మనుషులను పోలిన మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు ఉంటారని అందరికీ తెలిసిందే. దీన్ని మన పెద్దలు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అయితే ఏడుగురి దాకా అవసరం లేకుండా ఓ వ్యక్తిని పోలిన మరో వ్యక్తి, లేక ఇద్దరు వ్యక్తుల వరకు మాత్రం తాము వెతికి చెబుతామని ఆఫర్ ఇస్తోంది ఆ వెబ్సైట్. అవును, మీరు విన్నది కరెక్టే..! ఇంతకీ ఆ వెబ్ సైట్ ఏమిటో, దాని వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
https://twinstrangers.net/ ట్విన్ స్ట్రేంజర్స్… ఈ సైట్ లోకి వెళితే చాలు, మీలాగే ఉన్న వ్యక్తుల వివరాలు తెలుస్తాయి. అయితే అందుకు మీరు ఓ చిన్న పనిచేయాలి. ఏంటంటే ముందుగా ఈ సైట్లోకి వెళ్లి సైనప్ బటన్ క్లిక్ చేసి అందులో వచ్చే వివరాలు నింపాలి. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంపిక చేసుకుని ఫొటోలు అప్లోడ్ చేయాలి. అనంతరం పేరు, ఈ-మెయిల్, ఇతర సమాచారాన్ని ఎంటర్ చేయాలి. కిందే ఉండే పలు రకాల ఫేస్ ఆకృతులను, కనుబొమ్మల సైజ్‌లను, కన్నుల ఆకృతులను, ముక్కుల షేప్‌లను ఎంచుకోవాలి. వాటిలో ఆప్షన్లు సెలెక్ట్ చేసుకున్నాక కిందే ఉండే పెదాల ఆకారాన్ని ఎంచుకోవాలి. అనంతరం టర్మ్స అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి క్రియేట్ యూజర్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. దాంతో మీ యూజర్ ఐడీ క్రియేట్ అయి ఆటోమేటిక్‌గా ఆ సైట్లోకి లాగిన్ అవుతారు.
అనంతరం ఈ-మెయిల్ కన్ఫాం చేయాల్సి ఉంటుంది. అయితే అలా కన్ఫాం చేశాక మీరు ఇచ్చిన డిటేల్స్‌తో అప్పటికే ఆ సైట్లో ఉన్న డేటాబేస్‌లోని ఇతరుల ఫొటోలను పోల్చి మీలా ఎవరున్నారో ఆ సమాచారం మీకు తెలియజేస్తుంది. అంతేకాదు, మీ సమాచారం మీలా ఉన్న అవతలి వ్యక్తికి చేరుతుంది. అతను గనక ఒప్పుకుంటే మీరు అతనితో కలవచ్చు. లేదంటే మీ ఇష్టం..! ఏది ఏమైనా… ఈ సైట్ భలే ఫన్నీగా ఉంది కదూ..! ఇంకెందుకాలస్యం… మీలా ఉన్న వ్యక్తులు ఎక్కడ ఉన్నారో వెంటనే తెలుసుకోండి మరి..!