గ‌డ‌ప‌దాటి వెళ్ళ‌రాదు అనే ఆంక్ష‌లను దాటి…దేశానికే ర‌క్ష‌ణగా ఉండే సైనికురాలైంది.!!

ఎన్నో సంవ‌త్స‌రాల కాలంగా స‌మాజం కొన్ని మూఢాచారాలను, క‌ట్టుబాట్ల‌ను మహిళ‌ల‌పై విధించ‌గా, నేటికీ చాలా చోట్ల అవి కొన‌సాగుతూనే ఉన్నాయి. అలాంటి ప‌ద్ధ‌తులు కొన‌సాగుతున్న గ్రామాల్లో ఆ గ్రామం కూడా ఒక‌టి. అక్క‌డ ముఖ్యంగా ఏ కుటుంబంలో అయినా మ‌హిళ‌లు గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వెళ్ల‌రాదు. బ‌య‌టి వ్య‌క్తులు వ‌స్తే ఎప్పుడూ ముసుగు ధ‌రించే ఉండాలి. ఇక అలాంటి కుటుంబాల్లో ఉండే మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వెళ్ల‌డ‌మంటే క‌ష్టం. ఉద్యోగం చేయ‌డ‌మంటే అది సాధ్యం కాద‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ అలాంటి ఓ కుటుంబానికి చెందిన ఓ మ‌హిళ మాత్రం ఇలాంటి మూఢాచారాల‌ను తెగ తెంపి ధైర్యంగా బ‌య‌టికి వెళ్లి ఏకంగా ఆర్మీలోనే ప‌నిచేస్తోంది.

ఆమె పేరు ప్రేర్నా సింగ్‌. ఆమెది రాజ‌స్థాన్ లోని జోధ్‌పూర్ ప్రాంతం. అక్క‌డే ఉండే మంధాతా సింగ్ అనే వ్య‌క్తితో ఆమెకు నాలుగేళ్ల కింద‌ట వివాహం అయింది. కాగా వివాహం అయ్యే నాటికి ఆమె ఆర్మీ ఆఫీస‌ర్‌. 6 సంవ‌త్స‌రాల కింద‌ట ఆర్మీలో చేరింది. ఆర్మీలో ఇంజినీరింగ్ కార్ప్స్ అనే విభాగంలో ప‌నిచేస్తోంది. మీర‌ట్‌, జైపూర్‌ల‌లో ఈమె పనిచేయ‌గా, ఇప్పుడు పూనెకు ఆమెను బదిలీ చేశారు. దీంతో ఇప్పుడు ఆమె అక్క‌డే ఉద్యోగం చేస్తోంది. అయితే పైన చెప్పాం క‌దా, మూఢాచారాలు అని. అవును, అవే. అలాంటి ఓ గ్రామంలోనే ప్రేర్నా సింగ్ ఉండేది.

అయిన‌ప్ప‌టికీ ఆమె అలాంటి ఆచారాల‌కు మంగ‌ళం పాడింది. మ‌హిళ‌లు ఏదైనా సాధించ‌వ‌చ్చ‌ని నిరూపించేందుకు ఆమె ఆర్మీలో చేరి ఆఫీస‌ర్ అయింది. దీంతో త‌మ గ్రామం నుంచి ఆర్మీలో చేరిన మొద‌టి మ‌హిళ‌గా ఆమె పేరు గాంచింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డి మ‌హిళ‌ల‌కు ఆమె ప్రేర‌ణ‌గా నిలుస్తోంది. ఇక ప్రేర్నాకు ఓ కూతురు ఉంది. ఆ పాప పేరు ప్ర‌తిష్ట‌. వ‌య‌స్సు 3 సంవత్సరాలు. ఆమె నాన‌మ్మ‌, అమ్మ‌మ్మ‌ల సంర‌క్ష‌ణ‌లో పెరుగుతోంది. అయినా ప్రేర్నా మాత్రం దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలోనే కొన‌సాగుతోంది. ఈ విష‌యంలో ప్రేర్నాను అంద‌రం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top