ఈ పాట‌ను వింటే… ఒత్తిడి, ఆందోళ‌న, డిప్రెష‌న్ 65 శాతం త‌గ్గుతాయి..!

ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌… ఎన్ని పేర్లు చెప్పినా… ఇవ‌న్నీ మాన‌సిక ఆరోగ్యానికి సంబంధించిన‌వే. వీటి వ‌ల్ల మ‌నం ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ ఉంటాం. అయితే వీటి బారి నుంచి ప‌డేందుకు అధిక శాతం మంది పాట‌ల‌ను వింటారు. మంచి సంగీతాన్ని ఆస్వాదిస్తారు. దాని వ‌ల్ల కొంత వ‌ర‌కు రిలాక్సేష‌న్ ల‌భిస్తుంది. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఓ పాట వింటే మాత్రం ఒత్తిడి ఇట్టే ఎగిరిపోతుంది. డిప్రెష‌న్ నుంచి వెంట‌నే బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. మ‌రి… ఆ పాట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

Weightless..! ఇదేనండీ ఆ పాట పేరు. దీన్ని Marconi Union అనే ఓ గ్రూప్ క్రియేట్ చేసింది. ప‌లువురు సౌండ్ థెర‌పిస్టులు, మ్యుజిషియ‌న్స్ స‌హ‌కారంతో ఈ పాట‌ను క్రియేట్ చేశారు. ఈ పాట‌ను వింటే ఎవ‌రికైనా ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటివి వెంట‌నే 65 శాతం వ‌ర‌కు త‌గ్గుతాయ‌ట‌. ఇది మేం చెబుతోంది కాదు. సాక్షాత్తూ ప‌లువురు సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లో తేలిన నిజ‌మిది.

యూకేకు చెందిన ప‌లువురు న్యూరో సైంటిస్టులు కొంద‌రు వ్య‌క్తుల‌ను త‌మ పరిశోధ‌న‌కు ఎంచుకున్నారు. వారిలో కొంద‌రికి ప‌జిల్స్ ఇచ్చి నింప‌మ‌న్నారు. ఇంకొంద‌రికి సినిమాలు చూపించారు. మ‌రికొంద‌రికి మంచి సంగీతం వినిపించారు. కొంద‌రికి పైన చెప్పిన Weightless పాట‌ను వినిపించారు. ఈ క్ర‌మంలో ఆయా వ్య‌క్తుల రిలాక్సేష‌న్‌, బీపీ, శ్వాస‌క్రియా రేటు వంటి అన్ని అంశాల‌ను వారు రికార్డు చేశారు. తీరా చివ‌రికి తెలిసిందేమిటంటే… Weightless పాట‌ను విన్న వారిలో ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటివి 65 శాతం మేర త‌గ్గిన‌ట్టు గుర్తించారు. అంతేకాదు, వారు ఆ పాట‌ను విన్నాక మిగ‌తా వారి కంటే చాలా వేగంగా రిలాక్స్ అయ్యార‌ట‌. ఎంతో హ్యాపీగా ఫీల‌య్యార‌ట‌. మరి ఇంకెందుకాల‌స్యం… మీరూ ఆ పాట‌ను వినేయండి… దాని యూట్యూబ్ లింక్ ఇదిగో..!

Comments

comments

Share this post

scroll to top