మ‌హిళ‌లపై దాడి జ‌రిగితే ఈ పాద‌ర‌క్ష‌ల‌తో దాన్ని ఆప‌వ‌చ్చు. అది ఎలాగో తెలుసా..?

నేటి త‌రుణంలో మ‌న దేశంలో మ‌హిళ‌లకు ఎదుర‌వుతున్న వేధింపుల గురించి అంద‌రికీ తెలిసిందే. వారు ఎక్క‌డికి వెళ్లినా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్క‌డ ప‌నిచేస్తున్నా అక్క‌డ పొంచి ఉండే మృగాళ్ల నుంచి వారికి వేధింపులు త‌ప్ప‌డం లేవు. దీనికి తోడు కొన్ని సంద‌ర్భాల్లో మృగాళ్లు మ‌హిళ‌ల‌పై లైంగిక దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. వారిపై అత్యాచారం, హ‌త్య చేస్తున్నారు. గాయాల‌కు గురి చేస్తున్నారు. అయితే ఇలాంటి మృగాళ్ల బారి నుంచి మ‌హిళ‌లు త‌ప్పించుకునేందుకు అప్పుడ‌ప్పుడు వారికి ప‌నికొచ్చే వ‌స్తువుల‌ను కొంద‌రు త‌యారు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ వ‌స్తువు గురించే. నిజానికి అది వ‌స్తువు కాదు, మ‌హిళ‌ల‌ను ర‌క్షించే పాద‌ర‌క్ష‌లు.

భోపాల్‌కు చెందిన యువ ఇంజినీర్ క‌పిల్ కుమార్ త‌న తోటి ఫైన‌లియర్ విద్యార్థినుల స‌హాయంతో ఓ నూత‌న త‌ర‌హా పాదర‌క్ష‌ల‌ను త‌యారు చేశాడు. ఇవి శాండిల్స్ మాదిరిగా ఉంటాయి. వీటి కింది భాగంలో ప్ర‌త్యేక వైర్‌లెస్ టెక్నాల‌జీ, బ‌ట‌న్ ఉంటాయి. అలాగే దీనికి అనుసంధానం అవుతూ మ‌రో ప్ర‌త్యేక ప‌రిక‌రం ఉంటుంది. దీన్ని మ‌హిళ‌లు త‌మ హ్యాండ్ బ్యాగ్ లేదా ప‌ర్స్‌లో పెట్టుకోవాలి. ఈ క్ర‌మంలో ఈ పాద‌ర‌క్ష‌ల‌ను ధ‌రించిన మ‌హిళ‌ల‌పై ఎవ‌రైనా దాడి చేస్తే అప్పుడు పాద ర‌క్ష‌లో ఉండే ప‌రిక‌రం యాక్టివేట్ అవుతుంది.

స‌ద‌రు పాద‌రక్ష‌ల‌ను ధ‌రించిన మ‌హిళ త‌న‌పై ఎవ‌రైనా దాడి చేస్తే వెంట‌నే కాలితో ఆ పాద‌ర‌క్ష‌ల‌ను నేల‌కు బ‌లంగా కొట్టాలి. దీంతో పాద‌ర‌క్ష‌ల కింది భాగంలో ఉండే బ‌ట‌న్ యాక్టివేట్ అవుతుంది. అది 30 సెక‌న్ల‌లోగా స‌ద‌రు మ‌హిళ స‌మాచారాన్ని స్థానికంగా ఉండే పోలీస్ స్టేష‌న్‌కు పంపుతుంది. దీంతోపాటు అదే స‌మాచారం ఆ మ‌హిళ కుటుంబ స‌భ్యుల‌కు చేరుతుంది. దీంతో వారు వెంట‌నే అల‌ర్ట్ అయి జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. ఇక బ‌ట‌న్ యాక్టివేట్ అయి స‌మాచారం చేర‌వేయ‌గానే ప‌ర్సు లేదా హ్యాండ్ బ్యాగులో పెట్టుకున్న ప్ర‌త్యేక ప‌రిక‌రం పెద్ద పెట్టున సైర‌న్‌ను మోగిస్తుంది. దీంతో చుట్టు ప‌క్క‌ల వారు అల‌ర్ట్ అయి స‌ద‌రు మ‌హిళ‌ను ర‌క్షించేందుకు వీలు క‌లుగుతుంది. అయితే ప్ర‌స్తుతం ఈ పాద‌ర‌క్ష‌లను స‌ద‌రు విద్యార్థి ప‌రీక్షిస్తున్నాడు. వీటికి పేటెంట్ వ‌స్తే త్వ‌ర‌లో మార్కెట్‌లోకి విడుద‌ల చేసేందుకు అవ‌కాశం ఉంది.

https://daily.bhaskar.com/news/TOP-HDLN-smart-safety-5797632-PHO.html?ref=hf

Comments

comments

Share this post

scroll to top