ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను 5 నిమిషాల్లోనే త‌గ్గించుకునేందుకు సింపుల్ మ‌సాజ్ టెక్నిక్‌..!

నేడు న‌డుస్తున్న‌దంతా పోటీ ప్ర‌పంచం. ఉన్న‌త శిఖ‌రాల‌కు చేరుకోవాల‌న్నా, ఉన్న‌త స్థానం పొందాల‌న్నా సంస్థ‌ల మ‌ధ్యే కాదు, వ్య‌క్తుల మ‌ధ్య కూడా ప్ర‌స్తుతం పోటీ అనివార్య‌మైంది. దీంతో ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితాన్ని నిత్యం అధిక శాతం మంది గ‌డుపుతున్నారు. అయితే అలాంటి న‌గ‌ర జీవితం ఏమో గానీ చాలా మంది రోజూ ప‌లు సంద‌ర్భాల్లో ఒత్తిళ్ల‌కు, ఆందోళ‌న‌ల‌కు లోన‌వుతూనే ఉన్నారు. దీంతో ప‌లు అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తోంది. కాగా ఒత్తిడి అనేది ఎప్ప‌టి క‌ప్పుడు మ‌న‌కు వ‌స్తూనే ఉంటుంది. అయితే దాన్ని స‌మ‌ర్థవంతంగా ఎదుర్కొంటేనే మ‌నం ఎప్ప‌టికీ ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతాం. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఓ మ‌సాజ్ టెక్నిక్ పాటిస్తే ఒత్తిడిని, ఆందోళ‌న‌ను కేవ‌లం కొద్ది క్ష‌ణాల్లోనే దూరం చేసుకోవ‌చ్చు. ఆ టెక్నిక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

massage-technique

ముందుగా క‌ళ్లు మూసుకోవాలి. చేతి బొట‌న వేళ్ల‌ను క‌నుబొమ్మల కింద పెట్టాలి. అక్క‌డి నుంచి వేళ్ల‌తో క‌నుబొమల చుట్టూ మ‌సాజ్ చేస్తూ క‌నుబొమ‌ల మ‌ధ్య‌లోకి రావాలి. అక్క‌డ రెండు వేళ్ల‌తో సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. ఇలా కనీసం 4, 5 నిమిషాల పాటు చేయాలి. దీంతో ఒత్తిడి మాయ‌మ‌వుతుంది.

పైన చెప్పిన టెక్నిక్ ద్వారా కేవ‌లం ఒత్తిడి, ఆందోళ‌న మాత్ర‌మే కాదు, ఇత‌ర స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేసుకోవ‌చ్చు. అలా మ‌సాజ్ చేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి కూడా త‌గ్గుతుంది. చేసే ప‌నిపై ఏకాగ్ర‌త పెరుగుతుంది. కంటి న‌రాలు రిలాక్స్ అవుతాయి. మెద‌డులోని ప‌లు నరాలు ఉత్తేజ‌మ‌వుతాయి. పూర్తి స్థాయిలో రిలాక్స్ అయిన ఫీలింగ్ వెంట‌నే క‌లుగుతుంది.

Comments

comments

Share this post

scroll to top