GST వ‌ల్ల రైలు టిక్కెట్ల రేట్లు పెరిగాయ‌ని ప్ర‌యాణికుల నుంచి డ‌బ్బూలు వ‌సూలు చేశాడు ఆ టీటీఈ.. త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

జూలై 1వ తేదీ అర్థ‌రాత్రి నుంచి దేశ‌వ్యాప్తంగా జీఎస్టీ బిల్లు అమ‌లులోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో కొన్ని వ‌స్తువులు, సేవ‌లపై ట్యాక్స్‌లు పెర‌గ‌నుండ‌గా, కొన్నింటికి త‌గ్గ‌నున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చాలా మంది జీఎస్‌టీతో కూడిన బిల్లుల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అస‌లు జీఎస్‌టీలో మ‌నం ఎన్ని ట్యాక్స్‌లు క‌ట్టాల్సి ఉంటుందో చెబుతున్నారు. అయితే జీఎస్‌టీ బిల్లు ఏమో గానీ బ‌స్సు, రైలు టిక్కెట్ల రేట్లు మాత్రం పెర‌గ‌లేదు. వాటిని జీఎస్‌టీలో 0 శాతం శ్లాబ్‌లో చేర్చారు. కానీ… జీఎస్‌టీ వ‌ల్ల రైలు టిక్కెట్ రేట్లు పెరిగాయ‌ని చెప్పి ఓ టీటీఈ ఏకంగా ప్ర‌యాణికుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేశాడు. దీంతో అత‌ను చేసిన ప‌నికి జాబ్ పోగొట్టుకున్నాడు.

గుజరాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో క్వీన్ అనే పేరున్న ట్రెయిన్ ఏసీ బోగీలో ఓ రైల్వే టీటీఈ హ‌ల్‌చ‌ల్ చేశాడు. జీఎస్‌టీ బిల్లు వ‌ల్ల ట్రెయిన్ టిక్కెట్ రేట్లు పెరిగాయ‌ని చెప్పి ప్ర‌యాణికుల నుంచి ఒక్కొక్క‌రి ద‌గ్గ‌ర రూ.20 వ‌సూలు చేయ‌డం మొద‌లు పెట్టాడు. అయితే దీనికి కొంద‌రు ప్ర‌యాణికులు అడ్డు చెప్పారు. అస‌లు టిక్కెట్ రేట్లు పెర‌గ‌లేద‌ని కొంద‌రు వాదించ‌గా, పెరిగి ఉంటే ఆ రేట్ల వివ‌రాల‌ను లిస్ట్ రూపంలో చూపించాలంటూ కొంద‌రు ప్ర‌యాణికులు డిమాండ్ చేశారు.

అయితే ప్ర‌యాణికులు అలా అడిగే స‌రికి స‌ద‌రు టీటీఈ నీళ్లు న‌మిలాడు. అనంత‌రం ఆ బోగీ నుంచి వెళ్లేందుకు య‌త్నిస్తుండ‌గా ప్ర‌యాణికులంద‌రూ క‌లిసి ఈ విష‌యాన్ని రైల్వే ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వారు స‌ద‌రు టీటీఈని విధుల నుంచి తొల‌గించారు. ప్ర‌స్తుతం ఈ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఏది ఏమైనా జ‌నాలు జీఎస్‌టీ బిల్లు వ‌ల్ల పెరిగే రేట్లు ఏవో, త‌గ్గే రేట్లు ఏవో తెలుసుకుంటే మంచిది. లేదంటే ఇలాంటి వారి చేతిలో మోస‌పోవాల్సి వ‌స్తుంది జాగ్రత్త‌..!

Comments

comments

Share this post

scroll to top