ఓపెన్ గంగ్న‌మ్ స్టైల్ పాట త‌ర‌హాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్న మ‌రో సాంగ్‌..!

పీపీఏపీ…
ఐ హావ్ ఎ పెన్‌… ఐ హావ్ యాన్ యాపిల్‌… యాపిల్ పెన్‌..!
ఐ హావ్ ఎ పెన్‌… ఐ హావ్ పైనాపిల్‌… పైనాపిల్ పెన్‌..!
యాపిల్ పెన్‌… పైనాపిల్ పెన్‌…
పెన్ పైనాపిల్ – యాపిల్ పెన్ – పైనాపిల్ పెన్‌..!
పెన్ పైనాపిల్ – యాపిల్ పెన్ – పైనాపిల్ పెన్‌..!

ఏంటిదంతా..? అనుకుంటున్నారా..? ఏమీ లేదండీ.. ఇదోపాట‌.. ఇంట‌ర్నెట్ ప్ర‌పంచంలో ఇప్పుడీ పాట ఎంత వైర‌ల్ అయిందంటే నెటిజ‌న్లు దీన్ని యూట్యూబ్‌లో విర‌గ‌బ‌డి మ‌రీ చూస్తున్నారు. అంత‌గా ఆక‌ట్టుకుంటోందీ పాట‌. త‌ర‌చి చూస్తే అందులో ఏమీ లేదు. యాపిల్‌, పైనాపిల్‌, యాపిల్ పెన్‌, పైనాపిల్ పెన్‌… ఇదీ పాట లిరిక్స్‌… అంతే..!

pine-apple-pen-song

కొంచెం సృజ‌నాత్మ‌క‌త‌… విభిన్నంగా ఆలోచించే మైండ్‌… స‌రైన మెళ‌కువలు ఉంటే చాలు… ఎన్నో అద్భుతాలు చేసి చూప‌వ‌చ్చ‌ని చాటి చెబుతోంది ఈ వీడియో. నిజానికి ఈ పాటలో చెప్పుకోద‌గిన లిరిక్స్ ఏమీ లేకున్నా కేవ‌లం క్రియేటివిటీతోనే అంద‌రినీ ఆక‌ట్టుకునేలా దీన్ని రూపొందించారు. అంతేనా వెంట‌నే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్ చేసేశారు. కొన్ని రోజుల్లోనే 1.82 కోట్ల మంది ఈ పాట‌ను వీక్షించారంటే ఇక మీరే అర్థం చేసుకోండి, ఈ పాట ఎంత పాపుల‌ర్ అయిందో.

అప్పుడెప్పుడో వ‌చ్చిన ఓపెన్ గంగ్నమ్ స్టైల్ సాంగ్ గుర్తుంది క‌దా… ఆ… అదే..! అచ్చం దానిలాగే ఉంద‌ని ప‌లువురు నెటిజన్లు దీనికి కామెంట్లు కూడా పెడుతున్నారు. ఇంకా కొంద‌రైతే దీని రింగ్‌టోన్ కూడా ఫోన్ల‌కు పెట్టేసుకున్నారు. కావాలంటే మీరూ ఈ పాట‌పై ఓ లుక్కేయండి..!

Comments

comments

Share this post

scroll to top