స‌రంగా వృథా చేసుకుంటున్నావు. నాలాగా ప‌ని చేస్తే అంత‌టి బ‌డా కంపెనీలో మేనేజ‌ర్ అయ్యి ఉండే వాడివి క‌దా..?

స‌మోసాలు అమ్మే వ్య‌క్తి: స‌రిగ్గా 10 ఏళ్ల కింద‌ట నువ్వు నీ కెరీర్ ప్రారంభించావు. అప్పుడే నేను ఈ హోట‌ల్ పెట్టాను. ఆ సమ‌యంలో నా నెల సంపాద‌న రూ.1వేయి. అప్పుడు నీకు రూ.10వేలు వ‌చ్చేది. ఇప్పుడు అదే నీ సంపాద‌న నెల‌కు రూ.1ల‌క్ష‌. నేను కూడా ఇప్పుడు దాదాపుగా నీ అంతే సంపాదిస్తున్నాను. కానీ నువ్వు మాత్రం నీ టైంను వృథా చేసుకున్నావు.

(ఆశ్చ‌ర్యంతో) మేనేజ‌ర్‌: నేను చాలా పెద్ద కంపెనీలో నెల‌కు రూ.1 ల‌క్ష జీతానికి ప‌నిచేస్తున్నా. కానీ నువ్వు ఇంకా చిన్న హోట‌ల్‌లోనే ఉన్నావు. నీకంటే నేనే బెట‌ర్ పొజిష‌న్‌లో ఉన్నా. మ‌రి నేను టైం ఎలా వృథా చేసుకున్నాను.? నీ టైమే వేస్ట్ అయిపోయింది.

(మంద‌హాసం చేస్తూ) స‌మోసాలు అమ్మే వ్య‌క్తి: నేను చెబుతోంది మీకు స‌రిగ్గా అర్థం కావ‌డం లేదు. స‌రిగ్గా చెప్తాను వినండి.

10 ఏళ్ల కింద‌ట నేను 0 (సున్నా) పొజిషన్‌తో హోట‌ల్ ప్రారంభించా. ఇప్పుడు దాదాపుగా నీ అంత సంపాదిస్తున్నా. ఈ ప‌దేళ్లలో నేను స్థానికంగా మంచి స‌మోసాలు అమ్మే వాడిగా పేరు తెచ్చుకున్నా. కానీ నీ విష‌యంలో అలాంటి చెప్పుకోద‌గిన‌ది ఏమీ లేదు. ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే…

రేపో, మాపో నేను రిటైర్ అయితే నా కొడుకు నా వ్యాపారాన్ని తీసుకుని దాన్ని వృద్ధి చేసుకుని ముందుకు సాగుతాడు. అత‌ను జీవితంలో ఇంకా ముందుకు వెళ‌తాడు. అప్పుడు పెద్ద హోట‌ల్‌నే ఓపెన్ చేయ‌గ‌లిగే స్థాయి వ‌స్తుంది. కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని నీ బిడ్డ‌ల‌కు ఇవ్వ‌గ‌ల‌వా..? లేవు… వారు మ‌ళ్లీ 0 (సున్నా) నుంచి జీవితాన్ని ప్రారంభించాలి. మీకు మ‌ళ్లే అన్ని నైపుణ్యాలు నేర్చుకుని 10-15 ఏళ్లు క‌ష్ట‌ప‌డితే గానీ ఇప్పుడు నీ అంత‌టి స్థానాన్ని అందుకోలేరు. కానీ నా పిల్ల‌లు అలా కాదు. ఇప్పుడు నా వ్యాపారం వారు తీసుకుంటే అదే 10-15 సంవ‌త్స‌రాల‌లో వారు ఎలాంటి స్థితిలో ఉంటారో మీకు ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

స‌మోసాలు అమ్మే వ్య‌క్తి చెప్పిన ఈ జ‌వాబుకు స‌ద‌రు మేనేజ‌ర్‌కు నోట మాట రాలేదు. వ్యాపార రంగంలో ముందుకు సాగుతూ ఆ రంగంలో రాణించాల‌నుకునే వారికి స‌రిగ్గా సూట‌య్యే అస‌లైన పాఠం, ప్రోత్సాహం, ప్రేర‌ణ ఈ క‌థ‌… దీనిపై మీ అభిప్రాయం ఏమిటి..?

Infograhic on rape culture in india

Comments

comments

Share this post

scroll to top