ఓ వైపు సాఫ్ట్ వేర్ ఉద్యోగం, మ‌రోవైపు వ్య‌వ‌సాయం.! భూమి మీద ప్రేమ‌తో….!!!

రోజూ కంప్యూట‌ర్ల‌తో కుస్తీలు పట్ట‌డం… వారాంతాల్లో ఎంజాయ్‌మెంట్‌… నెల తిరిగే స‌రికి ఊరించే ఐదారు అంకెల జీతం. నేడు సాఫ్ట్ వేర్ రంగంలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల లైఫ్ స్టైల్ ఇది. అలాంటి లైఫ్ స్టైల్‌ను వ‌దిలి సాధార‌ణంగా ఎవ‌రూ గ్రామాల‌కు వెళ్ల‌రు. ఎప్పుడో, ఏదో పండ‌గో, శుభ‌కార్య‌మో ఉంటే త‌ప్ప వారు అంత సాధార‌ణంగా గ్రామాల వంక చూడ‌రు. అయితే… ఆ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మాత్రం అలా కాదు. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు ఓ వైపు ఆఫీస్‌లో బిజీగా పనిచేస్తూనే మ‌రో వైపు శ‌ని, ఆది వారాల్లో క‌చ్చితంగా త‌న గ్రామానికి వెళ్లి వ‌స్తుంటాడు. త‌న ఊరంటే అంత ప్రేమేమో… అందుకే అలా వెళ్లి వ‌స్తుంటాడు కాబోలు… ఎవ‌రైనా ఖాళీ దొరికితే అలాగే చేస్తారు క‌దా… అంటారా… అయితే ఇత‌ను మాత్రం అలా కాదు. కేవ‌లం ఊరికి వెళ్లడ‌మే కాదు, అక్క‌డ ప‌ని కూడా చేస్తున్నాడు. అదీ త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో..!

mahesh-software
అత‌ని పేరు మ‌హేష్‌. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని గుల్బ‌ర్గా ద‌గ్గ‌ర ఉన్న కౌలాగా గ్రామ వాసి. అత‌ని తాత‌, తండ్రి రైతులు. వారు వ్య‌వ‌సాయం చేసి ఇన్ని రోజులు నెట్టుకొచ్చారు. అయితే వ‌రుస‌గా వ‌స్తున్న న‌ష్టాల కార‌ణంగా మ‌హేష్ తండ్రి మ‌హేష్‌ను వ్య‌వ‌సాయం చేయ‌వ‌ద్ద‌ని చెప్పి బాగా చ‌దివించాడు. దీంతో మ‌హేష్ బాగా చ‌దివి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు. అందులో భాగంగానే బెంగుళూరులో ఉన్న కాగ్నిజెంట్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. మంచి జీతం కూడా అత‌నికి వ‌స్తోంది. అయితే మ‌హేష్ మ‌న‌స్సు మాత్రం త‌న ఊర్లోనే ఉండిపోయింది. అక్క‌డే వ్య‌వ‌సాయం చేయాల‌ని అనుకున్నాడు. కానీ వ‌రుసగా వ‌స్తున్న న‌ష్టాలు, వ్య‌వ‌సాయం అంత లాభ సాటిగా ఉండ‌క‌పోవ‌డంతో కుటుంబ పోష‌ణ‌కు జాబ్ చేయ‌క త‌ప్ప‌నిస‌రి అయింది. అయినా ఎలాగైనా వ్య‌వ‌సాయం చేయాల‌ని అనుకున్నాడు.

mahesh-software-1

mahesh-software-2
అయితే అప్ప‌టికే చాలా మంది యువ‌కులు స‌హ‌జ సిద్ధ‌మైన ప‌ద్ధ‌తుల్లో ఆర్గానిక్ పంటల‌ను పండిస్తూ లాభాలు గ‌డించ‌డం చూశాడు. వారి స్టోరీల‌ను చ‌దివాడు. దీంతో తాను కూడా అలా ఎందుకు చేయ‌కూడ‌ద‌ని భావించి అలాగే త‌మ పొలంలో స‌హ‌జ సిద్ధ‌మైన పంటలను పండించ‌డం మొద‌లు పెట్టాడు. స్వ‌త‌హాగా గ్రాడ్యుయేట్ అవ‌డం, బాగా చ‌దువుకోవ‌డంతో మ‌హేష్‌కు ఆధునిక వ్య‌వ‌సాయ ప‌ద్ధ‌తుల‌ను గురించి తెలుసుకునేందుకు పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌లేదు. దీంతో 2016లో తాను అనుకున్న విధంగా ఆర్గానిక్ ఫామింగ్ ప్రారంభించాడు. కేవలం ఒక్క ఏడాదిలోనే తమ పొలంలో పంట‌ను పండించి లాభాలు గ‌డించాడు. అయితే అందుకు గాను మ‌హేష్ ఎంత‌గానో క‌ష్ట‌ప‌డ్డాడు. సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు బెంగూళురులో త‌మ ఆఫీస్‌లో ప‌నిచేయ‌డం, వారాంతంలో అంటే… శ‌ని, ఆది వారాల్లో 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న త‌మ గ్రామానికి వెళ్లి వ్య‌వ‌సాయం చేసేవాడు. మ‌ళ్లీ ఆదివారం రాత్రి బ‌య‌ల్దేరి తెల్ల‌వారే స‌రికి బెంగుళూరు వ‌చ్చి సోమ‌వారం ఆఫీసుకి వెళ్లేవాడు. అలా క‌ష్ట‌పడ్డాడు కాబ‌ట్టే మ‌హేష్ వేసిన పంట‌కు దిగుబ‌డి బాగా వ‌చ్చింది. దీంతో అత‌న్ని అంద‌రూ అభినందించారు కూడా. ప‌లు అవార్డులు కూడా అత‌నికి వ‌చ్చాయి.

అయితే మ‌హేష్ అంత‌టితో ఆగ‌ను అంటున్నాడు, తమ గ్రామంలో ఉన్న రైతులంద‌రూ అదే వ్య‌వ‌సాయ ప‌ద్ధతిలో, పూర్తిగా స‌హ‌జ సిద్ధంగా పంటల‌ను పండించి లాభాలు గ‌డించేలా చేస్తాన‌ని అంటున్నాడు. కెమిక‌ల్స్ వాడుతూ పంట‌ల‌ను పండించడం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో అంద‌రికీ తెలియ‌జేస్తాన‌ని అంటున్నాడు. అత‌ని ల‌క్ష్యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top