హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలు… ఈ వెబ్‌సైటే అందుకు వేదిక..!

ఒకప్పుడంటే వేరు. ఇప్పుడు వేరు. టెక్నాలజీ మారింది కదా. అరచేతిలో ప్రపంచాన్ని లైవ్‌లో చూపే ఫోన్లు, వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేశాయి. దాన్ని మంచికి వాడుకుంటే ముందుకు దూసుకుపోవచ్చు. కానీ కొందరు ఏమైనా చెడు పనుల కోసమే అంతర్జాలాన్ని వాడుతున్నారు. అందులోనూ విటులు, వ్యభిచార వ్యాపారులు ఇంటర్నెట్‌ను వాడుకోవడంలో అందరికన్నా ముందే ఉన్నారని చెప్పవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నాం అంటే… ఏమీ లేదండీ.. ఈ మధ్య కాలంలో హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు అనే చాలా వార్తలు వస్తున్నాయి కదా. అసలింతకీ హైటెక్ అంటే ఏంటీ..? అంటే ఏం లేదు… క్లాసిఫైడ్ వెబ్‌సైట్లు తెలుసు కదా.. వాటినే వ్యభిచారం కోసం వాడుతున్నారు.

క్లాసిఫైడ్ వెబ్‌సైట్లు ఈ మధ్య కాలంలో ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మే వారికి ఇవి వరంగా మారాయనే చెప్పవచ్చు. అంతేకాదు, అనేక రకాల సేవలు కూడా ఈ సైట్లలో లభిస్తున్నాయి. అయితే వాటిల్లో www.locanto.net అనే వెబ్‌సైట్ కూడా ఒకటి. ఇందులో చాలా మంది ఏం చేస్తున్నారంటే.. వుమెన్ సీకింగ్ మెన్, మెన్ సీకింగ్ వుమెన్, మిస్స్‌డ్ కనెక్షన్స్, పర్సనల్ సర్వీసెస్ అనే పేరిట సెక్షన్లు పెట్టి వాటిల్లో అందమైన అమ్మాయిలు, ఆంటీలు, మగవారు ఉన్నారంటూ వ్యభిచార వ్యాపారం నడుపుతున్నారు.

ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో హైటెక్ పద్ధతిలో కొందరు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి ముఠాలు ఈ మధ్య చాలానే దొరుకుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని బోడుప్పల్‌లో ఇలా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ముఠాలో మొత్తం ముగ్గురు ఉన్నారు. ఇద్దరు యువతులు, ఓ విటుడు ఉన్నారు. ఆ యువతుల్లో సినిమాల్లో చేసే ఓ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉండడం గమనార్హం. అయితే మరి.. ఇంకా ఇలా వ్యాపారం చేసేవారు ఎంత మంది ఉన్నారో..? వారిపై చర్యలు ఏం తీసుకుంటారో, ఇలాంటి సైట్లలో ప్రకటనలను ఎలా నిలువరిస్తారో..? సంబంధిత అధికారులకే తెలియాలి..!

Comments

comments

Share this post

scroll to top